ఆ దేశం కరోనాను కట్టడి చేసింది !


ఐదు వారాల లాక్ డౌన్ తర్వాత న్యూజీలాండ్‌లో కాఫీ షాపులు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం న్యూజీలాండ్‌లో మూడో స్థాయి అలర్ట్ అమలులో ఉంది. దీంతో కొన్ని అత్యవసర సేవలు కాని వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.
న్యూజీలాండ్ ఏం చేసింది?
న్యూజీలాండ్‌ వైరస్‌ని ఎదుర్కోవడానికి కారణం చాలా సత్వర చర్యలు చేపట్టడం అని ప్రముఖంగా చెప్పవచ్చు. మార్చ్ 19 నుంచి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు నుంచి ప్రయాణాల మీద ఆంక్షలు అమలు చేసింది. దీంతో విదేశాల నుంచి వచ్చే కేసులు తగ్గిపోయాయి. న్యూజీలాండ్‌లో నమోదైన 33 శాతం కేసులు బయట నుంచి వచ్చినవే. ఆ సమయంలో న్యూజీలాండ్‌లో 102 కేసులు ఉన్నట్లు ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ చెప్పారు. ఆస్ట్రేలియాలో మూడింట రెండు వంతుల కేసులు బయట నుంచి వచ్చినవే అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సంజయ్ సేనానాయకే చెప్పారు. సరిహద్దులు మూసివేయడం చాలా ముఖ్యమైన చర్య అని, అది న్యూజీలాండ్ సమర్థంగా చేసిందని ఆయన అన్నారు.

మార్చ్ 21న న్యూజీలాండ్ నాలుగు స్థాయులలో ఉండే పబ్లిక్ అలెర్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పూర్తి లాక్ డౌన్‌ని అత్యధిక స్థాయిగా, వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగితే అతి తక్కువ స్థాయిగా వర్గీకరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అప్పటికి న్యూజీలాండ్‌లో వైరస్ సామాజిక వ్యాప్తి జరిగే ముప్పు ఉన్న రెండో స్థాయిలో ఉంది. కొన్ని రోజులకే నాలుగో స్థాయికి చేరింది. ఆఫీసులు, స్కూళ్లు, పబ్లిక్ స్థలాలు బార్లు, రెస్టారెంట్లు కూడా పూర్తిగా మూసేశారు.

80 శాతం కేసులలో వ్యాధి నిర్ధరణ అయిన 48 గంటలలోపే ఆ రోగి కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. దీంతో, చాలా మంది ఇంక్యుబేషన్ సమయం ముగిసేవరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. రోజుకి 8000 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. ప్రజలు ఎవరెవరిని కలుస్తున్నారనే విషయంపై డైరీలో రాయమని సూచించారు. సింగపూర్, ఆస్ట్రేలియాలో వాడిన కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌ని తయారు చేసేందుకు న్యూజీలాండ్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు తమ ఇంటికే పరిమితం కావాలని కచ్చితమైన ఆదేశాలు ఇవ్వలేదు. దగ్గరి బంధువులు, స్నేహితులతో కలవవచ్చని చెప్పింది. ఇలా చేయడం వలన లాక్ డౌన్ నియమాలని ఉల్లఘించాలనే ఆలోచన రాదని నిపుణులు అన్నారు. ఒకరి నుంచి ఒకరు 2 మీటర్ల దూరం పాటించమని సలహా ఇచ్చారు. ప్రభుత్వం అందరికీ అర్ధం అయ్యేలా ఇచ్చిన సందేశాలను ప్రజలు ప్రశంసించారు.

ఒక దేశ ప్రధాని చాలా సున్నితమైన సందేశాన్ని జాగ్రత్తగా ప్రజలకు చేరవేయడం వల్ల వారిలో ధైర్యం కలగిందని ప్రొఫెసర్ సేనానాయకే అన్నారు. అయితే లాక్ డౌన్ నిబంధనల్ని తొందరగా సడలించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్‌ని తీసివేసినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నమోదవుతున్న కేసులపై దృష్టి పెట్టి నిబంధనల్ని ఒక్కటొక్కటిగా సడలిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. “కేసుల పర్యవేక్షణ, పరీక్షల సంఖ్యని పెంచడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తగ్గింది. కానీ, ఏ మాత్రం కేసుల సంఖ్య పెరిగినా మళ్ళీ నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని సేనానాయకే హెచ్చరించారు.
---------------------------------------------------------------------

Coffee shops and fast food restaurants have opened in New Zealand after a five-week lockdown. A third level alert is currently in effect in New Zealand. Some of the non-emergency services have been resumed.
What did New Zealand do?
It is noteworthy that the cause of the New Zealand virus is very quick. Since March 19, all countries in the world have imposed restrictions on travel since the beginning. This has led to a decrease in cases from abroad. In New Zealand, 33 percent of the cases were from outside. There were 102 cases in New Zealand at that time, Prime Minister Jacinda Ardern said. Two-thirds of cases in Australia come from outside, says Australian National University professor Sanjay Senanayake. He said the closure of the borders was an important step, which made New Zealand efficient.

On March 21, New Zealand introduced a public alert system in four locations. Accordingly, full lockdown is classified as the highest level, the lowest level that can control the spread of the virus. It advises people to be careful. In New Zealand, the virus is now at a second-level threat of social spread. In just a few days it reached the fourth level. Offices, schools, public places, bars and restaurants are completely closed.

In 80 per cent of cases, all those who met the patient within 48 hours of being diagnosed with the disease were tested. This meant that many went into self-incarceration until the end of the incubation period. Officials say about 8000 people tested for it a day. People are advised to write in a diary of who they are. New Zealand is making efforts to create a used contact tracing app in Singapore and Australia. People are not given strict orders to restrict themselves. Said to meet with close relatives and friends. Experts say that doing so has no intention of violating lockdown rules. They were advised to follow a distance of 2 meters from each other. People have appreciated the messages that the government has made for everyone.

Professor Senanayake said that a country's prime minister had the courage to deliver a very sensitive message to the public. However, he expressed concern about the speedy relaxation of the lock-down clause. He said people should remain vigilant even if the lockdown is removed. They believe that it is better to relax the regulations one by one with a focus on the cases being reported. “This is done by monitoring cases and increasing the number of tests. The number of cases has decreased at the moment. But the increasing number of cases will have to be enforced again. We should be vigilant against this, ”Senanayake warned.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !