కరోనా సాకుతో కార్మిక హక్కులపై వేటు


“దేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో పారిశ్రామిక విప్లవానికి ముందు ఏ పరిస్థితుల్లో కార్మికులు పనులు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది” అని కార్మిక సంఘాలకు సంబంధించిన కొంతమంది చెబుతున్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు కరోనాపై పోరాటం పేరుతో కార్మిక చట్టాల్లోని చాలా నిబంధనలను మూడేళ్ల వరకూ అటకెక్కించాయి. అంటే, కార్మికుల సంక్షేమం కోసం చేసిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేకుండా పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలకు మినహాయింపులు ఇచ్చినందుకే వారు అలా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం తమ మంత్రిమండలి సమావేశంలో వీటిలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్రంలో పెట్టుబడులు పెంచేందుకు ఒక నిర్ణయానికి వచ్చింది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తర్వాత రాష్ట్రంలో ఇక కార్మికులకు సంబంధించిన మూడు చట్టాలే అమలవుతాయని, మిగతా చట్టాలు మూడేళ్ల వరకూ అమలులో ఉండవని ప్రకటన జారీ చేశారు. అమలులో ఉండే ఆ మూడు చట్టాలు- భవన నిర్మాణ కార్మిక చట్టం, వెట్టిచాకిరి వ్యతిరేక చట్టం, కార్మిక పరిహార చట్టంలో ఐదో షెడ్యూల్.

పన్నెండు గంటల షిఫ్ట్
మారిన పరిస్థితుల ప్రకారం కార్మికులు ఇక 12 గంటల షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణాలో కూడా కార్మికులు 8 గంటలకు బదులు 12 గంటల షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆర్కే తివారి మంత్రిమండలి నిర్ణయాలపై మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రానికి చెందిన చాలామంది వలస కార్మికులు తమ ఇళ్లకు వస్తున్నారు. అంటే వారందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంటుంది” అన్నారు. అలాగే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కార్మిక ఒప్పంద చట్టాన్ని వెయ్యి రోజుల వరకూ రద్దు చేయాలని నిర్ణయించింది. దానితోపాటు పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్‌ కూడా రద్దు చేశారు. మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక యూనిట్లు, కొత్తగా తెరిచే యూనిట్లకు కూడా వర్తిస్తుంది.

యజమాని బాధ్యత
కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాలు సరైన స్థితిలో ఉండేలా చూసుకోవడం యజమానుల బాధ్యత. వారికి ప్రాథమిక సౌకర్యాలు అందించడం కూడా వారి చట్టపరమైన బాధ్యత. కానీ ఇకమీదట అలా జరగదు. పారిశ్రామికవేత్తల చట్టప్రకారం ఇప్పటివరకూ అంగీకరిస్తూ వచ్చిన బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వారికి విముక్తి కల్పించాయి.

మరో మూడేళ్ల వరకూ రద్దు కానున్న కొన్ని నిబంధనలు:
పనిచేసే ప్రాంతం లేదా ఫ్యాక్టరీలో అపరిశుభ్రత ఉంటే చర్యల నుంచి యాజమాన్యాలకు ఉపశమనం. పనిచేసే ప్రాంతంలో వెంటిలేషన్ లేకపోయినా లేదా అది గాలి ప్రసరించే ప్రాంతాల్లో లేకపోయినా వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. కార్మికుల్లో ఎవరైనా పని వల్ల అనారోగ్యానికి గురైతే, ఫ్యాక్టరీ మేనేజర్ లేదా సంబంధిత అధికారికి తెలియజేయాల్సిన అవసరం లేదు. మరుగుదొడ్లు లేకపోయినా యాజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోరు. యూనిట్లు తమ సౌలభ్యం, షరతుల ప్రకారం కార్మికులను నియమించవచ్చు, తొలగించవచ్చు. కార్మికులు దుర్భర స్థితిలో పనిచేస్తుంటే, లేబర్ కోర్టు పట్టించుకోదు, మరో కోర్టులో కూడా దానిని సవాలు చేయలేం.

భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత
వీటితోపాటు కార్మికులు ఉండడానికి, విశ్రాంతి తీసుకోడానికి ఏర్పాట్లు, లేదా మహిళా కార్మికుల పిల్లల కోసం క్రెచ్ లాంటివి ఏర్పాటు చేయడం కొత్త కంపెనీలకు తప్పనిసరి కాదు. ఈ యూనిట్లపై ఎలాంటి ప్రభుత్వ సర్వేలు కూడా ఉండవు. 1982లో భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం కంపెనీలు ప్రతి ఏటా ఒక్కో కార్మికుడికి 80 రూపాయల చొప్పున జమ చేయడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు ఆ నిబంధన కూడా తొలగించాలని నిర్ణయించారు. ప్రతిపాదనలో ఉన్న కొత్త నిబంధనలపై కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. వీటివల్ల మరోసారి పారిశ్రామిక విప్లవం ముందున్న పరిస్థితులు ఏర్పడుతాయని వారు అంటున్నారు. ప్రభుత్వాలు కార్మికులను వెట్టిచాకిరీ వైపు నెట్టేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

వెట్టిచాకిరీ లాంటి ప్రవర్తన
ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి త్వరలో ఈ నిర్ణయాలను కోర్టులో సవాలు చేస్తాయని బీబీసీతో మాట్లాడిన భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సెక్రటరీ రాజీవ్ అరోడా చెప్పారు. “సుదీర్ఘ పోరాటం తర్వాత కార్మికులు తమ పరిస్థితిని మెరుగ్గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కరోనా మహమ్మారి సాకుతో కార్మిక చట్టాలను యాజమాన్యాల దగ్గర తాకట్టు పెట్టాయి” అని ఆయన అన్నారు.

మరోవైపు, సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా దీనిపై ట్వీట్ చేశారు. “ఇది వెట్టిచాకిరి కంటే ఘోరంగా ఉంది. భారత రాజ్యాంగం అసలు ఉనికిలో ఉందా? దేశంలో ఏదైనా చట్టం అనేది ఉందా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనల్ని పురాతన కాలంలోకి నెట్టేస్తోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తాం” అన్నారు. ఒక ట్వీట్‌లో మధ్యప్రదేశ్ గురించి ప్రస్తావించిన ఆయన “భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు చేసిన చట్టాలను, అందరి సంక్షేమం కోసం రూపొందించారు” అన్నారు.

కార్మిక చట్టాల్లో మార్పులు
“మహమ్మారి పేరుతో కోట్లాది కార్మికుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టి లాభార్జనను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఏచూరి అన్నారు. అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిర్ణయాలపై కేంద్రం ఇంకా ఆమోదముద్ర వేయలేదు. కార్మిక చట్టాల్లో మార్పుల కోసం రాష్ట్రాలు చేసిన ఈ ప్రతిపాదనలు కేంద్రం ఆమోదం తర్వాతే అమలవుతాయి. కానీ, కార్మిక సంఘాలు ఆ లోపు వాటిని సవాలు చేసేందుకు న్యాయస్థానం తలుపు తట్టే సన్నాహాల్లో ఉన్నాయి.
-----------------------------------------------------------

Some of the trade unions say that "in some of the major states of the country, the conditions under which workers were forced to work before the Industrial Revolution were created now." Most states in the country have forked out most of the provisions of labor laws in the name of the fight against corona for three years. That is to say, entrepreneurs and owners are exempt from the need to enforce laws for the welfare of workers. The Uttar Pradesh government made the most important decision of this at its Cabinet meeting on Wednesday. A decision was made to increase investment in the country.

After a cabinet meeting chaired by Chief Minister Yogi Adityanath, the state issued a statement that all three laws relating to labor would remain in force and the remaining laws would not be in force for three years. The three laws that are in force - the Fifth Schedule of the Building Labor Act, the Anti-Vegetarian Law and the Workers' Compensation Act

Twelve-hour shift
Depending on the circumstances, workers will have to work longer 12-hour shifts. Workers in Himachal Pradesh, Punjab and Haryana also have to work 12 hour shifts instead of 8 pm. Uttar Pradesh General Secretary Arke Tiwari told mediapersons about the cabinet decisions: “Many migrant workers from the state are coming to their homes. That means we need to find employment for all. ” Also, the Madhya Pradesh government has decided to abolish the labor contract law for a thousand days. The Industrial Disputes Act and the Industrial Relations Act were also repealed. The decision of Madhya Pradesh also applies to the existing industrial units and the newly opened units in the state.

The owner is responsible
It is the responsibility of the employers to ensure that the areas where the workers are working are in proper condition. Providing them with basic facilities is also their legal responsibility. But that is no longer the case. The state governments have freed them from the obligations so far agreed upon by the industrialists.

Some of the terms that will be repealed for another three years:
Relief of ownership from operations if there is impurity in the working area or factory. If there is no ventilation in the working area or it is in the air vents, there is no action on them. If any of the workers get sick due to work, you do not need to notify the factory manager or the concerned officer. In the absence of toilets, no action will be taken against the owners Units can hire and fire workers according to their convenience and conditions. If the workers are in a deplorable state, the Labor Court will not care and cannot be challenged in another court.

After the Bhopal gas tragedy
It is not mandatory for new companies to arrange for workers to stay, rest, or provide crెche for women workers' children. There will be no government surveys on these units. After the Bhopal gas tragedy of 1982, the Madhya Pradesh government set up a labor welfare fund. Accordingly, the company has made it mandatory to deposit Rs 80 per worker per year. Now it is decided to repeal that clause. The trade unions are outraged over the new regulations being proposed. They say that this will once again create conditions that precede the Industrial Revolution. Governments are accusing the government of pushing workers towards vetachakari.

Vettichakiri-like behavior
Speaking to the BBC, Indian National Trade Union Congress Secretary Rajeev Arora said the trade unions would soon challenge these decisions in court. “After a long struggle, the workers are trying to make their situation better. But governments have tied labor laws with the pretext of corona pandemonium, ”he said.

On the other hand, CPM leader Sitaram Yechury also tweeted about it. “It is worse than vetchikkari. Does the Constitution of India Actually Exist? Is there any law in the country? The Bharatiya Janata Party government is pushing us back to ancient times. We strongly oppose it. ” Referring to Madhya Pradesh in a tweet, he said that "the laws designed to protect the interests of workers in the aftermath of the Bhopal gas tragedy are for the welfare of all."

Changes in labor laws
“Efforts are underway in the name of the pandemic to endanger the lives of millions of workers and promote profitability,” said Yechury. However, the Center has not yet approved the Uttar Pradesh and Madhya Pradesh decisions. These proposals by the states for changes to labor laws will only be implemented once the Center approves them. But the trade unions are preparing pre-court doors to challenge them.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !