పక్క రాష్ట్రంలో 180కి చేరిన బాధితులు

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జిల్లాల వారిగా నెల్లూరులో అత్యధికంగా 32, కృష్ణా 27, గుంటూరు 23, వైఎస్సార్ కడప 23, ప్రకాశం 18, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 15, చిత్తూరు 10, తూర్పు గోదావరి 11, అనంతపురంలో 2 పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఏపీలో కరోనా మృతుల సంఖ్య రెండుకి చేరింది. శుక్రవారం నాడు విజయవాడలో తొలి కరోనా మృతి నమోదు కాగా.. శనివారం ఉదయం హిందూపూర్‌కు చెందిన కరోనా బాధితుడు మృతి చెందారు. --------------------------------------------------------------------------------- A media bulletin, released by Medical and Health Department Special Secretary CS Jawahar Reddy, stated that Krishna district has reported the highest, with 27 cases while Guntur district saw 23 persons testing positive for the dreaded virus. In YSR Kadapa dist...