మహమ్మారి చేసిన మేలు !
కరోనా లాక్ డౌన్ పుణ్యమానీ భారత్‌లో గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనట్లుగా తొలిసారి కర్బన ఉద్గారాలు పూర్తిగా తగ్గాయి. అయితే, దీనికి కేవలం లాక్‌డౌన్ ఒక్కటే కారణం కాదు. కరోనావైరస్ వల్ల అమలు చేస్తున్న లాక్‌డౌన్ కంటే ముందే శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెరగడం, విద్యుత్ వినియోగంలో తగ్గుదల దీనికి కారణాలని ‘కార్బన్ బ్రీఫ్’ పర్యావరణ వెబ్‌సైట్ అధ్యయనం వెల్లడించింది. మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలు మొదలుకావడంతో 37 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న కర్బన ఉద్గారాలు తొలిసారి తగ్గాయి. భారత్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 15 శాతం తగ్గగా ఏప్రిల్‌లో అది 30 శాతానికి తగ్గుంటుందని ఆ అధ్యయనం అంచనా వేసింది. ఇండియన్ నేషనల్ గ్రిడ్ గణాంకాల ప్రకారం బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలు మార్చిలో 15 శాతం తక్కువగా పనిచేశాయి. ఏప్రిల్ తొలి మూడు వారాల్లో 31 శాతం తగ్గింది. అయితే, లాక్‌డౌన్‌కు ముందు కూడా భారత్‌లో బొగ్గుకు డిమాండ్ తగ్గింది. 2018-19తో పోల్చితే 2019-2020లో బొగ్గు డిమాండ్ 2 శాతం తగ్గింది. ఇంతకుముందు దశాబ్దంతో పోల్చినప్పుడు 2010-2020 మధ్య థర్మల్ పవర్ 7.5 శాతం పెరిగింది. అలాంటి తరుణంలో బొగ్గు డిమాండ్ 2019-20లో 2 శాతం తగ్గడం చిన్నదేమీ కాదు.
ఆయిల్ వినియోగమూ తగ్గింది
లాక్‌డౌన్ కారణంగా రవాణా దాదాపు నిలిచిపోవడంతో ఆయిల్ వినియోగం భారీగా తగ్గింది. గత ఏడాది మార్చితో పోలిస్తే 2020 మార్చి నాటికి ఇది 18 శాతం తగ్గింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ ఇంధనాల సరఫరా పెరిగింది. లాక్‌డౌన్ కారణంగా ప్రత్యామ్నాయ ఇంధనాలకూ గిరాకీ తగ్గడమనేది కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచమంతటా ఉంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఏప్రిల్ చివర్లో వేసిన లెక్కల ప్రకారం ఈ త్రైమాసికం ముగిసేనాటికి ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వినియోగం 8 శాతం తగ్గుతుందని అంచనా. ఇదే సమయంలో పవన, సౌర విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుందని ఐఈఏ పేర్కొంది. బొగ్గుకు డిమాండ్ తగ్గడానికి మరో కారణమూ ఉంది. పవన, సౌర విద్యుత్ వ్యవస్థలను ఒకసారి ఏర్పాటు చేసుకోవడం వరకే ఖర్చు.. తరువాత రోజువారీ నిర్వహణ వ్యయాలు పెద్దగా ఉండవు. కానీ, బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలలో రోజువారీ నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. దీంతో అంతటా పవన, సౌర విద్యుత్ వైపు మళ్లడం కనిపిస్తోంది. థర్మల్ విద్యుత్కేంద్రాలు నడవాలంటే బొగ్గు, గ్యాస్, చమురు వంటివి కొనుగోలు చేయాలి. కానీ, పవన్, సౌర విద్యుత్కేంద్రాలకు ఆ అవసరం లేదు.
మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం
అయితే... కరోనావైరస్ ప్రభావం తగ్గిన తరువాత పరిస్థితులు మళ్లీ మొదటికొస్తాయని విశ్లేషకులు అంటున్నారు. దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను కదిలించడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటాయని.. దానివల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న భారతీయ బొగ్గు పరిశ్రమను కరోనావైరస్ మరిన్ని కష్టాల్లోకి నెడుతోందని, భారత ప్రభుత్వం దీనికి భారీ ఉపశమన ప్యాకేజీ ప్రకటించొచ్చని కార్బన్ బ్రీఫ్ విశ్లేషించింది.
భారత్‌లో ఇప్పటికే క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం
కానీ, భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ప్రోత్సాహం అందిస్తున్న విషయం మర్చిపోకూడదు. బొగ్గు ఆధారిత విద్యుత్ కంటే చవగ్గా లభిస్తుండడంతో భారత్‌లో పునరుత్పాదక ఇంధనానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సౌర విద్యుత్ కిలోవాట్ గంట రూ.2.55 ఖర్చవుతుండగా బొగ్గుతో తయారయ్యే విద్యుత్ కిలోవాట్ గంట ఉత్పత్తికి రూ.3.38 ఖర్చవుతందని కార్బన్ బ్రీఫ్ విశ్లేషించింది. 2019లో ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ ప్రత్యామ్నాయ ఇంధనాలపై పెట్టుబడి పెడుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో భారతీయులు అనుభవిస్తున్న స్వచ్ఛమైన గాలిని ఇకముందూ అనుభవించడం కోసం వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు.
-----------------------------------------------------------
Corona Lockdown Payments Carbon emissions have dropped drastically in India for the first time in four decades. However, this is not the only reason for the lockdown. A study by Carbon Brief's Eco Website shows that the rise in renewable fuels and the reduction in electricity consumption is due to the increase in the use of renewable fuels as an alternative to fossil fuels prior to a lockdown run by the coronavirus. Increasing carbon emissions for the first time in 37 years have been reduced since the nationwide lockdown began in March. The study predicts that carbon dioxide emissions in India will fall by 15 per cent to 30 per cent in April. Coal-fired power plants were down 15 percent in March, according to Indian National Grid figures. In the first three weeks of April, it was down 31 percent. However, the demand for coal in India has declined even before the lockdown. Coal demand is down 2% in 2019-2020 compared to 2018-19. Thermal power increased by 7.5% between 2010-2020 compared to the previous decade. At that time, the 2% reduction in coal demand in 2019-20 is no small feat.
Oil consumption has decreased
Oil consumption was drastically reduced as transport was virtually stopped due to the lockdown. By March 2020, it was down 18 percent compared to March last year. At the same time, the supply of alternative fuels increased. The demand for alternative fuels due to the lockdown is not just in India but around the world. According to estimates by the International Energy Agency (IEA) at the end of April, global coal consumption is expected to fall by 8 percent by the end of the quarter. The demand for wind and solar power is on the rise, the IEA said. There is another reason for the decline in demand for coal. Once the wind and solar power systems are installed, the cost of the day-to-day maintenance costs will not be large. But, the cost of operating the coal-fired power stations is very high. This appears to be driving wind and solar power across. To run thermal power stations, one has to buy coal, gas and oil. But, Pawan and Solar Power Centers don't need that.
Risk of relapsing
However, analysts say the situation will resume after the coronavirus effect has subsided. Countries are taking swift action to move their economies, which are expected to increase carbon emissions. The Carbon Brief analyzed the coronavirus, which is already struggling with the Indian coal industry, and the Indian government has announced a huge relief package.
Clean Air program in India already
But it should not be forgotten that the Government of India is already promoting alternative energy sources. India has more opportunities for renewable energy because it is cheaper than coal-fired power. Carbon Brief Analysis of Solar Power costs Rs. India is investing in alternative fuels as part of the National Clean Air Program launched in 2019. Environmentalists hope they will pressurize the government to no longer enjoy the clean air that Indians currently enjoy during the lockdown.
Comments
Post a Comment