భారత్‌కు అప్పీలును తిరస్కరించిన బ్రిటన్

భారతదేశం పరారీలో ఉన్నట్లు ప్రకటించిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్‌లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మోసం, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేతకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై భారతదేశానికి తనను అప్పగించవద్దని కోరుతూ అప్పీలు చేయటానికి సమర్పించిన దరఖాస్తును బ్రిటన్ సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. మాల్యాను భారతదేశానికి అప్పగించాలంటూ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోంమంత్రి ఆమోదించారు. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆయన అప్పీలును కొట్టివేస్తూ ఏప్రిల్ 20వ తేదీన తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీలు చేయటానికి విజయ్ మాల్యా దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్పీలుకు సంబంధించి భారత ప్రభుత్వ స్పందనను ఈ వారం ఆరంభంలో కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఆయన దరఖాస్తును తిరస్కరించింది. దీంతో బ్రిటన్‌లో మాల్యాకు అన్ని దారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు భారత్‌కు అప్పగించే నిర్ణయం తిరిగి హోంమంత్రి ప్రీతి పటేల్ ముందుకు వెళ్తుంది. సుప్రీం ఆదేశాలు వెలు...