చైనా వల్లే కరోనా : ట్రంప్

చైనాలోని వుహాన్ నగరం కేంద్ర బిందువుగా.. నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఆ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ మహమ్మారిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్.. ఓ వివాదాస్పద కామెంట్ చేశారు. కోవిడ్19 వ్యాధిని చైనీస్ వైరస్ అంటూ ఆయన సంబోధించారు. చైనీస్ వైరస్ వల్ల అమెరికా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ ఆయన ఘాటుగా స్పందించారు. దీనిపై డ్రాగన్ దేశం ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ట్రంప్ వ్యాఖ్యలు సరైన రీతిలో లేనట్లు ఆరోపించింది. కరోనా వల్ల ఎయిర్‌లైన్స్‌తో పాటు నష్టపోయిన ఇతర పరిశ్రమలకు శక్తివంతమైన సపోర్ట్ ఇస్తామని ట్రంప్ తాజాగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే అదే ట్వీట్‌లో ఆయన వివాదాస్పద మాటను కూడా వాడారు. చైనీస్ వైరస్ వల్ల ప్రభావానికి లోనైన పరిశ్రమలను ఆదుకుంటామన్నారు. చైనా సీనియర్ దౌత్యవేత్త యంగ్ జేచీ .. కరోనాపై అమెరికా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కోవిడ్19 నియంత్రణకు తీవ్...