మరోసారి గ్యాస్ లీకేజీ.. రోడ్లపైకొచ్చిన ప్రజలు


విశాఖ నగరంలో గ్యాస్ లీకేజీ ఆందోళన, భయం రాత్రి కూడా కొనసాగాయి. ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకవుతున్నట్లు సమాచారం రావడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలవైపు పరుగులు తీశారు. గురువారం రాత్రి కూడా ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ విడుదల కావడాన్ని గుర్తించిన స్థానిక అధికారులు వేపగుంట, నాయుడుతోట, కంపెనీ సమీప గ్రామాలను ఖాళీ చేయించారు. అయితే, గ్యాస్ లీక్ ఏమీ లేదని, ముందు జాగ్రత్తగా 4 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించామని డీజీపీ స్పష్టం చేశారు. న్యూట్రలైజర్ కెమికల్‌తో ఎల్జీ పాలిమర్స్ దగ్గరకు చేరుకున్న బృందం తమ పని మొదలుపెట్టే ముందు సమీపం గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించాల్సిందిగా సూచించింది. లీకేజీ ఏమీ లేదని, ఉదయం లీకైన ఛాంబర్ నుంచి అందులో మిగిలిపోయిన గ్యాస్ బయటకు వస్తోందని డీజీపీ వెల్లడించారు.




విశాఖపట్నంలో బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాత నగర్ తదితర ప్రాంతాల ప్రజలంతా ఇళ్లు వదిలి నగరం వైపు వచ్చారు. ఎల్జీ పాలిమర్స్ పేలిపోతుందనే ప్రచారం కొనసాగటంతో చాలామంది ఇళ్లను వదిలి దూరంగా, బయటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతతో విజయనగరం జిల్లా వైపు వాహనాల్లో బయలుదేరారు. వారందరి పేర్లు నమోదు చేసుకొని పోలీసులు ఆ జిల్లాలోకి అనుమతించారు. పెందుర్తి, మీదుగా ఎస్.కోట, హనుమంతవాక వరకు ఎక్కడ చూసినా రోడ్లన్నీ ప్రజలు, వాహనాలతో నిండిపోయాయి.



గ్యాస్ లీకేజీ నివారణకు ప్రత్యేక బృందం రాక
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక రసాయనాలు (కెమికల్)ను తీసుకుని ప్రత్యేక బృందం (టెక్నీషియన్స్) ముంబయి, పుణె, నాగ్‌పూర్‌ల నుంచి విశాఖ విమానాశ్రయానికి కార్గో విమానంలో రాత్రి 10:30 గంటలకు చేరుకున్నారు. పారా-టెర్షరీ బ్యుటైల్ కెటెకాల్ (పీటీబీసీ) అనే ఈ ప్రత్యేక రసాయనంతో ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన ప్రమాదకర వాయువు స్టైరీన్‌ ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. "ఎయిర్ ఇండియా కార్గో విమానం పీటీబీసీ కెమికల్‌తో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రి 10.30 గంటలకు చేరుకున్న ఈ విమానంలో 9 మంది నిపుణుల బృందం కూడా వచ్చింది. వీరంతా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్దకు బయలుదేరారు" అని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. ఈ కెమికల్ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా వాపిలో తయారవుతుంది. దీన్ని ప్రమాదకర వాయువుల లీకేజీని అరికట్టేందుకు, వాటివల్ల తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఈ కెమికల్‌తో త్వరితగతిన గ్యాస్ లీక్‌ను అరికట్టవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. స్టైరీన్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించేందుకు తమకు పీటీబీసీ కెమికల్ పంపించాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీని కోరారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుఝామున స్టైరీన్ గ్యాస్ విడుదల కావడంతో సమీప ప్రాంతాల్లోని కొందరు స్థానికులు ప్రాణాలు కోల్పోగా, వందల మంది అస్వస్థతకు గురయ్యారు.
----------------------------------------------------

Gas leakage anxiety and fear in Vishakha city continued into the night. Locals have come out on the roads and run towards safe areas after reports of gas leaking from LG Polymers once again. Local authorities also detected the release of gas from LG Polymers on Thursday night, evacuating nearby villages of Veepagunta, Naidu Garden and the company. However, the DGP asserted that there was no gas leak and that the people of 4 villages had been evacuated with caution. A group approached by LG Polymers with Neutralizer Chemical suggested that they evacuate the people of the nearby villages before starting their work. There is no leakage, the leakage of the leak from the chamber in the morning leakage, said the DGP.

In Visakhapatnam, people from Baji Junction, Gopalapatnam, Sujatha Nagar and others came to the city. Many people have left home and moved away, as the campaign for the LG Polymers exploded. A large number of people set out in vehicles towards Vijayanagaram district, anxious to save lives. All the names were registered and the police were allowed into the district. From Pendurthy, to the S. Kota and Hanumantawaka, the road is full of people and vehicles.

The arrival of a special team for the prevention of gas leakage
With the initiative of the Central and State Governments, Special Chemicals (Technicians) arrived from Mumbai, Pune and Nagpur on a cargo flight to Visakha airport at 10:30 pm. Experts say that the hazardous gas emitted from LG polymers can reduce the effect of styrene with this special chemical, called para-ternary butyl catechol (PTBC). "The Air India cargo plane landed at Visakha airport with PtebC Chemical. This chemical is manufactured in Vapi, Valsad district of Gujarat. It is used to prevent leakage of hazardous gases and to minimize the side effects. Authorities expect a rapid gas leak with this chemical. AP CM YS Jaganmohan Reddy has asked Gujarat CM Vijay Rupani to send them PTC Chemical to reduce the effect of styrene gas. Some locals in nearby areas lost their lives and hundreds were sick following the release of styrene gas early Thursday morning at LG Polymers in Visakha.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !