"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !


ఇప్పటికే దారుణ పరిస్థితుల్లో ఉన్న వృత్తులను లాక్ డౌన్ మరింత ప్రమాదంలోకి తోసింది. చేనేత, మరనేత రంగాలు ఇప్పుడు ఇదే ఇబ్బందుల్లో ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల బట్టల వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. లాక్ డౌన్ తరువాత కూడా పాత వేగంతో ముందుకెళుతుందన్న భరోసా లేదు. దీని ప్రభావం నేత కార్మికులపై తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నేత కార్మికులుగా పిలుస్తున్న వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు చేతితో మగ్గంపై నేతనేసే వారు, చేనేత కార్మికులు. రెండోవారు, కరెంటు మెషీన్ల మీద నేతనేసేవారు. వీరినే మరనేత కార్మికులు అంటున్నారు. లాక్ డౌన్ ఇప్పుడు ఇద్దర్నీ ఇబ్బంది పెడుతోంది. పెళ్లిళ్ల సీజన్లు, రెగ్యులర్‌గా వచ్చే ఆర్డర్లు అన్నీ పోయాయి. ఒక అంచనా ప్రకారం ఒక్క తెలంగాణలోనే చేనేత కార్మికుల దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు ఉండిపోయాయి. తెలంగాణలో సగటున నెలకు 40-50 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో సగం పట్టు చీరలే.

ఇప్పటి వరకూ నేత కార్మికులు తమ దగ్గర ముడి సరకు ఉన్నంత వరకూ పనిచేశారు. లాక్ డౌన్ వల్ల మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చే ముడి సరకు ఆగిపోయింది. దీంతో పని ఆపేయాల్సి వచ్చింది. మిగతా వారిలా కాకుండా, పని ఆగిపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి, కొనుగోలు లేకపోతే వీరికి రోజు గడవడమే ఇబ్బంది అయిపోతుంది. చాలా మంది నేత కార్మికులకు సొంతంగా ముడి సరకు కొని, నేసిన వాటిని షాపులకు అమ్మే అంత పెట్టుబడి కానీ, మార్కెటింగ్ నైపుణ్యం కానీ ఉండవు. దీంతో వ్యాపారులు వారికి ముడిసరకు ఇచ్చి, బట్ట నేసిన తరువాత సొమ్ము చెల్లించి పట్టుకెళ్తారు. దీంతో వీరందరికీ లాక్ డౌన్ సంకటంగా మారింది. వ్యాపారం సాగడం లేదు కాబట్టి, పెట్టుబడిగా ముడిసరకు ఇచ్చిన వారి నుంచి డబ్బు అందడంలేదు. ఇక మరికొందరు మాత్రం సొంతంగా నేసి, షాపులకు ఇస్తారు. వారికి మరింత ఇబ్బంది. వారంతా చాలా చిన్న వ్యాపారులకు కావడంతో, ఇన్ని రోజులు సరకు ఆగిపోతే తట్టుకునే శక్తి లేదు వారికి.

''మేం ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే. రైతుల ఉత్పత్తులు కొన్నట్టే, వీరి ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొనాలి. సొసైటీల నుంచి వచ్చేది కేవలం 15 శాతమే. మిగతా అంతా వ్యక్తులు చేసేదే. ప్రతి కార్మికుడిపై మరికొందరు ఆధారపడి ఉంటారు. ప్రభుత్వం సరకు కొని మొత్తం డబ్బు ఇస్తే బావుంటుంది. కాని పక్షంలో, కనీసం సగం డబ్బు, సగం ముడిసరకు రూపంలో ఇచ్చినా బావుంటుంది. అలాగే లాక్ డౌన్ సమయంలో రిలీఫ్ కోసం ఒక్కొక్కరికీ 5-6 వేల రూపాయలు ఇవ్వాలి'' అన్నారు తడ్క యాదగిరి. పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యాదగిరి, సుదీర్ఘ కాలం చేనేత రంగంపై అధ్యయనం చేశారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డులో సభ్యులుగా పనిచేశారు.

చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే పోచంపల్లి వంటి గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడి నేత కుటుంబాల నుంచి చాలా మంది యువత హైదరాబాద్ వచ్చి చిన్నా చితకా పనులు, చిరుద్యోగాలు చేస్తుంటారు. ఒక అంచనా ప్రకారం ఈ పట్టణం నుంచి సుమారు వెయ్యి మంది రోజూ హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారు. వారి పనీ ఆగిపోవడంతో కుటుంబాల్లో రెండు ఆదాయాలూ పోయాయి. లాక్ డౌన్ తరువాత కూడా వెంటనే పుంజుకునే రంగం కాదు బట్టల వ్యాపారం. ఒకవేళ మామూలు బట్టలు కొన్నా, నేత బట్టలు కొనే సందర్భాలు తక్కువే ఉండడం కూడా వీరికి మరో ఇబ్బంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి అలానే ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఆప్కోకి రూ.176 కోట్లు బకాయి పడింది. ఆప్కో ద్వారా ఆ సొమ్ము సొసైటీలకు, అక్కడ నుంచి నేత కార్మికులకూ చేరాల్సి ఉంది. అది జరగలేదు. తాజాగా ప్రభుత్వం మాస్కుల కోసం ఆప్కో నుంచి కొన్న గుడ్డకు కూడా సగమే చెల్లించిందని విమర్శించారు మాచర్ల మోహన రావు. మోహన రావు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు.

''ప్రభుత్వం ఆప్కోకి చెల్లించాల్సిన రూ.176 కోట్లు తక్షణం చెల్లిస్తే కొంత సమస్య తీరుతుంది. ఇంత క్రైసిస్‌లో కూడా వారు అరువుతో సరుకు కొన్నారు. చేనేత పనులకు తక్షణం అనుమతిస్తే కాస్త ఉపశమనం ఉంటుంది. కనీసం ఆరు నెలల పాటు నెలకు మూడు వేలు తగ్గకుండా ప్రభుత్వం వారికి సాయం చేస్తే కుటుంబాలు కుదుటపడతాయి. లేదంటే వారికి చాలా ఇబ్బంది'' అన్నారు మోహన రావు. లాక్ డౌన్ వల్ల దీర్ఘ కాలం ఈ రంగంపై ప్రభావం పడుతుంది. లాక్ డౌన్ ఎత్తేసినా వెంటనే వ్యవస్థ గాడిన పడుతుందన్న నమ్మకమూలేదు. దీనివల్ల ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడానికి దీర్ఘకాలిక ఉపశమన చర్యలు కోరుతున్నారు. ''సెంట్రల్ ప్యాకేజీ పరిధిలో డీసీసీబీల దగ్గర రుణ మాఫీ చేయాలి. నాబార్డు కింద రుణాల రీషెడ్యూలు చేయాలి. ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొనసాగించాలి. రూ.200 కోట్ల మూలధనంతో సరకు కొనుగోలు చేయాలి'' అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మోహన రావు.

ఇక సిరిసిల్ల పట్టణంలో ఎక్కువ మంది ఆధారపడ్డ మరమగ్గాల పరిస్థితి కూడా బాలేదు. ఇక్కడ బతుకమ్మ చీరలు, మహిళల పెట్టీకోట్స్‌కి అవసరమయ్యే ముడి సరకు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ మర మగ్గాలకు అదనంగా డయింగ్, సైజింగ్, వార్పింగ్ వంటి పనులు ఉంటాయి. వీరందరూ లాక్ డౌన్ వల్ల పనులు కోల్పోయారు. సిరిసిల్లలో కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి 4500 మరనేత కార్మికులకు ఒక్కొక్కరికీ 500 రూపాయలు ఇచ్చారు. ''ప్రస్తుతం ఇక్కడి కార్మికులు దారుణ స్థితిలో ఉన్నారు. మరనేత పనిలో సోషల్ డిస్టెన్స్ పక్కాగా పాటించే అవకాశం ఉంది. ఒకరి దగ్గర మరొకరు ఉండాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి వీరి పని వల్ల నష్టం ఉండదు. ముడి సరకు రవాణాకు అనుమతిచ్చి, వీరు పనిచేసుకోవడానికి అనుమతిస్తే చాలా సమస్య తీరుతుంది'' అన్నారు సిరిసిల్ల స్థానిక మీడియాలో పనిచేసే మచ్చా ఆనంద్. సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలను ముందుగా వెలుగులోకి తెచ్చిన వారిలో ఆనంద్ ముఖ్యులు. ప్రస్తుతానికి సిరిసిల్ల మరనేత కార్మికులకు మాత్రం పని మొదలుపెట్టడానికి మే 5 నుంచి అనుమతించారు. కానీ ఇప్పటి వరకూ వచ్చిన నష్టాలను పూడ్చుకోవడం వారికి పెద్ద సమస్యే.

చేనేత సమస్య ఎప్పుడూ ఎందుకు ఉంటోంది?
లాక్ డౌన్ సరే, కానీ మామూలు రోజుల్లో కూడా చేనేత రంగం ఏమంత బాలేదు. ఎప్పుడూ ఈ రంగం సంక్షోభంలోనే ఉంటుంది. దానికి అసలు కారణం ఏంటి? భారతదేశంలో అతి ప్రాచీన పరిశ్రమ ఇది. ఒకప్పుడు దేశానికి పేరు, డబ్బు తెచ్చిన, వందల ఏళ్ల క్రితం నుంచీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత ఈ పరిశ్రమకు ఉంది. శాతవాహనుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్‌కి ఎగుమతి అయిన ఆధారాలున్నాయి. కాలక్రమేణా బ్రిటిష్ పాలనలోనూ, ఆ తరువాత పారిశ్రామికీకరణలోనూ ఈ రంగం భారీగా దెబ్బతింది. ముఖ్యంగా 80ల చివర నుంచి చేనేత పరిశ్రమకు దుర్భర రోజులు మొదలయ్యాయి అంటారు యాదగిరి. చేనేత రంగం గతంలో కూడా దెబ్బతింటూ వచ్చినా, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది మాత్రం ఆ తరువాతేనన్నది ఆయన అభిప్రాయం. ''1980ల చివర్నుంచి దేశంలో రెండు రంగాలు బాగా దెబ్బతిన్నాయి. ఒకటి వ్యవసాయం, రెండు చేనేత. రైతులు, నేత కార్మికుల ఆత్మహత్యలు ఆ తరువాతే పెరిగాయి'' అన్నారు యాదగిరి. చేనేత కార్మికులు చాలా మందికి బయట పనులు రావు. చాలా చేతి వృత్తులు, కులాల వారికి తమ పని లేనప్పుడు ఏదో రూపంలో వేరే పని దొరికే పరిస్థితి ఉంటుంది. కానీ చేనేత అలా కాదు. పైగా మిగతా వారికి ఉన్న వెసులుబాటు, అంటే తమ పని ఒక రోజు, బయట పని ఒక రోజులాగా వారు చేయలేరు. ఒక చీర నేయాలంటే వారం నుంచి మూడు వారాల పని దినాలు తీసుకుంటాయి. కానీ అమ్మినప్పుడు, వచ్చేది ఒక్క చీర ధర మాత్రమే! దానికితోడు ఒక మనిషి కాకుండా, కుటుంబ సభ్యుల సాయం కూడా అవసరం ఉన్న పని ఇది. దీంతో అదే వృత్తిలో ఉన్నవారు వేరే పని లేక, రాక ఇబ్బంది పడుతున్నారు. ఆకలి సమస్య, ఆత్మగౌరవం సమస్య.. రెండూ కలసి ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. చేనేత కేవలం భౌతిక వృత్తే కాకుండా, కళాత్మకంగా, నైపుణ్యంతో కూడిన పని. నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. సహజంగా కుటుంబ సభ్యులే ఎక్కువగా ఆ కళ నేర్చుకుంటారు. కాకపోతే వారు చేసే పనిని కేవలం భౌతిక శ్రమగానే చూస్తే ఎంత కూలీ వస్తుందో వారికి అంతకంటే ఎక్కువ దక్కదు. కానీ వారి నైపుణ్యము, కళా.. ఈ రెండూ ప్రత్యక్ష పరిగణనలోకి రావు. మిల్లు చేసే పనికీ చేయి చేసే పనికీ ఉత్పత్తిలో తేడా ఉంటుంది. దాంతో మిల్లు నుంచి వచ్చేవి తక్కువ ధరకు వస్తాయి. ప్రస్తుతం చేతితో నేసే వస్త్రాలు సంప్రదాయ కార్యక్రమాలు, పెళ్లిళ్లకూ పరిమితమయ్యాయి. కొన్ని సందర్భాల్లో అక్కడా లేకుండా పోతున్నాయి. అయితే ప్రత్యేక అభిరుచి ఉన్నారు, వాటిని ట్రెండుగా చేసుకుంటున్నారు. అప్పుడు ఖరీదు కూడా బాగా ఉంటోంది. కానీ ఆ ఫలితం అందరికీ అందడం లేదు. ఆ గ్యాప్ ఎలా పూరించడం అనేదానిపైనే ఈ రంగం భవిష్యత్తు ఉంది. ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తూ ఉంది. శాశ్వత పరిష్కారాలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు ఆ రంగంలో పనిచేసేవారు.

చేనేత కార్మికులు ఎంత మంది?
తెలంగాణలో సుమారు 18-19 వేల మంది చేనేత కార్మికులు ఉంటారు. వీరికి అనుబంధంగా ఇతర పనులు చేసేవారు ఉంటారు. అంటే ఆసులు పోయడం, సైడింగ్ చేయడం, వార్పులు, ఇక్కత్ డిజైన్లు చేసేవారు ఉంటారు. వీరంతా కలపి 15-16 వేల మంది ఉండొచ్చని అంచనా. మొత్తం కలిపి 35 వేల మంది వరకూ చేనేతపై ఆధారపడి ఉంటారు. వీరిలో సగం పాత నల్లగొండ జిల్లాలోనే ఉంటారు. గద్వాల, నారాయణపేటల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. మిగిలిన వారు తెలంగాణ అంతా ఉన్నారు. ఇక చేనేతతో సమానంగా మరమగ్గం నేత కార్మికులూ ఉన్నారు. ఒక్క సిరిసిల్లలోనే వీరు 34 వేలు ఉంటారని అంచనా. వీరికి అనుబంధంగా మరో 25 వేల మంది ఆధారపడ్డారని అంచనా. సిరిసిల్ల కార్మికులకు అనుబంధంగా పనిచేసే వారిలో చుట్టుపక్కల జిల్లాలతో పాటు, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వారూ ఉన్నారు. సిరిసిల్లతో పాటు ఇతర పట్టణాల్లో కూడా పవర్ లూమ్స్ కొన్ని ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య ఎక్కువ. లక్షకుపైగా ఉంటారని ఒక అంచనా. శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి అనంతపురం జిల్లా ధర్మవరం వరకూ అనేక ప్రాంతాల్లో వీరు విస్తరించి ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఏపీలో 94 వేల మంది కార్మికులు ఉన్నారు. వారు కాక అదనంగా మరో 70 వేల మంది అనుబంధ పనులు చేసేవారు ఉంటారు. ఇక పవర్ మెషీన్లు 7 వేల వరకూ ఉంటాయి. కరెంటు మెషీన్లు కోస్తాతో పోలిస్తే రాయలసీమలోని కడప, అనంతపురంలో ఎక్కువ. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో మరనేత తక్కువ. సాధారణ రోజుల్లో ఒక నేత కార్మికుడు నెలకు 8 వేల నుంచి 15 వేల వరకూ సంపాదిస్తాడు. వీరి కంటే మరనేత కార్మికులు రెండు మూడు వేలు ఎక్కువ సంపాదిస్తారు. కాగా, ఏపీలో మాస్కులకు కావల్సిన 1.5 కోట్ల మీటర్ల బట్ట ఆప్కో నుంచే కొన్నారు. కానీ దీనికి పూర్తి డబ్బు ఇవ్వలేదన్నది ఆరోపణ. దీనిపై అధికారులను బీబీసీ సంప్రదించింది, వారు ఇంకా స్పందించ లేదు.
-------------------------------------------------------------

Lockdowns are already in danger of occupations that are already in dire straits. The handloom and weaving sectors are now in the same trouble. Due to the lockdown, the textile business was completely stopped. Even after a lockdown there is no guarantee that the old speed will go ahead. Its impact is profound on weaving workers. There are two types of people who are currently called weaver workers. One is a handloom weaver, a handloom worker. The second, weaving on current machines. These are the workers again. The lockdown is now embarrassing both. Bridal seasons and regular orders are all gone. According to one estimate, a handloom laborer in Telangana alone had hundreds of crores of garments. Telangana produces an average of 40-50 crores worth of handlooms per month. Half of them are silk sarees.

Until now the weaver workers had worked as long as they had raw materials. Due to the lockdown, raw cargo from Maharashtra, Gujarat, Tamil Nadu and Karnataka has stopped. This had to stop work. Unlike everyone else, production stops when work stops. If they do not buy the product, they will have trouble getting through the day. Most weavers do not have the investment or marketing expertise to buy their own raw materials and sell them to shops. This allows the merchants to give them the raw material and pay them after the fabric is finished. This has become a lock-down affair for all of them. Since the business is not running, there is no money coming from the raw material as an investment. Others weave their own and give to shops. More trouble for them. Since they are all very small merchants, those who do not have the strength to withstand cargo these days.

“We are the only ones asking the government. Just like farmers' products, their products must be bought by the government. Only 15 per cent of those coming from societies. Everything else is what people do. Some more depend on each worker. It would be good if the government bought the goods and gave it all the money. But, at least, half the money, in the form of half raw money, is good. 5-6,000 per person for relief during lockdown, ”said Tadka Yadagiri. Yadagiri, who is an assistant professor of political science, has studied the field of handloom for a long time. Served as a member of the All India Handloom Board.

In villages such as Pochampally where the handloom workers are high, the problem is serious. Most of the youth from the weaver families come to Hyderabad and do little chitta and leisure activities. It is estimated that about a thousand people come to Hyderabad from this town on a regular basis. Both families lost their income when their pani stopped. The textile business is not a booming industry even after the lockdown. Another problem for them is the fact that they are less likely to buy normal clothes and weave clothes. The situation is the same in Andhra Pradesh. Here the government owes Rs 176 crore to Opco. That money is being added to the societies and from there to the weaving workers. That didn't happen. Recently, the government has paid half of the money bought from Opco for masks. Mohana Rao is the Founding President of the National Federation of Handlooms and Handicrafts.

“There is some problem if the government pays Rs176 crore to Apollo immediately. They also borrowed goods during the same crisis. Immediate sanction for handloom work is a bit of relief. Families will fall short if the government helps them at least three months a month for at least six months. Otherwise they are very embarrassing, ”said Mohana Rao. Lockdowns can affect the sector for a long time. It is not believed that if the lock is lifted, the system will take over immediately. This requires long-term mitigation measures to help the already troubled handloom sector. “Debt waivers should be waived at DCCBs under the Central Package. Repayment of loans under NABARD. Production Procurement Centers should continue. The commodity should be bought with a capital of Rs 200 crore, ”demanded the Andhra Pradesh government.

The township of Sirisilla is the most relied upon. Batukamma sarees, which produce more of the raw material needed for women's petticoats. These looms also include dyeing, sizing and warping. All of them lost work due to lockdown. In Sirisilla, the Collector has given Rs. 500 each to 4500 other workers from the special fund. “At present, the workers are in a desperate situation. Social Distance is more likely to be practiced later. There is no need for one to have another. So there is no loss of work. If they are allowed to operate the raw materials, they will have a lot of problems. ” Anand was one of those who first exposed the suicides of the leaders of the Sirisilla leader. At the moment, Siriusilla has only been allowed to start work again for the workers. But it is a big problem for them.

Why is there always a problem with weaving?
The lock-down is okay, but the weavers are not doing well even in the normal days. This sector is always in crisis. What is the real reason for that? It is the oldest industry in India. The industry is credited with bringing the country's name and money and earning foreign exchange from hundreds of years ago. There is evidence that the garments were exported to Europe during the time of the Satans. Over time, the sector was severely damaged by British rule and subsequent industrialization. Especially since the late 80s, the handloom industry has been known to have a bad day. He believes that the handloom sector has suffered in the past, but that it is only then that the suicides come. “Since the late 1980s, both sectors of the country have been badly affected. One is agriculture, two are weavers. The suicides of farmers and weavers have increased since then, ”Yadagiri said. Most of the handloom workers do not get outside. Most handicrafts and castes have to work in the form of something else when they have no work. But weavers are not. The flexibility that everyone else has, that is, they can't do their work one day and the other outside work. A saree weave takes from one to three weeks. But when sold, the only one saree that comes up is the price! This is a task that requires the help of family members, not just a man. This means that people in the same profession are struggling to find work or work. The problem of hunger and self-esteem .. both are leading to suicides. The handloom is not just a physical profession, but a work of art and craftsmanship. More time should be devoted to learning. Naturally, most of the family learn that art. Otherwise, their work is more than just physical labor. But their skill and genre are not both direct considerations. Milling and hand milling can vary in production. That means that the mill will come in cheap. At present, handlooms are limited to traditional ceremonies and weddings. In some cases going nowhere. But there is a special hobby and they are trending. Then the cost is well worth it. But that result is not for everyone. The future of the sector lies in how to fill that gap. The government is making temporary arrangements. Workers in the field say they have lasting solutions.

How many are the handloom workers?
There are about 18-19 thousand handloom workers in Telangana. They are accompanied by other people. That means pouring, siding, molding, and making designs. It is estimated that there are 15-16 thousand people together. In total, up to 35 thousand people depend on weavers. Half of them are in the old Nalgonda district. Gadwala and Narayanapet are also in large numbers. The rest are all over Telangana. There are also equally weavers of weavers. It is estimated that they have 34 thousand in a single syringe. It is estimated that another 25 thousand are affiliated with them. Those who are affiliated with Sirisilla workers are from surrounding districts as well as those from states like Gujarat and Bihar. There are also some power looms in Sirisilla and other towns. Andhra Pradesh has more of them. An estimate of one million. They are spread over many areas from Srikakulam district to Adoor to Dharmavaram in Anantapur district. According to one estimate, AP has 94 thousand workers. In addition, there are an additional 70,000 affiliates. Power machines up to 7 thousand. Current machines are higher in Kadapa and Anantapur in Rayalaseema compared to the coast. Andhra Pradesh is low compared to Telangana. On a normal day, a weaver earns between 8,000 and 15 thousand a month. Again workers earn two to three thousand more. However, the 1.5 million meter cloth required for the masks in AP was bought from Opco. But it is alleged that the money was not paid. The BBC has contacted the authorities, who have not yet responded.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !