"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

ఇప్పటికే దారుణ పరిస్థితుల్లో ఉన్న వృత్తులను లాక్ డౌన్ మరింత ప్రమాదంలోకి తోసింది. చేనేత, మరనేత రంగాలు ఇప్పుడు ఇదే ఇబ్బందుల్లో ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల బట్టల వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. లాక్ డౌన్ తరువాత కూడా పాత వేగంతో ముందుకెళుతుందన్న భరోసా లేదు. దీని ప్రభావం నేత కార్మికులపై తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నేత కార్మికులుగా పిలుస్తున్న వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు చేతితో మగ్గంపై నేతనేసే వారు, చేనేత కార్మికులు. రెండోవారు, కరెంటు మెషీన్ల మీద నేతనేసేవారు. వీరినే మరనేత కార్మికులు అంటున్నారు. లాక్ డౌన్ ఇప్పుడు ఇద్దర్నీ ఇబ్బంది పెడుతోంది. పెళ్లిళ్ల సీజన్లు, రెగ్యులర్‌గా వచ్చే ఆర్డర్లు అన్నీ పోయాయి. ఒక అంచనా ప్రకారం ఒక్క తెలంగాణలోనే చేనేత కార్మికుల దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు ఉండిపోయాయి. తెలంగాణలో సగటున నెలకు 40-50 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో సగం పట్టు చీరలే. ఇప్పటి వరకూ నేత కార్మికులు తమ దగ్గర ముడి సరకు ఉన్నంత వరకూ పనిచేశారు. లాక్ డౌన్ వల్ల మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే ముడి సరకు ఆగిపోయింది. దీంతో పని ఆపేయాల్సి వచ్చింద...