ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు
నిజాముద్దీన్ సంఘటన తరువాత నగరంలో ఢిల్లీలో ముస్లింలపై ద్వేషపూరితంగా జరిగిన దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మైనారిటీ కమిషన్ నగర పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. జాతీయ రాజధాని శాస్త్రి నగర్ ప్రాంతంలో ముస్లింలను బహిష్కరించే ప్రయత్నం చేయడంతోపాటు బవానాలో ఒక ముస్లిం యువకుడిపై జరిగిన దాడి వ్యవహారంలో పోలీసు చీఫ్ తీరును మైనారిటీల ప్యానెల్ తప్పుబట్టింది. ఈ రెండు విషయాలపై డిఎంసి కమిషనర్ నుంచి వారం రోజుల్లో నివేదిక కోరినట్లు ప్యానెల్ బుధవారం తెలిపింది. ఏప్రిల్ 5 న చిత్రీకరించబడిన శాస్త్రినగర్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను నోటీసుకు జతచేసినట్లు డీఎంసీ చైర్ పర్సన్ జఫరుల్ ఖాన్ తెలిపారు. ఈ వీడియోలో ఒక సమూహం వీధిలో సమావేశం నిర్వహించి ముస్లింలను కాలనీలోకి ప్రవేశించకుండా ఆపాలని, ఇతర కాలనీల్లోని ప్రజలను కూడా ఇదే విధంగా చేయమని వారు తమ సమావేశంలో రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని ఆయన వివరించారు. రెండవ నోటీసులో భోపాల్‌లో జరిగిన తబ్లిఘి జమాత్ సమావేశానికి హాజరైన మహబూబ్ అనే యువకుడు బవానా హరేవాలి గ్రామంలో కొట్టబడి...
Comments
Post a Comment