మనం స్పెయిన్, ఇటలీ సరసన చేరుతామా?
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏకంగా మూడుసార్లు లాక్ డౌన్ విధించినా కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. తగ్గకపోగా.. తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ 60 వేలకు చేరాయి. ఆదివారం వరకు పాజిటివ్ కేసులు దాదాపు 63 వేలకు చేరువయ్యాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మే నెలాఖరు వరకు దాదాపు 2 లక్షల వరకు కేసులు చేరవచ్చని తెలుస్తోంది. దీంతో త్వరలోనే భారతదేశం కూడా స్పెయిన్ – ఇటలీ దేశాల సరసన నిలబడుతోంది. ఈ మేరకు కరోనా వ్యాప్తిపై ఐఐటీ- ఢిల్లీకి చెందిన పరిశోధన బృందం అంచనా వేసింది. ఏప్రిల్ 28వ తేదీకి 30 వేలు ఉన్న కేసులు 11 రోజుల్లోనే రెట్టింపయ్యాయి. కేసుల పరంపర ఇదే స్థాయిలో ఉంటే ఈ నెలాఖరుకు పాజిటివ్ కేసులు దాదాపు రెండు లక్షలకు చేరుతాయని అంచనా వేశారు. దీంతో వీరి అధ్యయనం అధికార వర్గాలతో పాటు ప్రజలను భయాందోళన రేకెత్తేలా చేస్తోంది. దేశంలో ఇప్పటివరకు 62913 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2103 మంది మృతిచెందగా 19315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నవారు 41495 మంది. అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ – ప్రైవేటు రంగాల్లో కలిపి మొ...