ప్రభుత్వం చెబుతున్న కరోనా లెక్కల్లో నిజమెంత ?
"తెలంగాణలో 700 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.. వాటిలో 640 పైగా కేసులకు ఢిల్లీ మర్కజ్ తో లింక్ ఉంది.. మర్కజ్ వెళ్లొచ్చిన ఇంకా చాలా మంది బయటనే ఉన్నారు.." అనేవి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న లెక్కలు! ఈ లెక్కలతో కేవలం ముస్లింల వల్లే కరోనా వ్యాపించిందని ప్రభుత్వం చెప్పకనే చెబుతోందన్నమాట! సాక్షాత్ ఓ మంత్రిగారే దీన్ని ద్రువీకరించేలా మాట్లాడటంతో కొంతమంది మతమౌఢ్యులు ముస్లింలనే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా లెక్కలను వ్యతిరేకిస్తూ కూడా కొన్ని ప్రశ్నలతో కూడిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రశ్నలు న్యాయబద్ధంగా ఉండటంతో.. వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని ముస్లిం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవే ఆ ప్రశ్నలు..
1. మర్కజ్ సమావేశం మార్చి 13న జరిగింది. మార్చి 18, 19 నాటికి మర్కజ్ వెళ్ళిన వారు చాలా మంది వెనక్కు వచ్చేశారు. నెలరోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు టెస్టులు చేయించుకోకుండా బయటే ఉన్నారని మంత్రి గారు చెబుతున్న వారికి రోగ లక్షణాలు బయటపడలేదా?
2. అలా మర్కజ్ నుంచి వచ్చిన వారి సెకండరీ కాంటాక్టుల విషయంలోను నెలరోజులు గడిచిపోయాయి. వారిలో ఎంతమందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అలా బయటపడిన వారెవరైనా ఆసుపత్రులకు వచ్చారా?
3. మర్కజ్ నిర్వహించిన కార్యక్రమ చాలా ముందస్తు ప్రణాళికతో జరిగే కార్యక్రమం. దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమం. తెలంగాణా నుంచి ఎంత మంది ఎవరెవరు మర్కజ్ వెళ్ళారనే వివరాలు మర్కజ్ వద్ద రికార్డయి ఉంటాయి. ఆ వివరాలు మర్కజ్ నుంచి తీసుకున్నారా? మర్కజ్ ఆ వివరాలు చెప్పడానికి నిరాకరించిందా? నిరాకరిస్తే ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి?
4. మర్కజ్ నుంచి ఆ వివరాలు తెలుసుకోగలిగితే, తెలుసుకుని ఉంటే, ఎంతమంది మర్కజ్ వెళ్ళారు. తిరిగి వచ్చిన వారు ఎంతమంది? అందులో పాజిటివ్ ఎంతమంది? మరణించిన వారు ఎంతమంది? ఇంకా పరీక్షలు చేయించుకోకుండా బయట ఉన్న వారు ఎంత మంది? ఈ వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు.
5. లాక్ డౌన్ ప్రకటించి, కరోనాతో తీవ్ర పోరాటం జరుగుతున్న కాలంలో మర్కజ్ వెళ్ళిన వారు టెస్టులకు రాకుండా తప్పించుకు తిరుగుతుంటే క్షమించరాని నేరం. వారి పేర్లు అడ్రసులతో సహా బయటపెట్టకుండా ఎందుకు ఊరుకుంటున్నారు?
6. తెలంగాణాలో 700 కరోనా పాజిటివ్ కేసుల్లో 640 పైగా మర్కజ్ లింక్ అన్నారు. ఈ లింక్ ప్రాథమిక కాంటాక్టు వల్లనా? సెకండరీ కాంటాక్టు వల్లనా? అసలు మర్కజ్ నుంచి వచ్చిన వారిలో ఎంతమందికి టెస్టులు చేశారు? అందులో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? వారి వల్ల ఎంతమందికి సెకండరీ కాంటాక్టు రూపంలో కరోనా సోకింది?
7. తెలంగాణాలో ఇంతవరకు ఎంతమందికి టెస్టులు చేశారు? టెస్టులు చేసిన వారిలో మర్కజ్ నుంచి వచ్చిన వారు ఎంతమంది?
ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక మంత్రిగారు స్వయంగా మర్కజ్ వల్లనే తెలంగాణాలో కరోనా విస్తరించిందని చెప్పిన తర్వాత, తబ్లీగ్ జమాఅత్ సాకుతో మొత్తం ముస్లిం సముదాయాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పటికే ముస్లిములు కరోనా వ్యాపించేలా చేస్తున్నారంటూ ఫేక్ వార్తలు ప్రచారంలో వచ్చాయి. ఆ ఫేక్ వార్తల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మన ముందుకు వచ్చాయి. మరోవైపు ముస్లిములను సోషల్ బాయ్ కాట్ ఛేస్తున్న వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఒక మంత్రిగారు మర్కజ్ వల్లనే తెలంగాణాలో కరోనా వ్యాపించిందని చెబుతుంటే అధికారికంగా, ఆధారాలతో సహా లెక్కలన్నీ వివరించాలి.
అలాగే దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులెన్ని? అందులో మర్కజ్ కేసులెన్ని? ఎంత మంది మరణించారు? మరణించిన వారిలో మర్కజ్ కేసులెన్ని? ఎంతమందికి టెస్టులు చేశారు? టెస్టులు చేసిన వారిలో మర్కజ్ కేసులెన్ని? ఈ వివరాలన్నీ ప్రజల ముందుకు రావాలి?
ఈ డాటా ఇవ్వకుండా మర్కజ్ సంఘటన లేకపోతే మనకు కరోనా ఉండేది కాదన్నట్లు మాట్లాడడం మతతత్వమే అవుతుంది.
----------------------------------------------------------------------------------
"There are 700 corona positive cases in Telangana. Over 640 of them are linked to the Delhi Markaz. Many are still outside Marcus .." The government does not say that the corona has spread to Muslims only with these calculations! Sakshit, a minister, is speaking out to confirm this. Against this backdrop, some queried posts are going viral, even opposing the corona calculations in Telangana. The Muslim community demands that the Telangana government has the responsibility to answer these questions.
These are the questions ..
- The Markaz meeting was held on March 13th. By March 18, 19, many of those who went to Markaz were turned away. Months are completed. Are those who are saying that they are out to undergo tests so far, the symptoms are not revealed?
- In the case of their secondary contacts that came from the Marcus, therefore, months passed. How many of them are exposed to corona symptoms. Did anyone else come to the hospitals?
- The event organized by Markaz is a very pre-planned event. An event that has been going on for decades. The details of how many people went to Markaz from Telangana are recorded at Markaz. Did those details come from Markaz? Did Marcus refuse to say those details? What are the actions taken by the government to refuse?
- If you can find out the details from Markaz and find out how many Markaz went. How many of those who returned? How many positives? How many are dead? How many people are out there without having to undergo tests? Why these details are not revealed.
- During the period of a lockdown and a fierce battle with Corona, those who went to the Markaz escaped from the Tests were an unforgivable offense. Why choose not to reveal their names, including addresses?
- Markaz Link said over 640 out of 700 corona positive cases in Telangana. Is this link due to basic contact? Due to secondary contact? How many of those who came from the original Markaz did the tests? How many of them got positive? How many people have been infected by corona in the form of secondary contact?
- How many Tests have been done in Telangana so far? How many of those who did the tests came from Markaz?
These questions are very important. Because the coronation of Telangana is spread by a minister himself, Markaz, attempts are made to keep the entire Muslim community in cage with the pretext of the Tabligh Jama'at. Fake news has been spreading that Muslims are already spreading corona. The controversial comments made by the Deputy Chief Minister of Andhra Pradesh on the basis of that fake news came to our attention. On the other hand, there is news that Muslims are being attacked by the social boy. In the face of all this, a minister, Markaz, said that corona spread in Telangana, officially, all the evidence, including the evidence, should be explained.
And all the corona cases around the country? What are the Markaz cases? How many people have died? What of the Markaz cases of the deceased? How many people did the tests? What of the Markaz cases of those who did the tests? Should all these details come before the public?
Without this data, it would be religious to speak of what we would not have had a corona without a Markaz incident.
Comments
Post a Comment