కిమ్ బాగున్నడు.. బతికే ఉన్నడు !


20 రోజుల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రజల ముందుకొచ్చారని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. ఓ ఎరువుల ఫ్యాక్టరీలో వార్షిక వేడుకల సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశారని కేసీఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. ఆయన కనిపించగానే ఫ్యాక్టరీ దగ్గరున్న ప్రజలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారని పేర్కొంది. ఏప్రిల్ 12న ఆయన ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా వదంతులు వ్యాపించిన తర్వాత కిమ్ బయటకు రావడం ఇదే మొదటిసారి. అయితే ఉత్తర కొరియా మీడియాలో వస్తున్న ఈ సమాచారాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు. కిమ్ ఓ ఫ్యాక్టరీలో రిబ్బన్ కట్ చేస్తున్న ఫొటోలను జాతీయ మీడియా విడుదల చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను రిపోర్టర్లు ప్రశ్నించగా తాను ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదని చెప్పారు.
ఉత్తర కొరియా మీడియా ఏం చెబుతోంది?
కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ప్రకారం.. కిమ్ తన సోదరి కిమ్ యో జోంగ్‌తో సహా కొందరు ఉత్తర కొరియా సీనియర్ అధికారులతో కలిసి ఈ చిత్రాల్లో కనిపించారు. "ప్యాంగ్‌యాంగ్‌కు ఉత్తరంగా ఉన్న ఓ ప్లాంట్ దగ్గర జరుగుతున్న వేడుకలను కిమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దీంతో అక్కడున్న ప్రజలంతా ఆనందంతో 'హుర్రే' అంటూ అరిచారు" అని కేసీఎన్ఏ వెల్లడించింది. "ఫ్యాక్టరీ ప్రొడక్షన్ సిస్టమ్‌పై తాను సంతృప్తి చెందినట్లు కిమ్ తెలిపారు. దేశంలో రసాయన పరిశ్రమ, ఆహార ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఫ్యాక్టరీని ప్రశంసించారు" అని కేసీఎన్ఏ తెలిపింది.
కిమ్ ఆరోగ్యంపై వదంతులు
తన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్ జయంతి వేడుకలకు ఏప్రిల్ 15న కిమ్ హాజరు కాలేదు. దీంతో ఆయన అనారోగ్యంతో ఉన్నారంటూ ప్రపంచవ్యాప్తంగా వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాలో ఈ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో జరుగుతాయి. సాధారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఆరోజు తన తాత సమాధిని సందర్శిస్తారు. ఇప్పటివరకూ కిమ్ ఎప్పుడూ ఈ వేడుకలకు హాజరు కాకుండా ఉండలేదు. దీంతో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారు కొందరు నిర్వహిస్తున్న ఓ వెబ్ సైట్‌లో కిమ్ అనారోగ్యంతో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. గత ఆగస్ట్ నుంచి కిమ్ కార్డియోవాస్కులర్ సమస్యలతో కిమ్ బాధపడుతున్నారని, పేక్తూ పర్వతాన్ని మళ్లీ మళ్లీ అధిరోహించడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి 'డైలీ ఎన్‌కే'కు తెలిపారు. దీని ఆధారంగా అంతర్జాతీయ మీడియా కిమ్ ఆరోగ్యంపై అనేక కథనాలు ప్రసారం చేసింది. ఆ తర్వాత ఈ వార్తపై దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయని కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత మరో విషయం వ్యాప్తిలోకి వచ్చింది. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కిమ్ ఆరోగ్యం విషమించిందని అమెరికన్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఏప్రిల్ 29న వీటిని అమెరికా మంత్రి మైక్ పాంపేయో కొట్టిపారేశారు. అమెరికా అధికారులెవరూ ఇటీవలి కాలంలో కిమ్‌ను చూడలేదని స్పష్టం చేశారు. అయితే, కిమ్ ఆరోగ్యంపై వస్తున్నవన్నీ వదంతులేనని దక్షిణ కొరియా ప్రభుత్వం, చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపాయి.
గతంలో ఎప్పుడైనా కిమ్ కనిపించకపోవడం జరిగిందా?
గతంలో కూడా ఓసారి ఇలానే జరిగింది. 2014 సెప్టెంబర్‌లో ఓ కచేరీకి హాజరైన తర్వాత నుంచి దాదాపు 40 రోజుల పాటు కిమ్ కనిపించలేదు. మళ్లీ అక్టోబర్ నెలలో ఆయన తిరిగి కనిపించారు. అయితే, ఆయన ఎక్కడకు వెళ్లారనే విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించలేదు. కానీ, కిమ్ తన ఎడమ కాలి మడమకు ఆపరేషన్ చేయించుకుని ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది.
-----------------------------------------------------------------

North Korean media reported that the president of North Korea, Kim Jong Un, arrived in public after 20 days. Kim cut the ribbon during an annual celebration at a fertilizer factory, KCNA news agency reported. When he showed up, he said that all the people near the factory were blown away. This is the first time Kim has come out on April 12 after rumors spread about his health. However, the BBC has not independently verified this information coming from the North Korean media. National media released photos of the ribbon cutting at the Kim O Factory. Reporters questioned US President Donald Trump and said he did not want to make any comments on the matter.

What is the North Korean media saying?
According to the Korean Central News Agency (KCNA) .. Kim appeared in the films along with some North Korean senior officials, including her sister Kim Yo Jong. "Kim Ribbon cut the ceremony at a plant just north of Pangyang. People shouted 'Hurray' with joy," KCNA reported. "Kim said he was satisfied with the factory production system. He praised the factory for helping the chemical industry and food products develop in the country," KCNA said.

Rumors on Kim's health
Kim was absent on April 15 for the celebrations of her grandfather, North Korean founder Kim Sung Jayanti. Rumors began circulating around the world that he was ill. In North Korea, the Jayanti celebrations are held in large numbers across the country. Normally Kim Jong Un Arozu visits his grandfather's grave. So far, Kim has never attended a ceremony. This has led to reports that Kim is ill on a website run by some of the North Korean fugitives. One person, who did not want to be named, told 'Daily NK' that Kim had been suffering from cardiovascular problems since last August and that he was in good health as he climbed Mount Pekutu again and again. Based on this, the international media has published several articles on Kim's health. There have also been reports that the South Korean and US intelligence agencies are investigating the news. But then another thing spread. There have been reports in the American media that Kim is in good health after undergoing a heart surgery. On April 29, however, they were dismissed by US Minister of State Mike Pompeo. US officials have made it clear that they have not seen Kim in recent times. However, the South Korean government and Chinese intelligence sources have told Reuters news agency that everything about Kim's health is rumored.

Did Kim ever disappear in the past?
The same thing happened in the past. Kim has not been seen for nearly 40 days since attending a concert in September 2014. He reappeared again in October. However, the national media did not reveal where he went. But South Korea's intelligence says Kim may have had an operation on her left toe heel.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !