శృంగార కార్మికుల ఆకలి కేకలు
సెక్స్ వర్కర్లలో ఉన్న పేదరికం, ఇతర కారణాలే దానికి కారణం. లాక్‌డౌన్‌లో సెక్స్‌వర్కర్లు పని చేసే సమయం ఏ మాత్రం తగ్గలేదని వారికి సాయం చేస్తున్న కొన్ని సంస్థలు చెబుతున్నాయి. మరి కొందరైతే మరో దారేదీ లేకపోవడంతో కొత్తగా ఈ వృత్తిలో చేరుతున్నారు. ఏ కారణాల వల్ల మహిళలు తమ శరీరాన్ని అమ్ముకోవాల్సి వస్తోందో ఆ కారణాలు ఇప్పటికీ పోలేదు. ‘‘నేను చేసే పనే నా ఆదాయ వనరు’’ అంటారు వీరు. అద్దె కట్టడానికి, ఆహారం కొనుక్కోవడానికి సెక్స్ వర్కర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇతరులకు అందినట్టుగా వీరికి ఏ మాత్రం సాయం అందటం లేదు. మనుషులు ఒక చోట కలవడం ద్వారానే నడిచే ఈ పరిశ్రమ కరోనాతో బాగా దెబ్బతింది. భద్రత లేకపోవడం, తీవ్రమైన అసమానతలు ఎదుర్కొంటున్న సెక్స్ వర్కర్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. బ్రిటన్‌లో సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్నారు క్లెయిర్. లాక్‌డౌన్ ఈమె ఆదాయాన్ని తుడిచిపెట్టేసింది. ‘‘ప్రస్తుతం నేను ఎవరి వద్దకూ వెళ్లలేను. ఎవరినీ కలవలేను. దాంతో నా ఆదాయానికి గండిపడింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను బాగా కష్టాల్లో ఉన్నాను’’ అని ఆమె తెలిపారు. క్లెయిర్ సాధారణంగా నెలలో వారం రోజులు ఇటలీలో పనిచేస్...