కోలుకున్న తర్వాత కరోనా మళ్లీ వస్తుందా?
కోవిడ్-19 నుంచి కోలుకున్న కొందరు రోగులకు కరోనావైరస్ పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. కానీ, తర్వాత మళ్లీ పాజిటివ్ అని తేలింది. సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. అందుకే, ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత తొందరగా ఆ వ్యాధి రాదు. కోవిడ్-19 మాత్రం తొందరగా మళ్లీ తిరగబడుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. కారణం ఏంటి? జపాన్‌లో ఓ 70 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేయగా ఆశ్చర్యకరమైన, ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. ఆయనకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో ఫిబ్రవరిలో టోక్యో ఆసుపత్రిలో ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. చికిత్స అందించారు. జపాన్ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రకారం, ఆయన కోలుకుని మామూలు స్థితికి వచ్చారు. ప్రభుత్వ బస్సులు, రైళ్లలోనూ ప్రయాణించారు. కానీ, కొన్ని రోజుల తరువాత ఆయన మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు. జ్వరం వచ్చిందంటూ ఆయన ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షలు చేస్తే షాకింగ్ విషయం బయటపడింది. ఆయనకు మళ్లీ కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. జపాన్‌లో అలాంటి కేసులు ఇంకా చాలానే నమోదయ్యాయి. కరోనావైరస్ నుంచి కోలుకున్నవారిలో కొంతమందికే మళ్లీ పాజిటివ్ వస్తోంది. కానీ, ఆ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కారణం ఏంటి?
14 శాతం మందికి
కోవిడ్ -19 నుంచి కోలుకున్న రోగుల్లో కనీసం 14 శాతం మందికి తర్వాత పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్ అని వస్తోందని స్పానిష్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (సీఎస్ఐసీ)కి చెందిన అంటువ్యాధుల నిపుణులు లూయిస్ ఎంజువానెస్ బీబీసీతో చెప్పారు. వారికి రెండోసారి సోకిందని చెప్పలేం కానీ, వైరస్ తిరగబెట్టడం వల్ల వారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన అంటున్నారు. "చాలావరకు కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌ల బారిన పడి కోలుకున్నవారిలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కానీ, కొందరిలో అది బలహీనంగా ఉంటుంది. అలాంటి వారి శరీరంలో ఎక్కడో ఒకచోట దాగి ఉన్న వైరస్ మళ్లీ తిరగబడే ప్రమాదం ఉంటుంది" అని ఎంజువానెస్ వివరించారు.
శరీరంలో మూడు నెలలు
కొన్ని వైరస్‌లు మానవ శరీరంలో మూడు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు. "వైరస్ సోకిన వారికి చికిత్స చేసిన తర్వాత నెగెటివ్ వస్తే, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లుగా భావిస్తారు. అయితే, పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చినా మన శరీరంలోని కణజాలంలో ఎక్కడో ఒక చోట వైరస్ ఇంకా దాక్కునే అవకాశం ఉంది. అలాంటి వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థకు చిక్కకపోవచ్చు. అలా దాక్కున్న వైరస్ కొన్నాళ్లకు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది" అని ఎంజువాన్స్ చెప్పారు. కోవిడ్ -19 విషయంలో చూస్తే, దీని నుంచి కోలుకున్న తర్వాత స్వల్ప కాలంలోనే మళ్ళీ పాజిటివ్ అని వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
---------------------------------------------------------------
Some patients recovering from Covid-19 received negative if coronavirus tests. But then again it turned out to be positive. Generally, immunosuppression is thought to be better in people recovering from flu and cold. That is why a person recovering from the flu will never get the disease again. Research shows that the Kovid-19 is rapidly reversing. What is the reason? An examination of a 70-year-old man in Japan revealed surprising and disturbing facts. He was placed on special examination at a Tokyo hospital in February after being diagnosed with coronavirus. Treatment provided. According to Japanese news agency NHK, he recovered and returned to normal. He also traveled on public buses and trains. But, a few days later, he fell ill again. He went to the hospital for a fever, but the shocking thing came out when doctors examined him. He was again found to be coronavirus positive. Such cases have been reported in Japan. Some of those recovering from coronavirus are coming back positive. But even that number is not very good. What is the reason?
For 14 per cent
At least 14 per cent of patients recovering from Covid-19 will be positive if they are tested again, ”Luis Mzuanes, an epidemiologist with the Spanish National Center for Biotechnology (CSIC), told the BBC. They cannot say they have been infected a second time, but they are getting sick again because of the virus, he says. Enjuvenes explained, "Immunity is improved in those who have recovered from viruses in most of the Corona family, but in some people it is very weak. There is a risk that the virus is hidden somewhere else in their body."
Three months in the body
Some viruses can live in the human body for three months and longer. "If the virus gets infected after treatment, the immunity in their body is likely to increase. However, the virus can still be found somewhere in the tissues of our body, if tested negative. There will be opportunity, ”says Enjuans. Scientists say that in the case of Kovid-19, it will be positive again in a short time after its recovery.
Comments
Post a Comment