నిర్బంధానికి ఆధ్యాత్మిక సంకటం
కరోనా కేసులు రోజురోజుకూ ఎంతలా పెరుగుతున్నా.. ప్రజలు మాత్రం నిత్యం దేశంలో ఏదో చోట ఆధ్యాత్మికత పేరిట లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలోని సోలాపూర్లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఇక్కడ ఏకంగా రథ యాత్ర నిర్వహించగా, వేలాది ప్రజలు గుమిగూడారు. దీన్ని పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించగా కొందరు భక్తులు వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో భక్తులను అదుపు చేయడం పోలీసుల వల్ల కాక, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రథయాత్ర జరుగుతున్న స్థలం నుంచి పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత పోలీసులు రాళ్లతో కొట్టిన పలువురిపై కేసు నమోదు చేసి ఊరుకున్నారు. ఈ విషయమై షోలాపూర్ పట్టణానికి చెందిన ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇది అత్యంత హేయమైన చర్యనీ, లాక్ డౌన్ తమ కోసమే ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రజలు గుర్తుంచుకొని, ఇలాంటి హింసాత్మక చర్యలకు స్వస్తి పలకాలని కోరారు. ఇదిలా ఉంటే, మరో పుణ్యక్షేత్రం షిరిడీలోనూ ఇటువంటి సంఘటనే చోటుచేసుకోవడం గమనార్హం!
-------------------------------------------------------------------
Cases of corona infection are increasing daily, but people associated with religious faith are engaged in fulfilling customs. A chariot yatra was organized in Solapur, Maharashtra in violation of the lockdown, where hundreds of people gathered. The police asked the people to stop the journey and go home, but this is also not accepted by the police. Not only this, people started throwing stones at the police, after which the police registered a case against the stone-pelters.
A similar case also surfaced in Shirdi where the temple CEO conducted a puja on Ram Navami.
Comments
Post a Comment