కేవలం రూ.500/- లకే కరోనా కిట్ ను రూపొందించిన ముస్లిం డాక్టర్
ఓ ప్రక్క కరోనా ఎంత విజృంభిస్తున్నన్నప్పటికీ ఇండియా COVID-19 టెస్టు లు చేసే విషయంలో మిగతా అన్ని దేశాలతో పోల్చితే ఎంతో వెనుకబడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే! ఎంత అంటే 1 మిలియన్ ప్రజలకు 211 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. దానికి కారణం COVID-19 ఇంపోర్టెడ్ టెస్టింగ్ కిట్ రూ. 4500/- కావటమే! పైగా కరోనా నిర్ధారణకు 7 నుండి 8 గంటలు పట్టటమే! ఈ సమస్య నుండి బయటపడవెయ్యటానికి నోయిడా కు చెందిన ‘న్యూ లైఫ్ ల్యాబ్స్’ డైరెక్టర్ డాక్టర్. నదీమ్ రహ్మాన్ అనే ముస్లిం డాక్టర్ “కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్” ను కేవలం రూ. 500/- లకే అయిపోయే విధంగా… పైగా 15 నిమిషాల వ్యవధిలో ఫలితాలు (results) వెలువడే విధంగా విన్నుత్న కరోనా టెస్టింగ్ కిట్ ను రూపొందించటం జరిగింది. అంతేకాక, “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరియు ఇండియన్ మెడికల్ కౌన్సిల్” ద్వారా సైతం ఈ టెస్టింగ్ కిట్స్ కు ఆమోదం కూడా లభించింది . ఇప్పుడు అతికొద్ది రోజుల్లో ఈ విన్నుత్న కిట్స్ మొత్తం ఇండియా అంతా రాబోతున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నప్పటికి రోజుకు 60 వేల నుండి 70 వేల కిట్స్ వరకు సప్లై అయ్యే విధంగా డాక్టర్. నదీమ్ రహ్మాన్ మరియు టీం పనిచేస్త...