పరేషానీలో పాత్రికేయం!
ఇన్నాళ్లు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే అందరికీ హడల్. ఇవి రాజకీయాలను శాసించేవి.. వ్యవస్థను ప్రభావితం చేసేవి.. సీఎంలను కూడా గుప్పిట పట్టేవి. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడవన్నీ కుదలేయ్యాయి. ప్రకటనలు లేక నష్టాల పాలయ్యాయి. కోలుకునే పరిస్థితులు కనుచూపుమేరలో కనిపించడం లేదు. పత్రికల వద్ద ప్రింటింగ్ పేపర్ సామగ్రి నిండుకున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేయకపోతే మొత్తం మూతపడుతుంది. ఇక ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు లేక అవి జీతాలు కట్ చేసి చాలా మందిని తీసేశాయి. ఇప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో చాలా మంది జర్నలిస్టులను తీసివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. మరికొందరు ఆ ఊబిలోంచి స్వచ్ఛందంగా బయటకొచ్చేశారు. ఇప్పుడు వారంతా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? అని ఆలోచిస్తే డిజిటల్ మీడియా ఒక అవకాశంగా కనిపిస్తోంది. కానీ అది అంత ఈజీ అయిన వ్యవహారం కాదు..
పత్రికలు న్యూస్ చానెల్స్ లో రిపోర్టర్లు పంపించే వార్తలను ఎడిట్ చేసి పెట్టడం ఈజీ. కానీ డిజిటల్ మీడియాలో పాఠకుడిని చివరి దాకా చదివించేలా రాయడం కత్తిమీద సాము. పైగా అసలు విషయాన్ని పత్రికలు చానెల్స్ లో మొదట చెబుతారు. డిజిటల్ మీడియాలో చివరలో చెప్పాలి. చాలా క్రియేటివిటీగా రాస్తే తప్పితే వెబ్ మీడియాలో రాణించడం కష్టం. కొన్నేళ్లుగా చేసిన వారికి మాత్రమే ఇందులో రాణించగలరు. మామూలు జర్నలిస్టులు ఎందరో ఇందులో విఫలమయ్యారు.
సగటున 30 మంది జర్నలిస్టులు వెబ్ మీడియాకు ప్రయత్నిస్తే అందులో కేవలం ఒకరో ఇద్దరో మాత్రమే డిజిటల్ మీడియా ప్రాసను అందింపుచ్చుకుంటూ అవకాశాలు దక్కించుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది.దీన్ని బట్టి స్కిల్ ఉండి.. అనుభవం ఉన్న జర్నలిస్టులకు మాత్రమే వెబ్ మీడియాలో అవకాశాలుంటాయి. ఆల్ రౌండర్లు అయితే ఇందులో రాణించగలరు. అంతేకానీ.. అక్కడ పోయిందని డిజిటల్ మీడియాలోకి వస్తే మాత్రం ఇక్కడి ఒత్తిడి వార్తలను వేగంగా అందించే తీరు.. క్షణాల్లో స్పందించి స్టోరీగా మలిచే నేర్పు మాములు జర్నలిస్టులకు కష్టమే. అందుకే ఎంతో అనుభవజ్ఞులు మాత్రమే వెబ్ మీడియాలో రాణించగలుగుతున్నారు. ఎంతో మంది జర్నలిస్టులు బయటకు వచ్చినా వారు ఈ డిజిటల్ మీడియాలో రాణించకపోవడానికి అసలు కారణం ఇదే.
ఇక పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో తీసేసిన జర్నలిస్టులు ఎవరూ కూడా తిరిగి ఇదే వార్తలు స్టోరీల కంపులోకి జర్నలిజం వృత్తిలో కంటెంట్ రైటర్లుగా కొనసాగాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఈ జర్నలిజంకు స్వస్తి పలికి చాలా మంది ఇతర వ్యాపారాలు ఉద్యోగాల్లోకి మరలుతున్నారు. వ్యవసాయం వ్యాపారం.. ఇతర బిజినెస్ లలోకి వెళ్లిపోతున్నారు. జర్నలిజం ఊబిలోంచి బయటపడ్డ వారెవరు తిరిగి దీంట్లోకి రామని ఖరాఖండీగా చెబుతున్నారు. సో డిజిటల్ మీడియా తలుపులు తెరిచినా దీన్ని అందిపుచ్చుకోవడానికి జర్నలిస్టులు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట.. జర్నలిజంలో సంక్షోభాలు.. మీడియా యాజమాన్యాల తీరు చూశాక..చాలా మంది దీన్ని త్యజించి వేరే ఇతర వ్యాపకాల్లోకి మారిపోతున్నారు. కొత్త వాళ్లు తేటతెలుగుపై పట్టులేక ఈ వృత్తిలోకి రావడం లేదు. భవిష్యత్తులో జర్నలిస్టుల కొరత ఈ రంగాన్ని తీవ్రంగా వేధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.
-----------------------------------------------------
Nowadays, print electronic media means everyone. These are politics that affect the system. But the corona attack is all but over. Advertisements or losses incurred. Recovery conditions do not appear to be visible. Printing paper equipment at magazines. If the lock is not lifted down the whole is closed. No more advertising for electronic media or they cut salaries and eliminated many. Now most of the print electronic media has been taken off the road with the removal of journalists. Others volunteered to get out of it. What's the Nectar Target all week? Thinking that digital media looks like an opportunity. But it's not that easy.
It's easy for editors to edit the news that reporters send on news channels. But writing on digital media to keep the reader reading until the end is a knife. More original material is first mentioned in magazines channels. The latter must be said in digital media. Writing in web media is difficult unless it is very creative. Only those who have done it for a few years can excel. Many of the usual journalists have failed.
An average of 30 journalists try web media, but only one or two of them get a digital media rhythm, according to a survey. All rounders can excel though. What's more, the digital media that has gone there is the only way to deliver the pressure of the news .. It is difficult for ordinary journalists. That's why so many veterans are able to excel in web media. This is the real reason why many journalists come out and do not excel in this digital media.
None of the journalists who picked up the magazines and the electronic media are going to continue to be content writers in the journalism profession, back to the same news stories. Many other businesses are turning to jobs for this journalism. Farming Business .. going into other business. Those who have left the journalism swing are urging Kharakhandi to return. So when the doors of digital media are opened, journalists are not interested in providing it. Crisis in journalism. Newcomers do not get into this profession, they are not caught. Senior journalists say there is no doubt that the shortage of journalists in the future will seriously hurt the sector.
Comments
Post a Comment