మూడు మందుల కాంబినేషన్ మహమ్మారిని నిలువరించేనా?


అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ను రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వేల కోట్ల వ్యయంతో ప్రయోగశాలల్లో వ్యాక్సిన్లు, సమర్థ ఔషధాల కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర అంశం వెల్లడించారు. మూడు రకాల మందుల కాంబినేషన్ ను కరోనా చికిత్సలో వాడితే, సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

యాంటీ వైరల్ థెరపీలో భాగంగా కరోనా రోగులకు ఇంటర్ ఫెరాన్ బీటా-1బీతో పాటు లోపినవివర్-రిటోనవిర్, రైబావిరిన్ ఔషధాలను ఇచ్చినట్టయితే శరీరంలో వైరస్ ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. కేవలం లోపినవిర్-రిటోనవిర్ మాత్రమే ఇచ్చినప్పుడు ఏమంత సమర్థంగా పనిచేయలేదని, ఇతర యాంటీ వైరల్ మందులు కూడా జతచేసినప్పుడు ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన ఆ పరిశోధకులు వివరించారు. 

సింగిల్ డ్రగ్ ట్రీట్ మెంట్ కంటే కాంబినేషన్ లో యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా అధిక ప్రభావం కనిపిస్తోందని, అయితే, రోగులు కరోనా లక్షణాలు కనిపించిన వారంలోపే ఆసుపత్రిలో చేరినప్పుడే ఈ ట్రిపుల్ కాంబినేషన్ మందులు శక్తిమంతంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ మూడు మందుల వాడకంతో రోగులు ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం కూడా తగ్గుతుందని, వారిలో వైరల్ లోడ్ కొన్నిరోజుల్లోనే కనిష్ట స్థాయికి చేరుతుందని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన క్వోక్ యుంగ్ యువెన్ వెల్లడించారు. ఈ విధమైన ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్ ను రోగులు బాగానే తట్టుకుంటారని, ఇది సురక్షితమైన వైద్య విధానం అని చెప్పారు.
----------------------------------------------------------------

Fierce efforts are underway around the world to eradicate the most dangerous corona virus. Trials for vaccines and effective drugs are being tested in laboratories at a cost of thousands of crores. Against this backdrop, Hong Kong University researchers have revealed an interesting point. The combination of all three drugs has been shown to be effective in corona treatment, he said.

Researchers have reported that the number of viruses in the body is significantly reduced if coronavirus patients are given intravenous anti-viral therapy, ribonavir and ribavirin, as part of anti-viral therapy. Researchers at the University of Hong Kong explained that when given only lavonavir-ritonavir did not work effectively, the results were promising when other antiviral drugs were added.

The combination of antiviral drugs appears to be more effective in combination than in single drug treatment, but the triple combination medication is effective only when patients are hospitalized within weeks of the appearance of coronary symptoms. The use of these three medications also reduces the need for patients to stay in the hospital for longer periods of time, according to Kwok Yung Yuen of the University of Hong Kong. Patients are better off with this type of triple drug combination, saying it is the safest medical procedure.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !