నవజాత శిశువు ప్రాణాలు తీసిన వైద్యుల మతవివక్ష


ఓ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రదర్శిన మతవివక్ష ఇంకా కళ్లు కూడా తెరవని నవజాత శిశువు ప్రాణాలు తీసింది. ఈ విద్వేషపూరిత దుర్ఘటన రాజస్థాన్ రాష్టంలోని భరత్పూర్ జిల్లా కేంద్రంలో జరిగింది. చనిపోయిన బిడ్డ తండ్రి, బాధితుడైన ఇర్ఫాన్ ఖాన్ ప్రకారం భరత్పూర్ జిల్లా, సిక్రి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లామని సూచించడంతో ఇర్ఫాన్ తన భార్యను భరత్పూర్ జిల్లా జనానా ఆసుపత్రికి తరలించాడు. 

కానీ, జిల్లా ఆసుపత్రి వైద్యుడైన మోనిత్ వాలియా కేవలం గర్భవతి ముస్లిం కాబట్టి తమ హాస్పిటల్లో చేర్చుకోమని, ఇక్కడ వైద్యం చేయడం కుదరదని చెప్పి.. జైపూర్ తరలించామని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడని ఇర్ఫాన్ తెలిపాడు. దీంతో గతిలేక ఇర్ఫాన్ అంబులెన్సులో తన భార్యను ఎక్కించగానే, ఆమెకు నొప్పులు ఎక్కువై అంబులెన్సులోనే ప్రసవించింది. కానీ, ఈపాటికే ఆలస్యం కావడంతో అప్పుడే పుట్టిన శిశువు ప్రాణాలు వదిలింది. తన బిడ్డ చనిపోవడానికి జిల్లా ఆసుపత్రి వైద్యుడు మోనిత్ వాలియా నిర్లక్ష్యమే కారణమని ఇర్ఫాన్ ఖాన్ తెలిపాడు.

ఈ ఘటనపై స్పందించిన భరత్పూర్ జిల్లా జనానా ఆసుపత్రి ప్రిన్సిపాల్ రూపేంద్ర ఝా మాట్లాడుతూ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన మహిళా తన బిడ్డను కోల్పోయిన సంగతి నిజమేనని, ఆమె పరిస్థితి విషమించడంతో ఇక్కడి డాక్టర్లు జైపూర్ తీసుకెళ్లామని సూచించారని, ఈ ఘటనలో ఏదైనా నిర్లక్ష్యం జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ వార్త దావాలంలా సిసిల మీడియాలో వ్యాపించడంతో స్పందించిన రాజస్థాన్ పర్యాటక శాఖా మంత్రి, భరత్పూర్ ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ "ఈ సంఘటన వైద్య వృత్తికి సిగ్గుచేటని, దీనిపై విచారణ జరిపిస్తామని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఖండించారు. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసి కూడా ఈ సంఘటనను ఖండించారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కూడా ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
-------------------------------------------------------------------------

The heresy performed by doctors at a government hospital has opened the eyes of the newborn. The fateful incident took place in Bharatpur district of the state of Rajasthan. According to Irrfan Khan, the father of the deceased child, Irfan, from Sikri village in Bharatpur district, was taken to a local primary health center after his wife was diagnosed with acute pain. Irfan took his wife to the Bharatpur district's Janana Hospital, where doctors suggested she be taken to the district hospital. 

However, district hospital doctor Monit Walia, who is just a pregnant Muslim, told her that she would not be admitted to the hospital. Irfan was unloading his wife in an ambulance, causing her pain and causing her to be in an ambulance. However, it was late and the baby was born. Irrfan Khan said the negligence of district hospital doctor Monit Walia was responsible for the death of her child. 

Responding to the incident, Principal of Janata Hospital, Bharatpur district, Rupindra Jha, said that the woman who had come to the hospital had lost her child and that her doctors had taken her to Jaipur because of her condition. 

Rajasthan Tourism Minister, Bharatpur MLA Visvendra Singh, who reacted to the news spread by the media in Sicily, said on his Twitter account that the incident was "a shame for the medical profession." Demanded.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !