కరోనా పోరులో చైనా కుబేరుడి అద్వితీయ సహకారం


చైనాలో అత్యంత ధనవంతుడైన అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు ‘జాక్ మా’ గత నెలలో తన ట్విటర్ అకౌంట్ ప్రారంభించారు. అంటే, సరిగ్గా కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే. ఆయన అకౌంట్ ప్రారంభించినప్పటి నుంచి పెట్టిన ప్రతి పోస్టులోనూ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు తాను అందిస్తున్న వైద్య పరికరాల సాయం గురించే ప్రస్తావిస్తూ వస్తున్నారు. 

“వన్ వరల్డ్-వన్ ఫైట్” ఇది ఆయన పోస్ట్ చేసిన మొదటి మేసెజ్‌లలో ఒకటి. “కలిసికట్టుగా మనం సాధించగలం.” ఇది ఆయన ఉత్సాహంగా పెట్టిన మరో మెసేజ్. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు సుమారు 150కి పైగా దేశాలకు వైద్య పరికారాలను అందించే సహాయ కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. ప్రపంచమంతా వైద్య పరికరాల కరవుతో అల్లాడిపోతుంటే ఆయన లక్షలాది మాస్కులు, వెంటిలేటర్లు, ఇతర సహాయ సామాగ్రిని అవసరమైన దేశాలకు పంపుతున్నారు. అయితే, దీని వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటన్నది ఆయన విమర్శకులు కానీ ఆయన మద్దతుదారులు కానీ చెప్పలేకపోతున్నారు. తన సేవా కార్యక్రమాల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకోవాలనుకుంటున్నారా? లేదా పార్టీ తన ప్రయోజనాల కోసం ఆయన్ను ఉపయోగించుకుంటోందా?

ముఖ్యంగా ఆయన తన దాతృత్వానికి ఎంచుకున్న దేశాలను చూసినప్పుడు చైనా దౌత్య నియమాలకు లోబడే ఆయన వ్యవహారశైలి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ రోజు రోజుకీ పెరుగుతున్న ఆయన పలుకుబడి చైనాలోని కొందరు ఉన్నత స్థాయి నేతలకు కంటగింపుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచంలోని ఇతర కోటీశ్వరులు అతని కన్నా ఎక్కువగానే విరాళాలు ఇచ్చారు. ప్రైవేటు చారిటబుల్ డొనషన్లను ఎప్పటికప్పుడు పరిశీలించే అమెరికాకు చెందిన ఓ సంస్థ అందించిన వివరాల ప్రకారం కోవిడ్-19పై పోరాటానికి తమ పెద్ద మనసు చాటుకున్న వ్యక్తుల్లో ‘జాక్ మా’12వ స్థానంలో ఉన్నారు. అయితే, ఆ జాబితాలో ఆయన పంపుతున్న వైద్య సామాగ్రి ప్రస్తావన లేదు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దేశాలకు ధన సాయం కన్నా వైద్య సామాగ్రి అవసరమే ఎక్కువగా ఉంది. అవసరార్థులకు నేరుగా అవసరమైన సామాగ్రి చేరవేయడంలో జాక్ మా ను మించిన వారెవ్వరూ లేరు. అలీబాబా ఫౌండేషన్‌లో భాగమైన ‘జాక్ మా’ ఫౌండేషన్ మార్చి నెలలో తన సేవల్ని ప్రారంభించింది. ఆఫ్రికా, ఆసియా, యూరోప్, లాటిన్ అమెరికా సహా రాజకీయంగా అత్యంత సున్నిత దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా దేశాలకు కూడా ఆయన విమానాల ద్వారా అవసరమైన సామాగ్రిని పంపించారు.

కరోనావైరస్‌కు టీకాను తయారు చేసేందుకు కూడా ‘మా’ లక్షలాది డాలర్లను అందించారు. అలాగే వైద్య నిపుణుల సూచనలతో కూడిన హ్యాండ్ బుక్‌ను మొత్తం 16 భాషల్లో ముద్రించి ప్రజలకు అందించారు. ఆయన ప్రపంచ దేశాలకు అందించిన వైద్య సామగ్రి విషయం మాత్రమే వార్తల్లో నిలిచింది. ప్రజాకర్షణ కలిగిన స్నేహశీలి

ప్రజాకర్షణ కలిగిన ఇంగ్లిష్ టీచర్ నుంచి చైనాలోనే అతి పెద్ద టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకునిగా ఆయన చైనా ప్రజలకు సుపరిచితులు. ‘అలీబాబా’ ఇప్పుడు తూర్పు ఆసియా దేశాలకు అమెజాన్‌తో సమానం. 1999లో చైనాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకటైన హాంగ్జూ నగరంలోని ఓ చిన్న అపార్ట్మెంట్‌లో అలిబాబా ప్రస్థానం మొదలయ్యింది. ఇప్పుడు చైనాలో అలిబాబా సంస్థది తిరుగులేని స్థానం. చైనా ఆన్ లైన్ బ్యాంకింగ్ , ఎంటర్‌టైన్మెంట్ రంగాలలో ఆ సంస్థదే ఆధిపత్యం. జాక్ మా సొంత ఆస్తులే 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయి.

పార్టీ సూచనలకు అనుగుణంగానేనా?
ప్రస్తుతం ‘మా’ ఇచ్చిన విరాళాలను గమనిస్తే అన్నీ పార్టీ సూచనలమేరకే జరిగినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం జాక్ మా, అలీబాబా ఫౌండేషన్ విరాళాలు అందించిన దేశాల జాబితాను గమనిస్తే చైనా పొరుగు దేశం, దౌత్య పరంగా ప్రత్యర్థి అయిన తైవాన్‌తో అధికారిక సంబంధాలున్న దేశాల పేర్లు కనిపించవు. లాటిన్ అమెరికాకు చెందిన 22 దేశాలకు విరాళాలను అందిస్తున్నట్లు ట్విట్టర్లో ‘మా’ ప్రకటించారు. అయితే తైవాన్ పక్షం వహిస్తున్న హోండురస్, హయితీ వంటి డజన్ల కొద్దీ చిన్న చిన్న దేశాలు వైద్య సామాగ్రి అందించాలని అర్థిస్తున్నప్పటికీ జాక్ మా సాయం చేస్తున్న దేశాల జాబితాలో వాటి పేర్లు లేవు. జాక్ మా ఫౌండేషన్ సాయం అందిస్తున్న దేశాల జాబితా కావాలని ఎన్ని సార్లు అడిగినా సంస్థ సిబ్బంది వివరాలను అందించేందు సుముఖంగా లేరు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి వివరాలను ఇవ్వలేమని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జాక్ మా దాతృత్వం కచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతల్ని తీసుకొస్తుంది. క్యూబా, ఎరిత్రియా వంటి దేశాలకు తప్ప చైనా నుంచి జాక్ మా ఫౌండేషన్ అందించిన సాయాన్ని అన్ని దేశాలు సంతోషంగా స్వీకరించాయి. ఈ విజయంతో జాక్ మా ప్రతిష్ట మరింత పెరిగిందనే చెప్పాలి. మరోవైపు చైనా జాతీయ మీడియా అయితే దాదాపు చైనా అధినేత షీ జింపింగ్‌కు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని ఇస్తోంది. కరోనావైరస్ ప్రారంభంలో అధ్యక్షుడు తీసుకున్న చర్యలపై అనేక ప్రశ్నలు తలెత్తిన సమయంలో ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించిన “జాక్ మా”కు ఈ పోలిక కాస్త ఇబ్బందిని కల్గించేదే. కోవిడ్-19 బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూరోప్, దక్షిణాసియా దేశాలకు చైనా పెద్ద సంఖ్యలో వైద్య బృందాలను, వైద్య సామాగ్రిని సాయంగా అందించింది. అయితే కొన్ని సార్లు అవి విమర్శలకు కూడా తావిస్తాయి. చైనా చవకబారు, పనికిమాలిన సామాగ్రిని పంపిందని కొన్ని దేశాలు ఆరోపించాయి. కొన్ని సార్లు పరీక్షలు తప్పుడు ఫలితాలు వచ్చాయంటూ తిరిగి వెనక్కి పంపాయి కూడా. అందుకు విరుద్ధంగా జాక్ మా అందించిన సాయం ఆయన ప్రతిష్టను మరింత పెంచింది. “జాక్ మా అందించిన సాయం పట్ల ఆఫ్రికా అంతటా సంతోషం వ్యక్తం చేశారు” అని చైనా ఆఫ్రికా ప్రాజెక్ట్ వెబ్ సైట్ అండ్ పాడ్‌కాస్ట్ సంస్థ మేనేజింగ్ ఎడిటర్ ఎరిక్ ఒలెండర్ తెలిపారు. ఆఫ్రికాలోని అన్ని దేశాలను సందర్శిస్తానని గతంలో హామీ ఇచ్చినట్టే రిటైర్ అయిన తర్వాత జాక్ మా తరచుగా ఆయా దేశాలకు వెళ్లి వస్తున్నారు.

క్లిష్ట పరిస్థితుల మధ్య ప్రయాణం!
అయితే, ‘జాక్ మా’కు ఇప్పుడు బీజింగ్ నుంచి ఎదురు దెబ్బ తగలనుందా? నిజానికి ఎవరైనా తనతో, తన ప్రభుత్వంతో సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంటే చూస్తూ ఊరుకునే నైజం కాదు షీ జింపిగ్‌ది. చాలా మంది ప్రముఖుల్ని గతంలో ఆయన ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది కూడా. ఇటీవల కాలంలో చూస్తే దేశంలోనే ప్రముఖ నటి, ప్రముఖ న్యూస్ యాంకర్, మరి కొంత మంది కోటీశ్వరులైన పారిశ్రామిక వేత్తలు చాలా రోజులుగా తెరమరుగైపోయారు. న్యూస్ యాంకర్ వంటి వాళ్లయితే జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. నిర్బంధం నుంచి బయటకు వచ్చిన కొంత మంది పార్టీకి విధేయంగా ఉంటామని ప్రతిన చేశారు కూడా. “దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఆయనకు వస్తున్న ప్రజాదరణ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిష్టకు అడ్డుగా మారుతోందన్న కారణంతోనే 2018లో అలీబాబా గ్రూప్ ఛైర్మన్ పదవికి జాక్ మా రాజీనామా చేశారన్న వదంతులు కూడా వచ్చాయి” అని వాషింగ్టన్ డీసీలోని సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీలో రిసెర్చ్ అసోసియేట్‌గా పని చేస్తున్నఅష్లే ఫెంగ్ అన్నారు. నిజానికి 2018లో ఆయన ఊహించని రాజీనామా చాలా మందిని ఆశ్చర్యపరచింది. అయితే తనతో బీజింగ్ బలవంతంగా రాజీనామా చేయించిందన్న వదంతులను జాక్ మా కొట్టి పారేశారు. 2017లో జరిగిన ఓ కీలక సంఘటన తర్వాత అలీబాబా చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారన్న వార్తల సంగతి జాక్ మా జీవిత చరిత్ర రాసిన డంకన్ క్లార్క్‌ దృష్టికి కూడా వచ్చింది. చైనా, అమెరికా వాణిజ్య సంబంధాలపై చర్చించేందుకు ట్రంప్ టవర్స్‌ లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో జాక్ మా భేటి అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల వరకు చైనా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కాలేదు.“ఆ సమయంలో జాక్ మా వేగంగా పావులు కదుపుతున్నారంటూ చాలా ఊహాగానాలు వచ్చాయి” అని క్లార్క్ అన్నారు. “బహుశా వీలైనంత వరకు సమన్వయంతో వ్యవహరించాలన్న పాఠాలు ఇరు వర్గాలు నేర్చుకున్నాయని నేను భావిస్తున్నా. జాక్ మా ఓ పారిశ్రామిక శక్తి. బహుశా అందువల్ల కూడా సవాళ్లు ఎదురై ఉండవచ్చు. ఎందుకంటే పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని అలాంటి పాత్ర పోషించడం ప్రభుత్వానికి చికాకు కల్గిస్తుంది” అని క్లార్క్ చెప్పుకొచ్చారు.

బయట వ్యక్తి ఏమీ కాదు
నిజానికి జాక్ మా కమ్యూనిస్ట్ పార్టీకి బయట వ్యక్తేం కాదు. 1980లో అంటే యూనివర్శిటీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆయన పార్టీ సభ్యుడు. అయితే పార్టీతో ఆయన సంబంధాలు ఎప్పుడు అంటీ ముట్టనట్టే ఉంటాయి. అంటే ‘ప్రేమించడం వరకు ఓకే... పెళ్లికి మాత్రం నో’ అన్నట్టు. అయితే బీజీంగ్ ముందస్తు ఆశీస్సులు లేకుండా ‘మా’ గానీ అతని సేవా సంస్థలు కానీ ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటే , ‘మా’ ఛారిటీ విషయంలో చైనా ప్రభుత్వం ఇప్పటికే తాను ఏం చెయ్యాలో అది చేసి ఉండేది. కానీ సియిరా లోన్ నుంచి కంబోడియా వరకు ప్రతి దేశంలోనూ చైనా రాయబారులు దగ్గరుండీ విమానాశ్రయాలకు మా ఫౌండేషన్ నుంచి వైద్య సామాగ్రితో వస్తున్న సరుకు విమానాలకు స్వాగతం పలుకుతున్నారు. తనను విమర్శించే అమెరికా వంటి దేశాల విషయంలో కూడా జాక్ మా ఉదారతను కూడా చైనా ఉపయోగించుకుంటోంది. “20 లక్షల మాస్కులు అందించిన తైవాన్‌ మా నిజమైన స్నేహితుడు అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చెప్పింది. మరి 10 లక్షల మాస్కులు, 5లక్షల టెస్టింగ్ కిట్లు అందించిన జాక్ మా ఫౌండేషన్, ఇతర చైనా కంపెనీల సాయం గురించి ఎందుకు ప్రస్తావించనట్టు?” అంటూ ఏప్రిల్ మొదటి వారంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాక్ మా చేస్తున్న సేవల వల్ల కావచ్చు లేదా చైనాకు చెందిన ఇతర ధనవంతులైన వాణిజ్యవేత్తలు చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల కావచ్చు చైనా కచ్చితంగా లాభపడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.

అమెరికా పాత్రలోకి చైనా?
కోవిడ్-19ను ఎదుర్కొనే విషయంలో చైనాకు చెందిన ప్రైవేటు వ్యక్తులు అందిస్తున్న విరాళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అలక్ష్యం చేయలేమని క్యాండిడ్ సంస్థకు చెందిన ఆండ్రూ గ్రబోయిస్ అన్నారు. ఆయన పని చేస్తున్న సంస్థ సేవా కార్యక్రమాల పేరిట ప్రపంచ వ్యాప్తంగా విరాళాలను అందించే వివరాలను సేకరిస్తూ విశ్లేషిస్తూ ఉంటుంది. “వాళ్లిప్పుడు నాయకత్వ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. సాధారణంగా గతంలో ఈ పని అమెరికా చేస్తూ ఉండేది. అందుకు 2014లో తలెత్తిన ఎబోలా సంక్షోభమే చెప్పుకోదగ్గ ఉదాహరణ. ఆ సమయంలో పశ్చిమాఫ్రికాలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమెరికా స్వయంగా వైద్యుల్ని పంపండంతో పాటు అన్ని రకాల సాయాన్ని అందించింది” అని ఆండ్రూ అన్నారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తిని నిరోధించే బాధ్యతను చైనాకు చెందిన దాతలు తీసుకున్నారు. “దేశ సరిహద్దుల్ని దాటి వైద్యపరంగా, ఆర్థికంగా సాయమందిస్తూ, తమ అనుభవాన్ని వారికి అందించడం ద్వారా ఆయా దేశాల్లో ఓ సానుకూల శక్తిగా రూపొందుతున్నారు” అని ఆండ్రూ చెప్పారు. మొత్తం మీద జాక్ మా నడుస్తున్న మార్గానికి అడ్డు తగలడానికి చైనాకు ఇది అనువైన సమయం కాదు. యావత్ ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోది. అదే సమయంలో ఇదే కోవిడ్-19 సంక్షోభం కారణంగా మిగిలిన ప్రపంచంతో చైనా సంబంధాలు కూడా చిక్కుల్లో పడ్డాయి. కనుక తమ దేశంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే సత్తా ఉన్న ఏ ఒక్కరి సాయమైనా ఇప్పుడు ఆ దేశానికి అవసరం అన్నది ఆయన బయోగ్రఫీని రాసిన డంకన్ క్లర్క్ అభిప్రాయం.
--------------------------------------------------------

Jack Alpha, founder of China's richest Alibaba group, launched his Twitter account last month. That is, at exactly the time when the Kovid-19 epidemic was shaking the world. In every post he has made since opening his account, he has been referring to the aid of medical equipment to almost all countries of the world.

"One World-One Fight" was one of the first messages he posted. "Together we can achieve." This is another message that he is excited about. To date, he has led a program of providing medical equipment to over 150 countries to combat the Kovid-19 crisis. He is sending millions of masks, ventilators and other aids to countries in need of medical equipment. However, neither his critics nor his supporters have been able to say what the profit will be. Want to reinvent himself as a pro-Communist through his service? Or does the party use Aayan for its own purposes?

Especially when he looks at the countries he chose for his philanthropy, his behavior in accordance with Chinese diplomacy seems to have been. But his clout, which seems to be growing day by day, seems to be turning into some of China's top leaders. Other billionaires in the world have donated more than him. According to a US-based company that regularly monitors private charitable donations, Jack Ma'o is ranked 12th among people who have made up their minds to fight Kovid-19. However, the list does not mention the medical supplies he sends. In fact, many countries now require more medical supplies than money. There is no one beyond Jack Ma to deliver the necessary supplies directly to the needy. The JackMax Foundation, part of the Alibaba Foundation, launched its services in March. He has also supplied the aircraft with the most sensitive countries, including Africa, Asia, Europe and Latin America, to Iran, Israel, Russia and the United States.

Our model has also provided millions of dollars to make a vaccine for coronavirus. Also, the handbook with medical experts' instructions has been printed in 16 languages ​​and made available to the public. Only the medical equipment he has provided to the world has been in the news. A charismatic friend

From the charismatic English teacher to the founder of China's largest technology company, he is best known to the Chinese public. The Alibaba model is now equivalent to Amazon for East Asian countries. In 1999, Alibaba began to dominate a small apartment in the city of Hangzhou, one of China's industrial areas. Now the Alibaba company is undisputed in China. The company dominates the online banking and entertainment sectors of China. Jack our own assets are over $ 40 billion.

Does it comply with party instructions?
At present, the donations made by our model appear to be all party instructions. Looking at the list of countries currently donated by the Zak Ma and Alibaba Foundation, the names of the countries with China's neighbor and diplomatic rival Taiwan have no official links. The Times of America announced on Twitter that it is donating 22 countries of Latin America. Although dozens of smaller countries, such as Honduras and Haiti, which support Taiwan, are supposed to provide medical supplies, Jack does not have their names listed in the list of countries helping us. No matter how many times the Jack Ma Foundation wants to be a list of the countries it serves, the company's staff are reluctant to provide details. In the present situation, such details cannot be given. However, our generosity of Jack certainly brings a good reputation. All countries have welcomed the support of the Zak Ma Foundation from China except for Cuba and Eritrea. With this victory, our reputation has grown even more. China's national media, on the other hand, is almost as important as the Chinese boss Xi Jinping. This comparison is particularly troubling for "Jack Ma," who rained down praise on the president at the beginning of the Coronavirus' many questions. China has provided large numbers of medical teams and medical supplies to Europe and South Asia, which have been hit hard by Kovid-19. However, sometimes they are also criticized. Some countries have accused China of sending cheap, inexpensive goods. Sometimes the tests are backed up by false results. On the contrary, the help provided by Jack Ma increased his reputation. "Jack across the globe is pleased with the help provided by us," said Eric Olender, managing editor of the China Africa Project website and podcast company. After our retirement, Jack Ma is often visiting those countries in Africa.

Travel Between Critical Situations!
However, does Jack Maui now face a blow from Beijing? In fact, if one earns a reputation for himself and his government, it is not fair to think that she is a zimpy. His government has also targeted many celebrities in the past. In recent times, the country's leading actress, celebrity news anchor, and a few billionaires have been in the limelight. Like news anchors, they are being held in jail. Some people who have come out of custody have vowed to obey the party. "There have also been rumors that Jack Ma has resigned as chairman of the Alibaba Group in 2018 because of his popularity as a leading industrialist in the country." In fact, his unexpected resignation in 2018 surprised many. Jack Ma dismissed rumors that Beijing had forcibly resigned with him. The news of his resignation as chairman of Alibaba after a key event in 2017 also caught the attention of Jack Dunn Clark, our biographer. Jack Ma meets with US President Donald Trump at Trump Towers to discuss China-US trade relations Clark said there was no meeting with Chinese President Trump until a few months later, "and at that point there was much speculation that Jack was moving our swift feet." “I think the two sides have learned the lessons of coordination, perhaps. Jack Ma is an industrial power. There may also be challenges. "It is embarrassing for the government to play such a role for people who are not affiliated with the party," Clark said.

He is not outside person..
In fact Jack is not an outsider to our Communist Party. He has been a member of the party since he was a university student in 1980. However, his relationship with the party is always on. That's why it's okay to love ... wedding is just a number. But if Beijing made any decision without any prior blessings or any of his charities, the Chinese government would have already done what it wanted in terms of our charity. But Chinese ambassadors in every country, from Sierra Leone to Cambodia, are welcome to the nearest airport to our airport with medical supplies. China is also using our generosity in the case of countries like America that criticize her. "Taiwan is our true friend who has provided 20 million masks," the US State Department said. Why not mention the help of Jack Ma Foundation and other Chinese companies that provided 10 million masks and 5 lakh test kits? ” In the first week of April, the Chinese Foreign Ministry tweeted. There can be no doubt that China will certainly benefit from the services of Jack Ma in the present situation, or the services of other wealthy businessmen in China.

China as US role?
Donations made by Chinese private individuals to combat Kovid-19 cannot be ignored under any circumstances, said Andrew Grabouis of Candid. His organization is collecting and analyzing donations worldwide in the name of service activities. “They take on leadership roles when they are married. Usually in the past this work was done by America. The most prominent example is the Ebola crisis of 2014. At the time, the US was sending its own doctors to help prevent the spread of the virus in West Africa, and all kinds of help, ”Andrew said. Chinese donors are now responsible for preventing the spread of the virus. "They are a positive force in those countries by crossing the country's borders with medical, financial assistance and giving them their experience," Andrew said. All in all, this is not the ideal time for China to block our running path. The whole world is facing a serious crisis right now. At the same time, China's relations with the rest of the world were also affected by the same Kovid-19 crisis. Duncan Clerk, who writes his biography, says that anybody who has the ability to check the criticism of their country now needs help.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !