బెదిరింపులకు లొంగారు.. మన కొంప ముంచారు..!
అమెరికా బెదిరింపులకు తలొగ్గి మన దేశ పాలకులు మన దగ్గర ఉన్న కరోనా వ్యాప్తి నిరోధక మందు హైడ్రోక్లోరోక్విన్ను ఆ దేశానికి ఎగుమతి చేయడానికి ఒప్పుకోవడంతో ఇప్పుడు అదే మందు కొరత మం దేశానికి వచ్చేలా ఉంది. పైగా మన దేశంలో కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో కేవలం మన కంటే బలమైన దేశం కాబట్టి, అలాంటి దేశానికే తాము చేయూతనిచ్చామని గొప్పలు చెప్పుకునేందుకు మోదీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత ప్రజల ప్రాణాల మీదికి తెచ్చేలా మారింది. అమెరికాకు హైడ్రోక్లోరోక్విన్ ఎగుమతి ఆమోదం పొందిన తరువాత, రాజస్థాన్ ప్రభుత్వం 300 మి.గ్రా హైడ్రోక్లోరోక్విన్ ఔషధ మొత్తం స్టాక్ను తిరిగి ఇవ్వవలసి వచ్చింది.
హైడ్రోక్లోరోక్విన్ యాంటీ మలేరియా డ్రగ్. ఇది కరోనా వైరస్ చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ప్రతిష్టాత్మక వార్తాపత్రిక ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదిక ప్రకారం, రాజస్థాన్ ప్రభుత్వం 25 శాతం హైడ్రోక్లోరోక్విన్ 200 మరియు 400 మి.గ్రా టాబ్లెట్లను తిరిగి పంపించింది.
ఇండియన్ టైమ్స్ లో ప్రచురితమైన వార్తల ప్రకారం రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో హైడ్రోక్లోరోక్విన్‌ను ఉంచింది. ఈ హైడ్రోక్లోరోక్విన్ తీవ్రమైన పరిస్థితులలో ఉపయోగించబడుతుంది. హైడ్రోక్లోరోక్విన్ మలేరియా చికిత్సలో అలాగే ఆర్థరైటిస్ ఉన్న రోగులకు ఉపయోగిస్తారు. ఇప్పుడు అమెరికాకు ఎగుమతి చేసిన తరువాత, ఈ డ్రగ్ కొరత ఏర్పడింది.
అమెరికా అధ్యక్షుడు బెదిరింపుల ముందు భారత్ ఒక్కరోజు కూడా నిలబడలేక రెండు గంటల్లో లొంగిపోయింది. 'మహామ్మారి' నేపథ్యంలో హైడ్రోక్లోరోక్విన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గతంలో భారత్ దీని ఎగుమతిని నిషేధించింది. ఇప్పుడు కేవలం అమెరికా కోసం సొంత ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి ఆ ఔషధ ఎగుమతికి కేంద్రం అనుమతివ్వడం గమనార్హం!
---------------------------------------------------------------------------
Faced with US threats, our country's rulers have agreed to export the coronavirus drug hydrochloroquine, which we now have, to the same country. Moreover, corona is spreading rapidly in our country. Modi's decision to boast that he has done such a nation is now brought to the lives of the people of India as it is a stronger country than ours. After the approval of the Hydrochloroquine export to the US, the Rajasthan government had to return the entire stock of 300 mg hydrochloroquine drug.
Hydrochloroquine Anti-Malaria Drug. It is widely used for the treatment of coronavirus. According to the prestigious newspaper International Business Times, the Rajasthan government has returned 25 per cent hydrochloroquine 200 and 400 mg tablets.
According to reports in the Indian Times, the Congress government led by Ashok Gehlot has placed large quantities of hydrochloroquine in Rajasthan. This hydrochloroquine is used in extreme situations. Hydrochloroquine is used in the treatment of malaria as well as in patients with arthritis. Now, after exporting to the US, this drug shortage has occurred.
India surrendered within two hours, unable to stand a single day before threats by the US president. India has previously banned its exports in view of the demand for hydrochloroquine in the wake of the 'pandemic'. It is noteworthy that the Center is now allowed to export the drug to the interests of its own people, just for America!
Comments
Post a Comment