కులమతాలకతీతంగా మస్జిదులో రోజూ 800 మందికి అన్నదానం


కరోనా పేరిట కొంతమంది వారిని ఎన్ని విధాలుగా వివక్షకు గురిచేస్తున్నా.. వారు మాత్రం తమ ఆచరణలో మానవత్వాన్ని ప్రదర్శిస్తూ కోట్ల మంది హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా గణాంకాల ప్రకారం ప్రస్తుత కరోనా సహాయక చర్యల్లో ముస్లింల ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉందని తేలడం గమనార్హం! ఈ నిజాలకు ముంబై ముస్లింలు సాక్ష్యంలా నిలుస్తున్నారు.

ముంబైలోని సాకినాక ప్రాంతంలోని ఒక మసీదు ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 800 మంది నిరుద్యోగ కార్మికులకు మసీదు ప్రాంగణంలోనే కులమతాలకతీతంగా రోజూ అన్నదానం చేస్తూ అక్కడి ముస్లింలు ఆదర్శ0గా నిలుస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈ మసీదు చుట్టుపక్కల ప్రజలకు ప్రతిరోజూ రేషన్ కూడా అందించబడుతుంది. 

సహాయక చర్యల్లో నిమగ్నమైన మసీదు బృంద సభ్యులు మౌలానా సనబాలి మాట్లాడుతూ కోవిడ్ -19 మాదిరిగా ఆకలి కూడా మతానికి అతీతమైనదని, ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుందన్నారు. అందుకే తమ వంతుగా ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఆహారం పంపిణీ సమయంలో కరోనా సంక్రమణ ప్రమాదం గురించి వారిని అడిగినప్పుడు, ఆహారాన్ని శుభ్రంగా వండుతారు, వడ్డించేటప్పుడు సామాజిక దూరాన్ని అనుసరిస్తారని సన బాలి చెప్పారు. 
-----------------------------------------------------------------------------

No matter how many people discriminate against them in the name of Corona, they are still practicing humanity in their practice and winning millions of hearts. According to social media statistics, it is noteworthy that the representation of Muslims is the highest in the current corona support campaign! Mumbai Muslims stand as evidence of these facts. 

The Muslim community is ideally positioned to provide relief to over 800 unemployed workers who lost their jobs due to a lockdown under a mosque in Sakinaka, Mumbai. Not only this, but daily ration is also provided to the people around the mosque. 

Maulana Sanabali, a member of the mosque group engaged in auxiliary activities, said that hunger, like Kovid-19, is beyond religion, and that it affects anyone. This is why no one wants to be hungry, "he said. When asked about the risk of corona infection during food distribution, Sanali Bali said that food is cooked cleanly and follows social distance when it comes to serving.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !