తెలంగాణలో కరోనా లెక్కలు గజిబిజి : హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షల తీరుతెన్నులపై రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం అనుమానితులకే పరీక్షలు ఎందుకు చేస్తున్నారని, అందరికీ ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి స్థాయి పరీక్షలు చేయకపోతే కరోనా వ్యాప్తికి సంబంధించిన వాస్తవాలు తెలియవని హైకోర్టు కామెంట్ చేసింది. ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగానే పరీక్షలు చేస్తున్నామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్ష చేయాలని WHO మార్గదర్శకాల్లో ఎక్కడుందో చూపించాలని ప్రశ్నించింది కోర్టు. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు ఎందుకు చేయడం లేదో వివరించాలని స్పష్టం చేసింది. గజిబిజి లెక్కలతో ప్రజలకు వాస్తవాలు తెలియని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మే 14వ తేదీకి వాయిదా వేసింది.
----------------------------------------------------------------------
The state High Court has expressed dissatisfaction over the conduct of the corona exams in Telangana state. The PIL filed by retired Professor PL Visvesvara Rao was held in the High Court on Friday. The High Court has asked the AG why it is not doing coronary examinations for the bodies. The government has questioned why it is testing only suspects and not all. The High Court has commented that the facts of corona outbreak are not known unless a thorough examination is done. The AG told the High Court that the World Health Organization (WHO) is testing the Center's guidelines. The court asked to show where the WHO guidelines are for testing only those with corona symptoms. It is clear that as many people as possible should explain why the tests are not done. People with fuzzy calculations believe the facts are unfamiliar. Further hearing on the petition was postponed to May 14.
Comments
Post a Comment