ఎప్పుడూ లేనిది ఇండియాపై నేపాల్ గరంగరం !
భారత్, చైనాలను అనుసంధానం చేసే ఓ రహదారి ప్రాజెక్టుపై నేపాల్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో ఉన్న భారత దౌత్య కార్యాలయం ఎదుట పదుల సంఖ్యలో జనం పోగై శనివారం నిరసనకు దిగారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఆ నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ధార్చులా నుంచి లిపులేఖ్ (చైనా సరిహద్దు) వరకూ ఉన్న లింక్ రోడ్డును ప్రారంభించారు. దీన్ని నిర్మించిన సరిహద్దు రహదారుల సంస్థకు అభినందనలు తెలిపారు.
నేపాల్ అభ్యంతరాలకు కారణం ఏంటంటే...
లిపులేఖ్ మార్గం తమ భూభాగమని నేపాల్ అంటోంది. 1816లో కుదిరిన సుగౌలీ ఒప్పందాన్ని దీనికి ఆధారంగా చూపుతోంది. సుగౌలీ ఒప్పందం భారత్‌తో తమ పశ్చిమ సరిహద్దులను నిర్ణయించిందని, దీని ప్రకారం మహాకాలీ నది తూర్పునున్న ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందని నేపాల్ అంటోంది. నేపాల్ చెబుతున్న ఈ ప్రాంతంలోనే లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్ ఉన్నాయి. వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న కాలాపానీ 1962లో భారత్-చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి భారత సైన్యం నియంత్రణలో ఉంది. ఆ ప్రాంతం కూడా తమదేనని నేపాల్ వాదిస్తోంది. నేపాల్ విదేశాంగ శాఖ శనివారం ఓ అధికారిక ప్రకటనను జారీ చేసింది. ‘‘సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కుదిరిన అంగీకారానికి భారత్ ఏకపక్ష చర్యలు విఘాతం కలిగిస్తున్నాయి’’ అని అందులో పేర్కొంది. కాఠ్‌మాండూలోని భారత దౌత్యకార్యాలయం బయట, మరికొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరిగాయని నేపాల్ పోలీసులు తెలిపారు. కనీసం 38 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నేపాల్‌లో ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీన్ని లెక్కచేయకుండా నిరసనకారులు రహదారులపైకి వచ్చారు. నేపాల్‌లో ట్విటర్‌లో శనివారం #backoffindia అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ‘‘మా పొరుగు దేశమైన భారత్ విస్తీర్ణపరంగా ప్రపంచంలోనే ఏడో అతిపెద్దది. దాని వైశాల్యం 3.28 లక్షల చదరపు కి.మీ.లు. కానీ, వారికది చాలడం లేదు. ఇంకొన్ని కి.మీ.లు కావాలని కోరుకుంటున్నారు. నేపాల్‌కు చెందిన లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్ కూడా వారివి చేసుకోవాలని అనుకుంటున్నారు’’ అని నేపాల్ రాజ్యాంగ నిపుణుడు బిపిన్ అధికారి ట్వీట్ చేశారు. ‘‘ఆ ప్రాంతంపై వివాదం ఉందని రెండు పక్షాలు అంగీకరించాయి. సంప్రదింపుల సమయంలో భారత్ ఏపక్షంగా, బలవంతంగా చేస్తున్న చర్యలు రెండు దేశాల స్నేహ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి’’ అని భారత్‌లో నేపాల్ దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవం ఉన్న బేష్ బహాదూర్ థాపా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.
‘పూర్తిగా భారత్‌లోనే’
నేపాల్ నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పందించారు. ‘‘పిథౌరాగఢ్‌లో ప్రస్తుతం ప్రకటించిన రహదారి పూర్తిగా భారత ప్రాంతంలోనిదే. కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లేవాళ్లు ఈ రహదారి గుండా వెళ్తారు’’ అని అన్నారు. ‘‘పిథౌరాగఢ్-తవాఘాట్-ఘాటియాబాగడ్ మార్గానికి ధార్చులా-లిపులేఖ్ రహదారి కొనసాగింపు మార్గం, ఘాటియాబాగడ్‌లో మొదలై లిపులేఖ్ మార్గం వద్ద ఇది ముగుస్తుంది. లిపులేఖ్ కైలాస్ మానసరోవర్‌కు ప్రవేశ మార్గం. 80 కి.మీ.ల ఈ రహదారి 6000 నుంచి 17,060 మీటర్ల ఎత్తులో ఉంటుంది’’ అని భారత రక్షణశాఖ తెలిపింది. ఇదివరకు ఈ మార్గంలో కైలాస్ మానసరోవర్ యాత్రికులకు ఉన్న అవరోధాలు ఈ రహదారితో తొలగుతాయని, చైనా సరిహద్దు వరకూ వాహనాల్లోనే వెళ్లవచ్చని వివరించింది. ‘‘ప్రస్తుతం కైలాస్ మానసరోవర్‌కు చేరుకోవాలంటే సిక్కిం, నేపాల్ మార్గాల ద్వారా రెండు, మూడు వారాలు పడుతుంది. లిపులేఖ్ మార్గంలో 90 కి.మీ.ల దూరం ఎత్తైన కొండప్రాంతాన్ని ఎక్కుతూ వెళ్లాల్సి ఉండటంతో వయసులో పెద్దవాళ్లైన యాత్రికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఇక వాహనాల్లోనే యాత్రకు వెళ్లవచ్చు’’ అని పేర్కొంది.
ఇదివరకు కాలాపానీ వివాదం
ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో నేపాల్ సరిహద్దులో కాలాపానీ ప్రాంతం ఉంది. దీని విస్తీర్ణం 35 చదరపు కిలోమీటర్లు. మహాకాలీ నది పుట్టేది ఇక్కడే. నేపాల్‌తో 80.5 కి.మీ.లు, చైనాతో 344 కి.మీ.ల పొడవున సరిహద్దును ఉత్తరాఖండ్ రాష్ట్రం పంచుకుంటోంది. కాలాపానీని, మహాకాళీ నదిని భారత్ తమ దేశం భూభాగాలుగా చూపిస్తూ గత ఏడాది మ్యాప్ విడుదల చేసింది. అప్పుడు కూడా నేపాల్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాలాపానీ తమ దేశంలో ఉందని, అది భారత్‌లో ఉన్నట్లు చూపించడం సరికాదని ఆ దేశం వ్యాఖ్యానించింది. 1962లో భారత్ - చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల నియంత్రణలోనే కాలాపానీ ప్రాంతం ఉంది. చైనాతో యుద్ధం జరిగిన సమయంలో వ్యూహాత్మకంగా కాలాపానీని సైనిక స్థావరంగా చేసుకోవడానికి భారత్‌కు తాము సహకరించినట్లు నేపాల్ చెబుతోంది. ఆ యుద్ధం తర్వాత భారత్.. కాలాపానీ మినహా, నేపాల్ ఉత్తర బెల్టులో ఉన్న తమ సరిహద్దు పోస్టులన్నీ తొలగించిందని, కానీ అక్కడి నుంచి మాత్రం భారత సైన్యం వెనక్కు వెళ్లలేదని నేపాల్ అధికారులు అంటున్నారు. ఈ యుద్ధానికి ముందు 1961లో కాలాపానీలో తాము జనాభా లెక్కలు చేపట్టినప్పుడు భారత్ అభ్యంతరం వ్యక్తం చేయలేదని వాళ్లు చెబుతున్నారు. ఈ కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్ చెప్పడానికి బలమైన కారణం సుగౌలీ ఒప్పందం. నేపాల్‌కు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1816లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం కాళీ నది భారత్‌తో నేపాల్ సరిహద్దుగా ఉందని ఆ దేశం అంటోంది. కాలాపానీ భారత్‌లో ఉండటమంటే సుగౌలీ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదిస్తోంది.
-------------------------------------------------------
There is outrage in Nepal over a road project linking India and China. Tens of thousands marched in front of the Indian embassy in Kathmandu, Nepal's capital, on Saturday, according to AFP news agency. The protesters were arrested by the police for not disturbing the security of the peace. Indian Defense Minister Rajnath Singh opened the link road from Dharchula to Lipulekh (China border) on Friday. He congratulated the company for the construction of the border road.
The reason for Nepal objections is ...
Nepal says the Lipulek route is their territory. The basis of this is the Sugauli Treaty of 1816. Nepal claims that the Sugauli treaty has set its western boundaries with India, which means that the eastern region of the Mahakali River falls under it. This region of Nepal is also home to Limpiyadura, Kalapani and Lipulekh. The strategically important Kalapani has been under the control of the Indian Army since the India-China War in 1962. Nepal claims that the region is theirs. Nepal's Foreign Ministry issued an official statement on Saturday. India's one-sided actions have been hampered by India's willingness to settle border disputes through negotiations, it said. Nepal police said that there were protests outside the Indian embassy in Kathmandu and elsewhere. At least 38 people have been arrested. A nationwide lockdown is now being implemented in Nepal to curb the spread of coronavirus. Without counting it, protesters took to the streets. The hashtag #backoffindia became a trend on Twitter in Nepal on Saturday. Our neighboring country, India, is by far the seventh largest in the world. Its area is 3.28 lakh sq km. But, they don't have enough. Someone wants another km. Nepal's Limpiyadura, Kalapani and Lipulek also intend to be the telephone number, a Nepalese constitution expert Bipin official tweeted. Both sides agree that there is a dispute over the area. India's ambitious and forceful actions during the negotiations are damaging the friendship of the two countries.
Completely in India..
Indian Foreign Ministry spokesperson Anurag Srivastava responded to the objection from Nepal. The currently announced road in Pithoragarh is entirely in the Indian region. Kailas Mansarovar said that travelers passing through this road would be a mobile phone. Continuing the Dharchula-Lipulekh road to the Pithauragad-Tawaghat-Ghatiyabagad road, beginning at Ghatiyabagad and ending at the Lipulekh Road. Gateway to Lipulekh Kailas Mansarovar. The 80 km long highway will be 6000 to 17,060 meters, the Indian Defense Ministry said. Kailas Mansarovar explained that so far the restrictions of pilgrims on this route can be avoided along the road and can be reached by vehicles up to the Chinese border. Currently it takes two to three weeks via Sikkim and Nepal to reach Kailas Mansarovar. Older pilgrims were having difficulties as they had to go up a steep cliff about 90 km along the Lipulek route. Now you can go on a journey in vehicles, says the mobile phone.
So far the Kalapani controversy
It is located in the Pithoragarh district of Uttarakhand. It covers an area of 35 square kilometers. This is where the Mahakali River originates. The state of Uttarakhand shares a boundary of 80.5 km with Nepal and 344 km with China. India released a map last year showing the Kalapani and Mahakali River as territories of India. Even then there were objections from Nepal. The country said it was inappropriate to show that Kalapani was in their country and that it was in India. Since the India-China War of 1962, the Kalapani region has been under the control of the Indo-Tibetan Border Police. Nepal says it has cooperated with India to strategically make Kalapani a military base during the war with China. After the war, Nepal officials say that except for Kalapani, Nepal has removed all its border posts in the northern belt, but that the Indian army has not withdrawn. They claim that India did not object to the census in Kalapani in 1961 before the war. The strongest reason for Nepal's claim that this Kalapani region is theirs is the Sugouli Pact. The treaty between Nepal and the East India Company in the year 1816 states that the Kali River is the boundary of India with India. Kalapani claims that being in India is a violation of the Sugauli Agreement.
Comments
Post a Comment