వల వేస్తే.. 'పైసలు' చిక్కాయి..!
ఫేట్ ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు చెప్పబోయే సంఘటన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చేపల కోసం చెరువులో వల వేస్తే.. ఏకంగా కరెన్సీ నోట్ల కట్ట దొరికింది. అన్నీ రూ. 500,రూ. 2000 నోట్లు ఉండటం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. పంట పండింది అనుకుని వాటిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇది ఆ నోటా..ఈ నోటా పాకి స్థానికులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో ఆ చెరువు వద్దకు వచ్చి గాలించారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పట్లానే వల వేశాడు. అయితే ఎవరు.. ఎప్పుడు..ఎందుకు వేశారో తెలియదు కానీ అందులోనుంచి నోట్ల కట్ట బయటకు వచ్చింది. వాటిని బయటకు తీయగానే..గాలి బలంగా వీయడంతో నోట్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. మెల్లగా వాటిని ఏరుకొని ఇంటికి వెళ్లాడు. విషయం తెలియడంతో… పోలీసులు వచ్చి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎందుకు అలా నీళ్లలో విసిరి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
-------------------------------------------------------------
We cannot say when Fate will be anyone. The event that is now going to surprise you. When fishing in the pond for fish .. Bundle of currency notes. All of which cost Rs. 500, Rs. He was surprised to see 2000 notes. He took them to his house as the harvest was ripe. It is a note that the locals are aware of the pakadai. The incident took place in Khandwa district of Madhya Pradesh.
Going into the details… a boy from the village of Arud went fishing. He always laid. However, it is not known who and when. When they were taken out, the notes were scattered as the wind blew. He slowly picked them up and went home. Knowing the matter… the police came and seized the notes. They are being investigated as to why they were thrown into the water. The event has created a buzz locally.
Comments
Post a Comment