అమాయకుడిపై అభాండం.. ఇదంతా మీడియా నిర్వాకం..!


దేశంలో ఎవరికీ కరోనా పాజిటివ్ వచ్చినా.. అది ముస్లింల వల్లే వచ్చిందనేలా అబద్ధాలను వండి వార్చుతున్న మీడియా కారణంగా ఓ పేదవాడు శల్య పరీక్షకు సిద్దపడాల్సి వచ్చింది. ఎక్కడో మహమ్మారిని తగిలించుకొని వచ్చిన ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి చెందిన ఓ ధనిక కుటుంబం.. తమ దగ్గర పనిచేసే ఓ బీద సెక్యూరిటీ గార్డ్ వల్లే తమకు కరోనా సోకిందని ఆరోపించి, ఆ పేదవాడిపై లేనిపోని అభాండాలు మోపింది. కానీ, చివరగా ఆ సెక్యూరిటీ గార్డ్ రిపోర్టులు నెగెటివ్ రావడంతో బలిసిన కుటుంబం కావాలనే ఆ పేద ముస్లింను బద్నామ్ చేసిందని తేలింది.

అసలు సంగతేమిటంటే.. సదరు ధనిక కుటుంబంలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందుకు తమ సెక్యూరిటీ గార్డే కారణమని ఆ కుటుంబం ఆరోపించింది. పైగా, ఆ గార్డ్ ముస్లిం కావడంతో.. ఆ ధనికులు గార్డ్ కిందటి నెలలో మర్కజ్ కు వెళ్లాడని, కొన్ని రోజులు అక్కడే ఉంది వచ్చాడని కూడా పోలీసులకు తెలిపారు. గార్డ్ మాత్రం తాను మర్కజ్ పోలేదనీ, అక్కడికి కొంత దూరంలో ఉన్న మస్జీద్ వెళ్లి, నమాజ్ చేసుకొని తిరిగి వచ్చానని ఎంతలా మోతుకుకున్నా, పోలీసులు ఈ విషయాన్ని ఏమాత్రం వినకుండా, కేవలం ధనికులకే వత్తాసు పలికారు. దీంతో సదరు గార్డును క్వారంటైన్ కేంద్రానికి తరలించి, కరోనా పరీక్షలు జరిపించంగా, అతని రిపోర్టులు నెగెటివ్ వచ్చాయి. 

ఇదిలా ఉంటె, ఎలాంటి ఆధారం లేకుండా గార్డుపై నిందలేలా వేశారని కరోనా సోకినా ముగ్గురు ధనిక వ్యక్తులను అడిగితే.. "మీడియాలో చెబుతున్నారు కదా.. ముస్లింల వల్లనే కరోనా వస్తుందనీ.. అందుకే మేము మా ముస్లిం గార్డును అనుమానించాం .." అని చెప్పి  కరోనా వ్యాప్తి వార్తల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఎలా ఉందో పరోక్షంగా స్పష్టం చేశారు.
-----------------------------------------------------------------

A poor man had to undergo surgery on the media due to the false media claiming that it came from the Muslims. A wealthy family from the Defense Colony in Delhi, who had come here with a pandemonium. But finally, the security guard's reports have shown that the coming of the negative has made the poor Muslim want to be a family. 

Actually, three of the wealthy family got corona positives. The family blamed the security guard for this. Moreover, as the guard was Muslim, the rich told the police that the guard had gone to Markaz last month and had been there for a few days. Despite the fact that the guard was not Markaz, he went to the mosque some distance away and came back to worship. This moved the guard to the Quarantine Center, where Corona was being tested and his reports came back negative. 

Meanwhile, if Corona Sokina asks the three richest people about the blame on the guard without any evidence .. "What the media says .. Corona is due to the Muslims .. Therefore we doubt our Muslim guard .." said.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !