ఓ విషయంలో బాలకృష్ణ, ట్రంప్ same to same అట!


ఓ విషయంలో బాలయ్యను, అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌ను ఎవరు కాపీ కొట్టలేరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ బాలకృష్ణకు, డొనాల్డ్ ట్రంప్‌కు పోలిక ఏంటా ఆశ్యర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళితే..

అమెరికా అధ్యక్షుడు తన కుటుంబంతో కలిసి రెండు రోజుల భారత్ పర్యటన నిమిత్తం మన దేశానికి విచ్చేసారు. ఆయనకు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొదటగా మన ప్రధాని.. ట్రంప్ దంపతులను గాంధీజీకి సంబంధించిన సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ ట్రంప్ గాంధీజీ పనిచేసిన రాట్నంపై నూలు ఒడికారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంతో పాటు భారత్ పర్యటనకు సంబంధించిన విషయాలను సందర్శకుల డైరీలో పొందుపరిచిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ట్రంప్‌ తన కుటుంబంతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సంతకం చేసారు. ఈ రెండు చోట్ల ట్రంప్ సంతకం చూసి నెటిజన్స్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎవరు ఆయన సంతకాన్ని కాపీ కొట్టలేనంతగా చిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ట్రంప్ సంతకాన్ని కొంత మంది తెలుగు వాళ్లు బాలకృష్ణ సంతకంతో పోలుస్తున్నారు.

అంతేకాదు.. ట్రంప్ సంతకం ఉన్న ఫోటోతో బాలయ్య సంతకం ఉన్న ఫోటోను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు సంతకాలను ప్రపంచంలో ఎవరు కాపీ కొట్టలేరు అంటూ వాళ్లిద్దరు సంతకాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి భారత్ పర్యటనకు వచ్చిన ట్రంప్ సంతకం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పర్యటన సందర్భంగా అగ్ర రాజ్యాధినేత ట్రంప్ బాలీవుడ్ సినిమాలతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను మెచ్చుకున్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ మూవీని మెచ్చుకోవడం విశేషం.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !