ఇకపై మద్యం హోం డెలివరి ?
లాక్‌డౌన్ సడలింపులతో మద్యం దుకాణాలను తెరిచిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మద్యాన్ని నేరుగా ఇంటికే డెలివరీ చేయాలని పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు నిర్ణయించాయి.
దుకాణాల వద్ద వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నేటి నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్టు పంజాబ్ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ శాఖ తెలిపింది. ఎంత సమయంలో మద్యాన్ని డెలివరీ చేస్తారనే విషయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. అలాగే, ఇంటికి రెండు లీటర్లకు మించి మద్యాన్ని డెలివరీ చేయబోమని తెలిపింది.
పశ్చిమ బెంగాల్ కూడా ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. 21 ఏళ్లు దాటిన వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్టు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ సైట్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నారు.
--------------------------------------------------------------
The state governments, which opened liquor stores with lockdown easing, have now made another sensational decision to curb the spread of the virus. The Punjab and West Bengal governments have decided to make liquor delivery straight away.
The Punjab State Excise and Taxation Department has announced that the liquor will be delivered home from today to prevent the spread of the virus at the stores. The respective departmental commissioners will decide how long the liquor will be delivered. Also, it said it would deliver alcohol beyond two liters per household.
West Bengal has taken a similar decision. State Beverages Corp. said it will provide home delivery of alcohol to those over the age of 21. For this purpose, a website was created. Home delivery of alcohol will be made to those who order on this site.
Comments
Post a Comment