మీకు ప్లాన్ - ఏ & బీ గురించి తెలుసా..?
వాస్తవాలు ఎప్పుడు చెప్పినా ఎటకారంగానే వినిపిస్తుంది. మాయదారి రోగానికి చెక్ పెట్టటం మంచిదే. కానీ.. రానున్న రోజుల్లో దాంతో సహజీవనం చేయాలన్న మాటకు పీకిన ఈకలు ఎన్నో చెప్పాల్సిన అవసరమే లేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి వచ్చిన ఈ మాటపై పెద్ద ఎత్తున కామెడీ చేయటం తెలిసిందే. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న దానికి తగ్గట్లే.. జగన్ నోటి నుంచి వచ్చిన మాట ఈ రోజు పలు రంగాలకు చెందిన ప్రముఖులే కాదు.. పలువురు ముఖ్యమంత్రులు ఆయన మాటనే చెబుతున్నారు. వ్యాక్సిన్ తో చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. మాటల్లో చెప్పినంత ఈజీ కావటం టీకా కనుగొనటమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన కనుగొనేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దగ్గర దగ్గర వందకు పైగా కంపెనీ వ్యాక్సిన్ రేసులో ఉన్నాయి. వీటిల్లో ఏ కంపెనీ సక్సెస్ అవుతుందన్నది కాలమే డిసైడ్ చేయాలి.
ప్రపంచ ప్రజలెంతో ఆశగా ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ ను కనుగొనలేకున్నా.. ఎలా బతకాలన్న దానికి సంబంధించి ప్లాన్ బీ సిద్దం చేయాలన్న మాట వినిపిస్తోంది. మాయదారి రోగానికి మందుగా వ్యాక్సిన్ అన్నది ప్లాన్ ఏ అయితే.. ఈ ప్లాన్ బీ ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలే కాదు.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయంపై కాస్తంత క్లారిటీ వచ్చేయటం ఖాయం.
ఒక అంచనా ప్రకారం వ్యాక్సిన్ రాక తక్కువలో తక్కువ ఏడాది నుంచి ఏడాదిన్నర వరకూ పడుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఒకవేళ వచ్చినా పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందా? అంటే సందేహమే. మరి.. అన్ని రోజులు ఇళ్లల్లో కూర్చోలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏం చేయాలన్నదే ముందున్న ప్రశ్న. ఎవరికి వారుగా జాగ్రత్తగా ఉంటూ.. బతుకు బండిని లాగటం తప్పించి మరో మార్గం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మాయదారి రోగం వెంట నడుస్తూనే.. అది మన దగ్గరకు రాకుండా అప్రమత్తంగా ఉండాలి.
అన్ని రోగాలకు టీకాలు సాధ్యమేనా? అన్న ప్రశ్నకు నో అనే సమాధానమే వస్తుంది.ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన హెచ్ ఐవీకి రెండేళ్లలో మందు వచ్చేస్తుందని చెప్పారు. ఇప్పటికి ఆ దరిద్రపుగొట్టు జబ్బు వచ్చి 36 ఏళ్లు అయ్యింది. ఇప్పటికి హెచ్ఐవీకి వ్యాక్సిన్ లేదన్నది మర్చిపోకూడదు. ఆ మాటకు వస్తే డెంగీ.. రైనో వైరస్ లకు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ లేదు. ఇదంతా ఎందుకంటే.. వ్యాక్సిన్ సిద్ధం చేయటం చెప్పినంత సులువు కాదని చెప్పేందుకే.
ఇలాంటి వేళ.. ప్లాన్ బీ ఎలా ఉండాలి? అన్నది చూస్తే.. జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవటమే కాదు.. ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎవరికి వారు.. తమకు రోగ లక్షణాలు కనిపించినంతనే ముడుచుకు పోవటం.. ఇంట్లోనే ఉండిపోవటం లాంటి వాటితో సదరు వ్యక్తికే కాదు.. వారి కుటుంబ సభ్యులకు.. వారి సన్నిహితులకు ముప్పుగా మారుతుందన్నది మర్చిపోకూడదు. ఏ మాత్రం అనుమానం ఉన్నా.. తమకు తాముగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు.. ఏది పడితే అది తాకేయటం.. గతంలో మాదిరి జీవన విధానానికి కాస్త భిన్నంగా ఉండాల్సి వస్తుంది. మందు లేని వేళ.. మరింత అప్రమత్తత.. బాధ్యతగా వ్యవహరించటమే ప్లాన్ బీగా చెప్పక తప్పదు.
----------------------------------------------------------------------------
When the facts are spoken It is a good idea to check for ill health. But .. in the coming days it is not necessary to say that the feathers of the mate to live with it. This is a large-scale comedy that has come out of the mouth of AP chief minister Jagan. The truth is on the ground. Despite trying to get the vaccine checked .. In many words, it is easy to find a vaccine to find a vaccine. Many companies are trying to find the spread all over the world. Nearly a hundred company have been in the vaccine race. Decide which of these companies will succeed.
Can't find the vaccine that is waiting for the world's people .. Plan bee to talk about how to kill it. Vaccine is the plan of medicine for MayaDari disease.
According to one estimate, vaccination is expected to take as little as one year to a year and a half. If it comes, will it be a complete success? That is doubt. And .. not sitting in homes all day. If this is the case. There is no other way to pull the cart. In a word .. Mayadari is walking along the road .. It must be vigilant not to come to us.
Is Vaccination Possible for All Diseases? The answer to that question is "No". He said that HIV would hit the world in two years. It has been 36 years since he got sick. One must not forget that there is no vaccine for HIV by now. There is no vaccine for dengue .. rhino viruses. All this because the vaccine is not easy to prepare.
If this is the case, how should Plan Be? That is not to change the way of life completely .. Everyone has to act responsibly.
Not to forget that they are a person who is not just a person with the symptoms of their own symptoms, such as staying at home, threatening their family members and their friends. No doubt .. they have to come out and test themselves. In addition to personal hygiene .. whatever it touches, the way of life in the past has to be quite different. Drug-free .. More alert .. Responsibility is not to say plan bee.
Comments
Post a Comment