గుజరాత్ లో మళ్లీ తిరగబడ్డ వలస కార్మికులు
గుజరాత్ రాష్ట్రం సూరత్ లో వలస కార్మికులు మరో సారి తిరగబడ్డారు. కార్మికులు ఇలా తిరగబడి పోలీసులతో ఘర్షణ పడటం నెల రోజుల్లో దాదాపు ఇది ఆరోసారి. అనేక రాష్ట్రాల నుండి బతకడానికి సూరత్ వచ్చిన లక్షల మంది కార్మికులు లాక్ డౌన్ కారణంగా పనులు కోల్పోయారు. ఇంటి కిరాయిలు కట్టే పరిస్థితుల్లో లేరు. తినడానికి తిండి కూడా లేక ఎలాగైనా తమ స్వంత గ్రామాలకు వెళ్ళిపోవాలనే పట్టుదలతో ఉన్నారు.
సూరత్ జిల్లాలోని హజీరా పారిశ్రామిక ప్రాంతంలో పని చేసే కార్మికులు ఆ పక్కనే ఉన్న మోరా అనే గ్రామంలో నివాసముంటారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ఒక్కసారి రోడ్ల మీదికి వచ్చి నిరసన తెలిపారు. తమను తమ స్వంత ఊర్లకు పంపాలని డిమాండ్ చేశారు. వాళ్ళను అడ్డుకున్న పోలీసులపై కార్మికులు తిరగబడ్డారు. పోలీసులు లాఠీచార్జ్ చేయగా కార్మికులు పోలీసులపైకి రాళ్ళు విసిరారు. వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వేలాదిగా మోహరించిన పోలీసులు మోరా గ్రామాన్ని చుట్టుముట్టారు.
---------------------------------------------------------------------------
Migrant workers in Gujarat state of Surat have turned away once more. This is the sixth time in months that workers have turned around and clashed with police. Millions of workers from Surat who came to Surat from several states lost their jobs due to lockdown. The house is not in a position to hire. They insist on going to their own villages, or even to eat.
Workers in the Hajira industrial area of Surat district reside in the nearby village of Mora. Hundreds of people from across Uttar Pradesh, Bihar and Odisha staged a protest on the roads today. Demanded that they be sent to their hometowns. The workers turned on the police who blocked them. Police threw stones at the police while the police charged them. Hundreds of people have been arrested by the police. Thousands of police surrounded the village of Mora.
Comments
Post a Comment