9/11 మూడో టవర్ అలా కూలలేదట!

తేది : 11-09-2001 తారీఖును ప్రపంచం మొత్తం మరిచిపోయినా.. అమెరికా మాత్రం మరువలేదు. ఎందుకంటే, ఆ తారీఖునే ట్విన్ టవర్స్ ను ఉగ్రవాదులు కూల్చేశారు కాబట్టి! కానీ ప్రపంచానికి తెలియని విషయమేమిటంటే ఆ రెండు టవర్లతోపాటు మరో టవర్ కూడా కూలిందని విషయం! అయితే ఈ మూడో టవర్ మంట వల్ల కూలలేదని ఓ అమెరికన్ యూనివర్సిటీయే తన పరిశోధనలో వెల్లడించింది. ఏ యూనివర్సిటీ, పరిశోధన ఎప్పుడు చేసింది? అమెరికాలోని University of Alaska Fairbanks లో, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన, పీ హెచ్డీ విద్యార్థులు ఈ పరిశోధన చేశారు. మొత్తం నాలుగు సంవత్సరాల పాటు, బిల్డింగ్ కి సంబంధించిన అన్ని డీటైల్స్ నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కంప్యూటర్ సిములేషన్ టెక్నాలజీ ఆధారంగా వివిధ రకాల డెమాలిషన్ మాడల్స్ తో క్రాస్ చెక్ చేసుకుని, పరిశోధనా ఫలితాల్ని గతనెలలో రిలీజ్ చేశారు. (Link from university website - http://ine.uaf.edu/wtc7 ) మొత్తానికి ఏం తీర్మానించారు? అమెరికన్ ప్రభుత్వం చెప్తున్నట్లు, ఈ కూలిపోవడం అనేది మంటవల్ల అయ్యుండే అవకాశం ఏ మాత్రం లేదు, అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ********** 9/1...