నిజాముద్దీన్ ఘటనపై పుకార్లు రేపిన దుండగుడి అరెస్ట్
కరోనా వ్యాప్తిపై తప్పుడు పుకార్లు పుట్టించడమే కాకుండా, అందుకు ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లిన తబ్లీఘీ జమాత్ సభ్యులు కారణమని సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టి విద్వేషాలకు కారణమైన దుండగుడిని హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీక్ భరద్వాజ్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేశాడని పోలీసులు తెలిపారు. క్వారంటైన్లో భాగంగా ఆసుపత్రిలో ఉంచిన ఇద్దరు జమాత్ కు చెందిన కరోనా అనుమానితులు పారిపోయారని ఇతను తన పోస్టులో పేర్కొనడంతో, ఈ పుకారు జిల్లా మొత్తం వ్యాపించి ప్రకంపనలు ముస్లిమా పట్ల విద్వేషాలకు కారణమయ్యాయి. ఈ విషయమై విచారణ చేపట్టిన యమునానగర్ పోలీసులు ఈ పుకార్లకు కారకుడైన ప్రతీక్ భరద్వాజ్ ను అదుపులోకి తీసుకొని తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, యమునానగర్ నుంచి ఢిల్లీ వెళ్లిన మొత్తం 14 మంది కరోనా నివేదిక కూడా ప్రతికూలంగా రావడం గమనార్హం!
--------------------------------------------------------------------------------------
The Yamunanagar police in the state of Haryana have arrested an alleged thug for allegedly spreading false posts on social media due to the false rumors of the corona outbreak and due to Tablighi Jamaat members who went to Delhi Nizamuddin Markaz. Police said that a man named Pratik Bharadwaj had spread such rumors through his Facebook post. The rumor spread throughout the district, which sparked outrage over Muslims, as he claimed in his post that two Jamaat-based Corona suspects who had been placed in the hospital as part of the Quarantine had fled. The Yamunanagar police, who are conducting an investigation into the matter, have arrested Prattik Bharadwaj, who is responsible for the rumors, formally announcing on his official Twitter account. Meanwhile, the Corona report of all 14 people who traveled from Yamunanagar to Delhi was also negative!
Comments
Post a Comment