బయ్యారంలో భయంభయం !
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోటగడ్డ గ్రామ పంచాయితీ పరిధిలో వేములపల్లి రాజు ఇంట్లో ఈ నెల 5వ తారీకు నుండి ప్రతి రోజుకు సుమారు 2 నుండి 3 సార్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగడం, వాటిని కుటుంబ సభ్యులు ఆర్పడం జరుగుతోందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని వేములపల్లి రాజు తెలుపుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 5, 6, 7, 8వ తారీకు రోజులలో ప్రతి రోజు మూడు నుండి నాలుగు సార్లు తన ఇంట్లోని బెడ్ రూమ్‌లో, బాత్ రూములో, కిచెన్‌లో బట్టలు, టివి, ఫ్రిజ్, ఫోన్ ఇతర ముఖ్య సామాన్లు తగలబడి పోయే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా జరుగుతున్నాయేమోననే అనుమానంతో ఒక రోజంతా ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసి చూశామని, అయినా సరే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆగడం లేదని, పోలీసులకు సమాచారం అందించగా శుక్రవారం రోజున ఇంటిని సందర్శించి వెళ్ళారని, విచారణ చేసి సమాచారం తెలుపుతామని తెలిపారని ఇంటి యజమాని రాజు తెలిపారు.
ఇంట్లో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి నెలకొని ఉన్నందున విషయం తేలేంతవరకు కుటుంబ సభ్యులతో సహా ఇంట్లోని సామాన్లు ఖాళీ చేసి ఇంటి ముందున్న రేకుల షెడ్‌లోకి మార్చామని, రేకుల షెడ్‌లోనే జీవనం సాగిస్తున్నామని పోలీసులు, అధికారులు, జనవిజ్ఞాన వేధిక వారు త్వరగా మా ఇంట్లో చోటు చేసుకునే అగ్ని ప్రమాదాల విషయం అంతు తేల్చాలని కోరారు యజమాని రాజు తెలిపారు. ఇప్పటి వరకు ఒక సెల్ ఫోన్, టివి, బట్టలు, ఇతర వస్తువులు దగ్దమైపోయాయని తెలిపారు. కాగా ఆ ఇంట్లో వింత శక్తి ఉందని, ఇంతవరకు గ్రామంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న దాకలాలు లేవని, దేవుడు, దయ్యం మాయలంటూ ఆ గ్రామంలోని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం ఆ ఇంటిని సందర్శించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతి త్వరలో మిస్టరీని చేదించి తెలుపుతామని, ఇంట్లోని కుటుంబ సభ్యులతో సహా గ్రామంలోని ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని బరోసా ఇచ్చారు.
--------------------------------------------------------------------
It has been revealed lately that the family of the Vemulapalli Raja in the Kotagadda Grama Panchayat of Baiyaram Zone in Mahabubabad district has been on fire for about 2 to 3 times every day since the 5th of this month. According to the owner of the house, Vemulapalli Raju, three to four times a day, this month, on the 5th, 6th, 7th and 8th day of his house, in his bedroom, in the bathroom, in the kitchen, clothes, TV, fridge, phone and other utensils. I suspect that the short circuit is due to the power supply to the house all day, The owner of the house, Raju, said that the fire has not stopped.
Owner Raju asked the police, officials, and geologists to quickly report the fire hazards in our house as the situation was unknown at the time. A cell phone, TV, clothes and other items have been found so far. Many people in the village express their view that there is a strange power in the house and that there have been no such incidents in the village so far. Representatives of the science platform visited the house Friday evening to learn about the matter. Barossa said that the police who carried out the investigation would soon uncover the mystery and that the people of the village, including the family members of the house, had nothing to fear.

Comments
Post a Comment