అమ్మ చనిపోయినా..

కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది . ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు . ఇందుకు నిర్వహిస్తున్న అష్రఫ్ అలీ అనే ఓ కార్మికుడి జీవితంలో జరిగిన సంఘటనే ఉదాహరణ ! అష్రఫ్ అలీ 67 ఏళ్ల తల్లి నూర్ జహాన్ బుధవారం ఉదయం మరణించారు . అయినా అష్రఫ్ అలీ మధ్యాహ్నం తన తల్లి అంత్యక్రియలను పూర్తి చేసి, మళ్లీ రెండు గంటల తరువాత అంటే సాయంత్రం తన పనికి తిరిగి వచ్చాడు . సీనియర్ ఆఫీసర్లు ఈ తెలుసుకొని అతన్ని ఇంటికి కోరినా , అష్రాఫ్ ఇంటి బాధ్యత కంటే.. ' ఈ బాధ్యత చాలా పెద్దది ' అని అధికారులకు చెప్పిన సమాధానం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమందికి స్ఫుర్తిగా నిలుస్తుంది. అష్రాఫ్ గత కొన్నేళ్లుగా నీటి పనుల విభాగంలో మురుగునీటి వాహనాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు . ఈ సందర్బంగా అష్రాఫ్ మాట్లాడుతూ , ' నా తల్లి ప్రపంచం నుండి వెళ్లిపోయింది , ఆమె వెళ్ళిపోయినా ...