మాజీ సీఎం ఆరోగ్యం విషమం


దేశంలోనే ఒకప్పుడు వెలుగు వెలిగిన నేత ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన మాజీ సీఎం దేశంలోనే సీనియర్ నేత అజిత్ జోగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

74 ఏళ్ల అజిత్ జోగి శనివారం ఉదయం ఇంటి సమీపంలోని గార్డెన్ లో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాయ్ పూర్ లోని శ్రీనారాయణ ఆస్పత్రికి తరలించారు. అజిత్ జోగి పరిస్థితి విషమంగానే ఉందని ఆయనకు చికిత్స చేస్తున్న ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామన్నారు.

అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు అమిత్ జోగి మీడియాతో మాట్లాడారు. తన తండ్రికి వెంటిలేటర్ పై చికిత్స అందుతోందని.. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామన్నారు.
----------------------------------------------------------------

The leader, who once shone in the country, is now hovering among the dead. Former chief minister Ajit Jogi, who has been standing the government of the UPA congress government, has fallen ill. His situation is sad.

74-year-old Ajit Jogi was in a garden near the house on Saturday morning and suddenly had a heart attack. He collapsed there. The observed family members were rushed to Srinarayana Hospital in Raipur. The hospital's health bulletin was released by doctors treating Ajit Jogi's condition. Treatment on ventilator.

His son Amit Jogi spoke to the media on the health condition of Ajit Jogi. He said his father was being treated on a ventilator. He was having trouble breathing and was being treated on a ventilator.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !