తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం !

బంజేరుపల్లి .. తెలంగాణలో చిన్న పల్లెటూరు . 120 గడపలు ఉంటాయి . సిద్దిపేట జిల్లాలోని ఈ గ్రామంలో సూర్యుడు ఎప్పుడూ ' అస్తమించడు '! పగలంతా వెలుతురు ఇచ్చి , రాత్రయ్యే సరికి సోలార్ విద్యుత్ రూపంలో పల్లెలో విహరిస్తూ ఉంటాడు . ఈ గ్రామంలో మొత్తం 120 ఇళ్లకుగాను 120 ఇళ్లు .. అంటే వంద శాతం ఇళ్ల పైకప్పు మీద సౌర ఫలకాలే కనిపిస్తాయి . నాలుగేళ్ల క్రితం కరెంటు కోతలతో గ్రామంలోని ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూ ఉండేవారు . విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి . కానీ ఇప్పుడు ఈ ఊరి రూపమే మారిపోయింది . నాబార్డ్ తోడ్పాటు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ( నాబార్డ్ ) చొరవతో బంజేరుపల్లిలో ప్రతి ఇంటిలోనూ సౌర విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి . విద్యుత్ పొదుపు చేసే విధానానికి బంజేరుపల్లి ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది . సంపూర్ణ సోలార్ గ్రామంగా రూపొందించడానికి గ్రామసభలో తీర్మానం చేసి , ఉత్సాహంగా ముందుకు వచ్చారు . గ్రామంలోని 120 ఇళ్ల మీద సౌర ఫలకాలు వెలిశాయి . నాబార్డు , స్థానిక ఏ...