కార్మిక చట్టాలను రద్దు చేసిన‌ కాషాయ ప్రభుత్వం


కరోనా లాక్ డౌన్ సాకుతో ఉత్తరప్రదేశ్ యోగీ ప్రభుత్వం కార్మికులను ఏ హక్కులూ లేని భానిసలుగా మార్చాలని కుట్ర పన్నింది. పెట్టు బడిదారులకు అధిక‌ లాభాలు, కార్మికులకు అన్యాయమైన పని పరిస్థితులూ ఉండే విధంగా కొత్త ఆర్డినెన్స్ తీసుకవచ్చింది.

వచ్చే మూడు సంవత్సరాలకు దాదాపు అన్ని కార్మిక చట్టాల పరిధి నుండి వ్యాపారాలకు, పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చే ఆర్డినెన్స్‌ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రపతి అంగీకారం పొందిన తర్వాతే ఆర్డినెన్స్ చట్టంగా మారుతుంది.

ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. COVID-19 వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో అన్ని ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, మందగించాయి. జాతీయ లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు మరియు ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ దెబ్బ తిన్నాయి. కొన్ని పూర్తిగా ఆగిపోయాయి ʹʹ అని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన తెలిపింది.

అన్ని సంస్థలు, కర్మాగారాలు మరియు వ్యాపారాలను కార్మిక చట్టాల‌ పరిధి నుండి మినహాయించటానికి ప్రభుత్వం కార్మిక చట్టాల ఆర్డినెన్స్ 2020 ని తీసుకవచ్చింది. అయితే భవనాలు మరియు ఇతర‌ నిర్మాణాల‌ కార్మికుల చట్టం1996, వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923, బాండెడ్ లేబర్ సిస్టమ్ (నిర్మూలన) చట్టం 1976, వేతనాల చెల్లింపు చట్టం 1936 ఆక్ట్ లోని సెక్షన్ 5 (సకాలంలో వేతనాలు పొందే హక్కు) మాత్రం ఆ ఆర్డినెన్స్ నుంచి మినహాయింపు నిచ్చామని ఈ చట్టాలు రాష్ట్రంలో వర్తిస్తాయ‌ని తన‌ ప్రకటనలో తెలిపింది ప్రభుత్వం కార్మిక చట్టాలలో పిల్లలు, మహిళలకు సంబంధించిన నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది.

పారిశ్రామిక వివాదాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, కార్మికుల పని పరిస్థితులు, కార్మిక సంఘాలు, కాంట్రాక్ట్ కార్మికులు మరియు వలస కార్మికులకు సంబంధించిన చట్టాలేవీ రాష్ట్రంలో పనిచేయవు. ఈ ఆర్డినెన్స్ ప్రస్తుతం ఉన్న వ్యాపారాలకు, కార్మాగారాలకు మరియు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే వ్యాపారాలకు కర్మాగారాలకు వర్తిస్తుంది.

ఈ చట్టం తీసుకరావడానికి కారణాలు చెబుతూ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆర్.కె. తివారీ " ప్రస్తుత పరిస్థితులలో మేము తిరిగి రాష్ట్రానికి చేరుకున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతమున్న ఉపాధిని కాపాడటానికి, వ్యాపారాలు, పరిశ్రమలకు కొంత సౌలభ్యం ఇవ్వాలి. కొన్ని కార్మిక చట్టాలు చెక్కుచెదరకుండా ఉంచబడ్డాయి, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు సంబంధించినవి, ఇవి కార్మికుల సంక్షేమానికి పని చేస్తాయి వారికి రక్షణగా కొనసాగుతాయి". అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఆర్డినెన్స్ పంపుతామని తివారీ తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం శ్రమ అనేది ఏకకాలిక విషయం కాబట్టి, రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకోవచ్చు కాని వారికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం.

ʹʹఇది ఖచ్చితంగా షాకింగ్. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన‌ ఈ చర్య గడియారాన్ని 100 సంవత్సరాలకు పైగా వెనక్కి తిప్పుతుంది. ఇది కార్మికులను బానిసత్వం నాటి పరిస్థితులకు తీసుకెళ్తుంది. ఇది అన్ని మానవ హక్కులు, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నది. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ చర్యను చట్టబద్ధంగా సవాలు చేయాలి ʹʹ అని కార్మిక న్యాయ న్యాయవాది రామప్రియ గోపాలకృష్ణన్ అన్నారు.
నిజానికి ప్రభుత్వం పైకి ఏమి చెబుతున్నప్పటికీ కరోనా లాక్ డౌన్ సాకును చూపి కార్మికులకు ఉన్న హక్కులను వాళ్ళ చేతుల్లో నుండి గుంజేసుకుంటోంది. వందల సంవత్సరాలు కార్మికులు పోరాడి, త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను ఒక్క ఆర్డినెన్స్ తో రద్దు చేయదల్చుకున్నది. ఇది పూర్తిగా పెట్టుబడి దారుల లాభాల వేటలో కార్మికులను బలిపశువులుగా చేస్తున్నదీ ప్రభుత్వం.

-----------------------------------------------------------------

With the corona lock down, the Uttar Pradesh Yogi government has conspired to make workers into slaves with no rights. The new ordinance enacted a policy that would provide greater benefits to the investor and unfair working conditions for workers.

The Uttar Pradesh government has passed an ordinance that exempts businesses and industries from almost all labor laws for the next three years. The ordinance becomes law only after the President approves it.

The decision was taken at a state cabinet meeting on Wednesday chaired by Chief Minister Adityanath. All economic activity in the state has been seriously affected and slowed down due to the COVID-19 outbreak. Businesses and economic activity have been hit by the national lockdown. The state government has issued a press release, stating that some have been stopped.

The Government has enacted the Labor Laws Ordinance 2020 to exclude all companies, factories and businesses from the purview of labor laws. However, in its statement, the State said that these laws apply to the state as exempted from the Ordinance of Buildings and Other Construction Workers Act 1996, the Workmen's Compensation Act of 1923, the Bonded Labor System (Abolition) Act, 1976 and the Right to Wages Act 1936. The Law on Children and Women in Labor Laws The money will continue.

No laws relating to industrial disputes, occupational safety, health, working conditions, labor unions, contract workers and migrant workers are employed in the state.

This ordinance applies to existing businesses, factories and factories for businesses that are set up in the state.

The reasons for this law, saying that the Uttar Pradesh chief secretary RK tisukaravadaniki Tiwari "Under the current circumstances, we need to provide employment to migrant workers returning to the state. To protect existing employment, businesses and industry must be provided with some labor laws intact. Said.

Tiwari said the ordinance would be sent for approval by the central government. Since labor is a singular subject under the Constitution of India, states can make their own laws but they need central government permission.

ʹʹIt's definitely shocking. The move by the Uttar Pradesh government has been reversing the clock for over 100 years. It takes workers into conditions of slavery. It is a violation of all human rights and fundamental rights. This is not acceptable. This action should be legally challenged, ”said labor law lawyer Ramapriya Gopalakrishnan.

In fact, despite the government's claim, the corona lock-up excuses workers' rights from their hands. Laws that have been fought and sacrificed by workers for hundreds of years are to be repealed by a single ordinance. It is the government that is scapegoating workers in the pursuit of profits.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !