ఖైదీల తిరుగుబాటు.. కాల్పుల్లో 9 మంది మృతి !


పెరూదేశం లీమా పట్టణం లోని మైగుల్ క్యాస్ట్రో-క్యాస్ట్రో జైలులో 600 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకడం, ఇద్దరు కరోనాతో చనిపోవడంతో జైలు లోని ఖైదీలంతా తమను విడుదల చేయాలంటూ తిరుగుబాటు చేశారు. వీరిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది చనిపోగా వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

కాస్ట్రో కాస్ట్రో జైలు సామర్థ్యం 1,140 మంది ఉండటానికే సరిపోతుంది అయితే ప్రస్థుతం ఆ జైల్లో 5,500 మంది ఖైదీలు ఉన్నారు, అసలే కరోనా వైరస్ తో ప్రపంచం వణుకుతున్న కాలంలో ఇక్కడ కనీసం భౌతిక దూరం పాటించడం కూడా సాధ్యంకాదు. జైలు అధికారులు కూడా ఖైదీలపట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఖైదీల బందువులు ఆరోపిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనాతో ఇద్దరు మరణించడం 600 మందికి కరోనా సోకడంతో ఖైదీల్లో తీవ్రంగా ఆందోళనమొదలైంది.

తమను విడుదల చేయాలని, రద్దీని తగ్గించాలని, కరోనా సోకకుండా చర్యలు చేపట్టాలని కొద్ది రోజులుగా వాళ్ళు అధికారులకు విన్నవించుకుంటూనే ఉన్నారు. శనివారం(ఏప్రెల్ 25) నాడు దాదాపు రెండు వందల మంది ఖైదీలు నిరసన ప్రదర్శన కూడా చేశారు. దయచేసి మమ్ములను కరోనాతో చంపకండి...మమ్మల్ని కాపాడండి అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఆ రోజు జైలు వార్దేన్ వీళ్ళకు నచ్చజెప్పి, ఖైదీలతో కొన్ని ఒప్పందాలు చేసుకొని నిరసన విరమింపజేశాడు.

అయితే ఆదివారంనాడి కరోనా సోకిన ఇద్దరు ఖైదీలు మరణించడంతో మిగతా ఖైదీలంతా భయాందోళనలకు గురయ్యారు. దా‍ంతో సోమవారం ఉదయం నుండే నిరసనలు తెలపడం మొదలుపెట్టారు. నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం చేశారు. వారి నిరసనలు ఆపడానికి జైలు సిబ్బంది బలప్రయోగాన్ని ఉపయోగించడంతో రెచ్చిపోయిన ఖైదీలు తిరుగుబాటు చేశారు. జైలు సిబ్బందిని ప్రతిఘటించారు. పలు వస్తువులను తగలబెట్టారు. దాంతో బైటి నుండి భారీగా పోలీసులను రప్పించిన ప్రభుత్వం ఖైదీలపై కాల్పులకు ఆదేశించింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 9 మంది ఖైదీలు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.అదే సమయంలో జైలు బయట ఖైదీల బందువులు వందలాదిగా గుమికూడారు. తమ వాళ్ళను విడుదల చేయాలంటూ నినదించారు.
-------------------------------------------------------------------

600 prisoners in Miguel Castro-Castro Jail in the town of Lima, Peru, rebelled against the release of all prison inmates after two coroners died. Nine people were killed and hundreds more were injured in police firing.

Castro Castro's prison capacity is only 1,140 people, but there are about 5,500 inmates in the prison, and it is not possible to keep the physical distance here at a time when the world is shaking with the original corona virus. Prison officials also accuse prisoners of being too careless with prisoners. The deaths of two people with corona in such circumstances have caused serious concern among the prisoners as 600 people were infected with corona.

They have been asking the authorities for a few days to release them, reduce congestion and prevent corona. On Saturday (April 25), nearly two hundred prisoners protested. Please don't kill us with Corona ... Save us. Banners are displayed. On that day, the prison warden pleaded with them and made some agreements with the prisoners and called off the protest.

On Sunday, however, two other prisoners who were infected with the corona died, leaving the rest in a panic. The protests started from Monday morning. Slogans and banners were displayed. Furious inmates revolted as prison staff used force to stop their protests. Prison staff resisted. Several items were burnt. The government, which had heavily evicted police from Baiti, ordered the firing on the prisoners. Nine inmates were killed and hundreds more were injured in police firing. They shouted for their release.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !