ఇంధన ధరల పెంపులో మనమే ప్రపంచంలో No. 1
ప్రపంచంలోనే పెట్రోల్,డీజిల్ పై అత్యధిక ట్యాక్స్ విధిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. గత రాత్రి కేంద్రప్రభుత్వం పెట్రోల్ పై రూ.10,డీజిల్ రూ.13 ఎక్పైజ్ సుంకాన్ని పెంచడంతో ప్రపంచంలో ఆయిల్ ధరలపై అత్యధిక ట్యాక్స్ విధిస్తున్న దేశంగా భారత్ నిలిచింది.
ఫ్యూయల్ రీటైల్ ధరపై ఫ్రాన్స్,జర్మనీ దేశాల్లో ట్యాక్స్ 63శాతం ఉండగా,ఇటలీలో 64శాతం,బ్రిటన్ లో 62శాతం,స్పెయిన్ లో 53శాతం,జపాన్ లో 47శాతం,కెనడాలో 33శాతం,అమెరికాలో కేవలం 19శాతం మాత్రమే ఉన్నాయి. గతేడాది వరకు భారత్ లో పెట్రోల్,డీజిల్ రెండింటి రీటైల్ ధరపై 50శాతం వరకు ట్యాక్స్ లు ఉండేవి. అయితే ప్రస్తుతం 69శాతంతో వరల్డ్ నెం.1గా భారత్ నిలిచింది.
మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాలు వరుసగా ఆయిల్ ధరలపై ట్యాక్స్ లను పెంచుతున్నాయి. సోమవారం ఢిల్లీ సర్కార్.. పెట్రోల్,డీజిల్ ధరలపై ముప్పై శాతం వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (Vat)ను పెంచింది. కాగా, ఇప్పటికే గత నెలలో అసోం రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పెంచింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. పెట్రోల్ పై VATను లీటర్ పై 2రూపాయలు,డీజిల్ పై 1రూపాయిని పెంచినట్లు ఉత్తరప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి సురేష్ ఖన్నా ఇవాళ తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వం ఆయిల్ ధరలపై ట్యాక్స్ ను పెంచగా,గత నెలలో నాగాలాండ్ కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
----------------------------------------------------------------
India is the world's largest tax levy on petrol and diesel in the world. Last night, India became the world's largest tax collector on oil prices after the central government raised the excise duty on petrol and diesel by Rs 13 per liter.
Taxes on fuel retail are 63 per cent in France and Germany, 64 per cent in Italy, 62 per cent in Britain, 53 per cent in Spain, 47 per cent in Japan, 33 per cent in Canada and just 19 per cent in the US. Until now, in India, taxes on petrol and diesel were up to 50 per cent of the retail price. However, India is currently ranked No. 1 in the world with 69%.
On the other hand, various states in the country are continuously raising taxes on oil prices. Delhi Sarkar on Monday increased the value added tax (VAT) on petrol and diesel. Last month, the state government of Assam also raised the VAT on petrol and diesel prices. Yogi Adityanath Sarkar has also joined the list. Uttar Pradesh Finance Minister Suresh Khanna has raised the VAT on petrol by Rs 2 per liter and diesel by Rs 1 on diesel.
The Government of Tamil Nadu has raised the tax on oil prices and Nagaland has taken a similar decision in the past month. Considering the current state of affairs .. all states are likely to increase VAT on petrol and diesel.
Comments
Post a Comment