తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి ముదురుతోందా.. తగ్గుతోందా..?

దేశంలో కరోనావైరస్ కేసుల రెట్టింపు రేటు ఏప్రిల్ 29వ తేదీ నాటికి 11.3 రోజులకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఈ రేటు 7.5 రోజులు అని, మార్చి 25వ తేదీ.. అంటే దేశంలో లాక్‌డౌన్ అమలు చేయకముందు 3.4 రోజులు అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితేంది.. అనే ప్రశ్న ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలను తొలిచివేస్తోంది. కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయిన కేసుల సంఖ్య ఎన్ని రోజుల్లో రెట్టింపు అవుతోందో ఆ రోజుల్ని బట్టి ఈ రేటును లెక్కిస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఈ రేటు ఆంధ్రప్రదేశ్‌లో 10.6 రోజులు, తెలంగాణలో 9.4 రోజులు అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశంలో తొలి కోవిడ్-19 కేసు 2020 జనవరి 30వ తేదీన నమోదైంది. అప్పట్నుంచి 44 రోజులకు వంద కేసులు నమోదు కాగా.. తర్వాతి వంద కేసులు ఆరు రోజుల్లో, ఆ తర్వాతి 200 కేసులు కేవలం రెండు రోజుల్లోనే నమోదయ్యాయి. అనంతరం ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతూ వచ్చింది. ఏప్రిల్ 9వ తేదీ నాటికి దేశంలో కేసుల సంఖ్య 6400 దాటగా.. అవి రెట్టింపై 12800 దాటడానికి వారం రోజులు పట...