ఎన్ కౌంటర్లో ఓ ఎస్సై సహా నలుగురు మావోయిస్టులు హతం


ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లా మన్పూర్ అటవీ ప్రాంతం పరిధిలోని పర్దోని దగ్గర మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా నలుగురు మావోయిస్టులు, ఒక ఎస్సై మరణించారు. చనిపోయిన వారిలో సీపీఐ మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్ అశోక్, ఏరియా కమిటీ మెంబర్ నరేటి కృష్ణ, దళ సభ్యులు సవిత, పరిమిళ ఉన్నారు. చనిపోయిన ఎస్సై పేరు శ్యామ్ కిషోర్ శర్మ. అయితే ఈ సంఘటనపై పోలీసుల వర్షన్ మాత్రమే ఇప్పటి వరకు తెలిసింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటన‌ కానీ, స్థానికులు ‌కానీ ఇంత వరకు మీడియాకు ‍అమ్దుబాటులోకి రాలేదు. అయితే పోలీసులు మాత్రం ఎప్పుడూ చెప్పే కథనే మళ్ళీ చెప్పారు. వారి కథనం ఏంటంటే..

మామదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో పోలీసులు శుక్రవారం రాత్రి మన్పూర్ కు నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అప్పటికే మాటు వేసిన మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులతో పాటు, ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.
------------------------------------------------------------------

Four Maoists, including two female Maoists, were killed in an attack by police on the Maoists near Pardoni in the Manpur forest area of ​​Chhattisgarh's Rajanandgaon district. Among the dead were CPI Maoist Party Divisional Committee Member Ashok, Area Committee Member Nareti Krishna and troop members Savita and Shirama. The dead Essie name is Shyam Kishore Sharma. However, only the police version of the incident is known to date. The announcement of the CPI Maoist Party, but not to the locals, has yet to be made public. But the police never told the same story again. Their narrative is..

The police, led by Mamadanwada police station SI Shyam Kishore Sharma, went to Manipur on Friday night for a Naxal operation in Coombing. To this end, the Maoists, who have already made their way in the forest, have turned on the police. The alarmed police opened fire on the Maoists. Four Maoists along with SI Shyam Kishore Sharma died on the spot when a bullet went into the stomach. AK-47, two 315-bore rifles and an SLR weapon were recovered from the Maoists.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !