ఇప్పుడు చిన్నారుల్లో మరో అంతుచిక్కని కొత్త రోగం..?
కరోనా పుణ్యమా అని న్యూయార్కు మహానగరం ఎంతలా అతలాకుతలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కాటుతో ఈ నగరంలోని ప్రజలు విలవిలలాడిపోయిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ నగరంలోని చిన్నారులు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొటున్నారు. వీరంతా కరోనా పాజిటివ్ గా తేలిన వారే. అంతు చిక్కని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న చిన్నారులంతా రెండు నుంచి పదిహేనేళ్ల లోపు వారే.
న్యూయార్క్ చిన్నారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్ని వైద్యులు మిస్టీరియస్ సిండ్రోమ్ గా అభివర్ణిస్తున్నారు. ఈ చిన్నారుల ధమనులు సహా రక్తనాళాల్లో వాపుతో పాటు పొత్తికడుపులో నొప్పి.. వాంతులు వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. న్యూయార్క్ లో తాజాగా బయట పడిన ఇలాంటి లక్షణాలు అంతకు ముందు పలు యూరోపియన్ దేశాల్లోనూ ఇదే తరహా కేసులు బయటకు వచ్చాయి.
ఇది కొవిడ్ తో సంబంధం ఉన్న వ్యాధిగానే భావిస్తున్నారు. ఫ్రాన్స్.. ఇటలీ.. స్పెయిన్.. స్విట్జర్లాండ్.. బెల్జియం దేశాల్లోని పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే.. దీనికి కారణం ఏమిటన్న విషయాన్ని మాత్రం వైద్యులు తేల్చలేకపోతున్నారు.కాకుంటే.. అంతుచిక్కని ఈ రోగాల్ని ఎదుర్కొంటున్న చిన్నారులంతా కరోనా పాజిటివ్ కావటం గమనార్హం.
---------------------------------------------------------------
There is no need to specify how much the metropolis was like New York to Corona. The people of the city have been ravaged by the corona bite. Meanwhile, the little girls of this city are now facing a new problem. All of them are corona positive. All children who are experiencing serious health problems are within two to fifteen years.
Doctors describe the health problems that New York children face as mysterious syndrome. Inflammation in the blood vessels including the pediatric arteries and pain in the abdomen. Similar features have emerged in many European countries, with similar features being released recently in New York.
It is thought to be a disease associated with conidia. Doctors say similar symptoms are seen in children in France, Italy, Spain, Switzerland and Belgium. However, the doctors are unable to determine the cause of this, otherwise .. All of the children who are suffering from these ailments are corona positive.
Comments
Post a Comment