విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!


వార్తలను ప్రసారం చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న జాతీయ మీడియా సంస్థ 'ఏబీపీ న్యూస్ ఛానల్' ఇప్పుడు కేవలం ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ.. ప్రజావ్యతిరేక వార్తలను, జనాల్లో విద్వేషాలను పెంచిపోషించే సమాచారాన్ని ప్రసారం చేస్తూ తన చరిత్రకు తానే మచ్చ తెచ్చుకుంటోంది. ఇందుకు మొన్న బాంద్రా రైల్వే స్టేషన్ సంఘటనే ఉదాహరణ ! అసలు విషయమేమిటంటే.. కొన్ని రోజుల కిందట "ఏబీపీ మాఝా" అనే మరాఠీ న్యూస్ ఛానెల్లో " ఏప్రిల్ 14వ తేదీ నుంచి లాక్ డౌన్ వల్ల ముంబైలో ఇరుక్కున్న ఇతర ప్రాంతాల ప్రజలను వారి వారి స్వస్థలాలకు చేర్చాలనే ఉద్దేశ్యంతో రైళ్లు నడిపించనున్నారు.." అనే వార్త ప్రసారం చేశారు. ఈ వార్త గురించి రాహుల్ కులకర్ణి అనే రిపోర్టర్ లైవ్లో మాట్లాడుతూ వివరించారు. దీంతో మొన్న 14న వందల సంఖ్యలో పేదలు ముంబై బాంద్రా రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఫలితంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఆంక్షలకు తూట్లు పడ్డాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడికి చేరుకొని ఇంటికి వెళ్తామనే ఆశతో స్టేషన్ వచ్చిన పేద జనాలను తమ లాఠీలకు పని చెప్పి మరీ చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ గొడవంతా కేవలం ఏబీపీ మాఝా ఛానల్ ప్రసారం చేసిన తప్పుడు వార్త వల్లే జరిగింది. ఇందుకు కారణమైన ఆ ఛానల్ రిపోర్టర్ రాహుల్ కులకర్ణి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. తమ ఛానల్ ప్రసారం చేసిన తప్పుడు వార్త కారణంగానే బాంద్రా స్టేషన్ చేరుకున్న పేదలందరూ ముస్లింలనీ.. వారందరూ సదరు స్టేషన్ పక్కనున్న జామా మస్జిదులో నమాజ్ చేయడానికి వచ్చిన ముస్లింలని ఇదే న్యూస్ ఏబీపీ హిందీ న్యూస్ ఛానల్ మరో అసత్య వార్తను ప్రసారం చేసి, పరోక్షంగా విద్వేషాలను రెచ్చగొట్టింది. ఈ వార్త ప్రసారం సమయంలో ఈ ఛానల్ కెమెరా అక్కడెక్కడో దూరంగా ఉన్న జామా మస్జిదుపై ఫోకస్ పెట్టింది గానీ, జనాలు పోగైన స్టేషన్ రైలు పట్టాలను పట్టించుకోలేదు. దీన్నిబట్టి ఏబీపీ ఛానల్ కావాలనే ముస్లింలను టార్గెట్ చేస్తోందని స్పష్టమవుతోంది. ఏదేమైనా బాధ్యతతో కూడిన వృత్తిలో ఉన్న ఏబీపీ జర్నలిస్టులు ఇలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఈమధ్య కాలంలో ఎక్కువైపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
--------------------------------------------------------------------------------

The national media company 'ABP News Channel', which specializes in broadcasting news, is now merely horning the government. The Bandra Railway Station is an example of this! As a matter of fact, a few days ago, "ABP Majha" aired on the Marathi news channel "Lockdown from April 14th. The people of other parts of Mumbai will be on the train for the purpose of getting people back to their homes." Rahul Kulkarni, a reporter who spoke on the news, spoke live on the news. Hundreds of poor people reached Mumbai's Bandra railway station on the 14th. As a result, the government has imposed lock-down sanctions. At that time a large number of police forces had to disperse the poor people who had come to the station in the hope of getting home and working their batons. This was just a bad news broadcast by ABP Majha channel. The channel's reporter Rahul Kulkarni is now in police custody.

Meanwhile, all the poor Muslims who came to Bandra station due to the false news of their channel were Muslims. At the time of this news channel, the channel's camera was focusing on the Jama Masjid, away from there, but the crowded station railway tracks were overlooked. It is clear that the ABP channel is targeting Muslims. However, the ABP journalists in the profession who are in charge of the profession are spreading false news.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !