గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో 16 మంది వలస కూలీల మృతి
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ గూడ్స్ ట్రైన్ దూసుకెళ్లడంతో 16 మంది వలస కూలీలు మరణించారు. "ఇప్పటివరకు 16 మంది కూలీలు మృతి చెందినట్లు గుర్తించాం. మరో ఐదుగురిని ఔరంగాబాద్ హాస్పటల్‌కు తరలించాం" అని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో బీబీసీకి తెలిపారు. వాళ్లంతా బహుశా రైలు వస్తున్న సమయంలో పట్టాలపై నిద్రిస్తూ ఉండొచ్చని ఆయన అన్నారు. ఈ ఘటన ఉదయం 5.30 గంటల సమయంలో జరిగింది.
ఈ కార్మికులంతా ఔరంగాబాద్ సమీపంలోని జాల్నాలో ఉన్న ఓ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారని ఔరంగాబాద్ ఎస్పీ మోక్షద పాటిల్ బీబీసీకి తెలిపారు. "వీళ్లంతా భుసావల్ వైపు వెళ్తున్నారు. భుసావల్ నుంచి వలస కూలీలకు ఓ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని వాళ్లకు ఎవరో చెప్పారు. అందుకే వాళ్లంతా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు" అని ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారని, నలుగురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని ఆమె తెలిపారు ఈ కూలీలంతా మధ్య ప్రదేశ్‌కు చెందినవారుగా భావిస్తున్నారు.
ఔరంగాబాద్ సమీపంలోని కర్మాద్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 16మంది వలస కూలీల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. "ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో కూలీలు మరణించడం విచారాన్ని కలిగించింది. దీనిపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన ఈ ఘటనపై పూర్తిగా దృష్టిసారించారు. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం" అని ట్వీట్ చేశారు. రైలు ప్రమాదంలో కూలీలు మరణించడం దురదృష్టకరం అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియచేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కూలీలపై రైలు దూసుకెళ్లిందనే సమాచారం తెలియగానే మాటలు రాలేదని హోంమంత్రి అమిత్ షా అన్నారు. "రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఇతర అధికారులు, రైల్వే యంత్రాంగంతో మాట్లాడాను. అన్ని రకాల సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి" అని అమిత్ షా ట్వీట్ చేశారు.
-------------------------------------------------------------
Sixteen migrant workers were killed when a goods train crashed in Aurangabad, Maharashtra. "We have so far found 16 laborers killed and five others have been shifted to Aurangabad Hospital," South Central Railway's CPRO told the BBC. They all probably sleep on the rails when the train arrives, he said. The incident took place around 5.30am.
All these workers were working at a steel factory in Jalna near Aurangabad, Aurangabad SP Mokshada Patil told the BBC. "They are heading towards Bhusawal. Someone told them that there is a special train from Bhusawal for migrant workers. So they decided to go there," the SP said. She said that one person was injured in the accident and four had narrowly escaped from the accident.
The accident happened near the Karmad station near Aurangabad. Prime Minister Narendra Modi laments over the death of 16 migrant workers "I was saddened by the death of the mercenaries in a train accident near Aurangabad. I spoke to Railway Minister Piyush Goyal. He is fully focused on the incident. Defense Minister Rajnath Singh said it was unfortunate that the deaths of train workers were unfortunate. He conveyed his condolences to the families of the deceased. The injured are said to be seeking a speedy recovery.
Home Minister Amit Shah said he had not received any word about the train crashing into wages. Amit Shah tweeted, "I have spoken to Railway Minister Piyush Goyal and other officials and the railway administration. We are making arrangements to provide all kinds of assistance. My sympathy to the families of the deceased."
Comments
Post a Comment