ఎబోలా వైరస్ మందు కోవిడ్ రోగులపై పని చేస్తోందట !


ఎబోలా చికిత్సలో ఉపయోగించే ఒక ఔషధం కరోనావైరస్ రోగులు కోలుకోవడానికి సహకరిస్తోందని "స్పష్టంగా" తెలుస్తోందని అమెరికా అధికారులు తెలిపారు. అంటువ్యాధుల నిపుణుడు, అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడి) డైరెక్టర్ ఆంథొనీ ఫౌచీ, కరోనావైరస్ చికిత్సలో ఎబోలా ఔషధంతో జరుగుతున్న ప్రయోగాలు ఫలించవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెమిడిస్వియర్‌గా పిలిచే ఈ మందును ప్రాథమికంగా ఎబోలా వైరస్‌కు చికిత్స చేయడానికి అభివృద్ధి చేశారు.

"గణాంకాలు బట్టి చూస్తే రెమిడిస్వియర్ మందు తీసుకున్న కోవిడ్ రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. రోగిలో వ్యాధి లక్షణాలు కొనసాగే వ్యవధిని ఈ మందు 15 రోజుల నుంచి 11 రోజులకు తగ్గించిందని ప్రాథమిక వివరాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు ఏదో అద్భుతంలా కనిపించకపోవచ్చు. కానీ, ఎబోలా మందు కరోనావైరస్‌ను నిరోధించగలదని నిరూపణ అయింది" అని డాక్టర్ ఫౌచీ అన్నారు. ఎన్ఐఏఐడి ఈ చికిత్సలను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అయితే, ఫలితాలను ఇంకా వెల్లడి చేయలేదు.

చైనాలో రెమిడిస్వయర్ మందుతో కరోనావైరస్ రోగులకు చికిత్స చేసినప్పుడు ఫలితాలు కనిపించలేదని, ఆ దేశంలోని ప్రయోగాల గురించి లాన్సెట్ అనే మెడికల ్ జర్నల్ పూర్తి వివరాలను ప్రచురించిన అనంతరం డాక్టర్ ఫౌచీ ప్రకటన వెలువడింది. అయితే, చైనాలో ఈ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !