ఆ బాలుడంటే చైనాకు ఎందుకంత భయం ?


ఇది టిబెట్‌కు చెందిన గెధున్ చోకీ నియిమా ఫోటో. క‌నిపించ‌కుండాపోయిన ప్ర‌‌పంచ ప్ర‌ముఖుల్లో ఆయ‌న‌ కూడా ఒక‌రు. ఆయ‌నకు ఆరేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు ఈ ఫోటో తీశారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనున్న‌ ఆయ‌న ఏకైక ఫోటో ఇదే. దీనిలో గులాబీ రంగు బుగ్గ‌ల‌తో ఆయన చ‌క్క‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు 31 ఏళ్లు. ఆయ‌న్ను పంచెన్‌ లామాగా గుర్తించిన మూడు రోజుల‌కే చైనాలో ఆయ‌న కుటుంబంతోపాటు క‌నిపించ‌కుండా పోయారు. ఈ ఘ‌ట‌న‌కు మే 17తో స‌రిగ్గా 25 ఏళ్లు పూర్త‌యింది. టిబెట‌న్ బుద్ధిజంలో పంచెన్ లామా రెండో అత్యంత ప్ర‌ముఖుడు. అదృశ్య‌మైన త‌ర్వాత‌ ఆయ‌నకు ఏం జ‌రిగిందో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స‌మాచార‌మూ లేదు. ఆయ‌న్ను ఇప్ప‌టికైనా చైనా విడుద‌ల చేయాల‌ని చైనా బ‌య‌ట‌నున్న టిబెట‌న్లు కోరుతున్నారు. అయితే కేవ‌లం చైనా అధికారుల‌కు మాత్ర‌మే ఆయన ఎక్క‌డున్నారో తెలుసు. ఇప్పుడు వారు నోరు తెరచి నిజం చెబుతార‌ని ఎవరూ అనుకోవ‌డం లేదు. "మాకు మ‌బ్బు ప‌ట్టిన‌ట్టు అనిపిస్తోంది"అని లండ‌న్లో ఉంటున్న టిబెట్ అజ్ఞాత ప్ర‌భుత్వ ప్ర‌తినిధి సోన‌మ్ షెరింగ్ వ్యాఖ్యానించారు. పంచెన్ లామాను ఇప్ప‌టికైనా విడుద‌ల చేయాల‌ని కోరుతున్న వారి బాధ‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ఎలాంటి ప‌రిణామాలు ఎదుర్కోకుండానే తాము కోరుకున్న వారిని క‌నిపించ‌కుండా చేయ‌గ‌ల చైనా నాయ‌కుల సామ‌ర్థ్యాన్ని ఈ కేసు క‌ళ్ల‌కు క‌డుతోంది.

పంచెన్ లామాకు ఏమైందో క‌నుక్కొనేందుకు ఐరాస వ‌ర్కింగ్ గ్రూప్.. 1995 నుంచీ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స‌మాచారాన్నీ తెలుసుకోలేకపోయారు. పంచెన్ లామా అదృశ్య‌మై 25 ఏళ్లు అవుతున్న త‌రుణంలో కొన్ని వారాల కిందట తాము చేసిన కృషిపై బీబీసీకీ ఆ ఐరాస బృందం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. "ఈ విష‌యంపై చైనా ప్ర‌భుత్వం చాలాసార్లు స్పందించింది. అయితే వారిచ్చే స‌మాచారం కేసును ప‌రిష్క‌రించేందుకు స‌రిపోవ‌డం లేదు. అందుకే ఎన్నేళ్ల‌యినా కేసు ఇలానే ఉండిపోయింది" 2013లో త‌మ‌ను దేశంలో ప‌ర్య‌టించేందుకు అనుమ‌తించాల‌ని చైనా ప్ర‌భుత్వాన్ని వ‌ర్కింగ్ గ్రూప్ కోరింది. త‌మ అభ్య‌ర్థ‌న‌కు ఆరేళ్లు పూర్త‌యినా ఇప్ప‌టికీ ఆమోదం దొర‌క‌లేద‌ని త‌మ వార్షిక నివేదిక‌లో వ‌ర్కింగ్ గ్రూప్ తెలిపింది. "త్వ‌ర‌లో సానుకూల ప్ర‌త్యుత్త‌రం వ‌స్తుంద‌ని భావిస్తున్నాం" అని నివేదిక‌లో పేర్కొంది. ఈ ఆరేళ్ల బాలుణ్ని చైనా కావాల‌నే క‌నిపించ‌కుండా చేసేందుకు చాలా కార‌ణాలున్నాయి. టిబెట‌న్ బుద్ధిజంలో ద‌లైలామా త‌ర్వాత అంత‌టివాడు పంచెన్ లామా. ఇక్క‌డి టిబెటన్‌ ప్రాంతంపై చైనా ఆధిప‌త్యాన్ని వ్య‌తిరేకించే టిబెట‌న్ల‌కు ద‌లైలామా నాయ‌కుడు. 1959లో ఆయ‌న టిబెట్ వ‌దిలివెళ్లారు. చైనాలో త‌మ పాల‌న‌కు ద‌లైలామాలాగే పంచెన్ లామా కూడా అడ్డుకాకూడ‌ద‌ని, పంచెన్ లామా కూడా ప్ర‌జా నాయ‌కుడిగా మారకూడ‌ద‌ని చైనా భావించిన‌ట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గెధున్ అదృశ్య‌మైన త‌ర్వాత వేరొక‌రిని పంచెన్ లామాగా చైనా ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ప్ర‌స్తుత ద‌లైలామా మ‌ర‌ణానంత‌రం సొంతంగా ఓ ద‌లైలామాను చైనా ఎంపిక చేస్తుంద‌ని చాలా మంది భావిస్తున్నారు.

చైనా మాట ఎలా మార్చింది?
గ‌త 25ఏళ్ల‌లో పంచెన్ లామా అదృశ్యం గురించి కొంత స‌మాచారం బ‌య‌ట‌పెట్టింది. అంతేకాదు తాము ఎలాంటి త‌ప్పూ చేయ‌లేద‌నే రీతిలో స్పందించింది. ఆయ‌న క‌నిపించ‌కుండాపోయిన వెంట‌నే ఐరాస వ‌ర్కింగ్ గ్రూప్ ముందు చైనా స్పందించింది. గెధున్ అదృశ్య‌మైన‌ట్టు లేదా ఆయ‌న కుటుంబం క‌నిపించ‌కుండా పోయిన‌ట్లు ఎలాంటి కేసూ న‌మోదుకాలేద‌ని వివ‌రించింది. ఇదంతా ద‌లైలామా గ్రూప్ అల్లిన క‌ట్టుక‌థ‌ని వివ‌రించింది. 1996లో చైనా మాట మార్చింది. "కొంత‌మంది నీతి, నిజాయితీలేనివారు ఆ బాబును విదేశాల‌కు అక్ర‌మంగా తీసుకెళ్లాల‌ని ప్ర‌య్న‌తించారు. దీంతో త‌న త‌ల్లిదండ్రులు ర‌క్ష‌ణ క‌ల్పించ‌మ‌ని కోరారు. మేం వారిని సంర‌క్షిస్తున్నాం"అని వివ‌రించింది. బాబుతోపాటు ఆ కుటుంబమూ సాధార‌ణ జీవితం గ‌డుపుతోంద‌ని తెలిపింది. ఎవ‌రూ త‌మ‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని ఆ కుటుంబం భావిస్తోంద‌ని వివ‌రించింది. ఇదే విష‌యాన్ని చైనా ప‌దేప‌దే చెబుతూ వ‌చ్చింది. కొన్నిసార్లు ఏదో జ‌రిగింద‌నే తెలియ‌జెప్పే సంకేతాల‌నూ చైనా ప్ర‌భుత్వం ఇచ్చింది. 1998లో పంచెన్ లామా త‌ల్లి జైలు శిక్ష అనుభ‌విస్తున్నార‌ని వ‌ర్కింగ్ గ్రూప్‌కు చైనా తెలిపింది. అయితే ఈ శిక్ష ఎందుకు విధించారు? ఎంత‌కాలం పాటు విధించారు? లాంటి విష‌యాల‌పై స్పందించ‌లేదు. ఈ అంశంపై కొన్ని సంస్థ‌లు, కొంద‌రు వ్య‌క్తులు కూడా స్పందించారు. క‌నిపించ‌కుండాపోయిన పంచెన్ లామాకు చెందిన రెండు ఫోటోల‌ను త‌మ అధికారుల‌కు చైనా చూపించింద‌ని 2000లో అప్ప‌టి బ్రిట‌న్ విదేశాంగ మంత్రి రాబిన్ కుక్ వెల్ల‌డించారు. టేబుల్ టెన్నిస్ ఆడుతున్న బాబు ఫోటో ఒక‌టి, బోర్డుపై చైనా అక్ష‌రాలు రాస్తున్న బాబు ఫోటో ఒక‌టి చూపించార‌ని తెలిపారు. అయితే ఆ ఫోటోల‌ను కేవ‌లం చూడ‌టానికి మాత్ర‌మే ఇచ్చార‌ని చెప్పారు. 2007లో టిబెట్‌ వెళ్లిన‌ప్పుడు కొంద‌రు టిబెట్ అధికారులు మాట్లాడారు. పంచెన్ లామా.. ప్ర‌శాంతంగా జీవించాల‌ని అనుకుంటున్నార‌ని, ఎవ‌రూ త‌న‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు అధికారులు విరించారు. భార‌త్‌లోని ధ‌ర్మ‌శాల‌లో ఉంటున్న టిబెట‌న్ అజ్ఞాత ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంపై స్పందించింది. పంచెన్ లామా సామాన్య జీవితం గ‌డుపుతున్నార‌ని, ఉద్యోగం కూడా చేస్తున్నార‌ని రెండేళ్ల క్రితం ఐరాస వ‌ర్కింగ్ క‌మిటీకి చైనా చెప్పిన‌ప్పుడు.. ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై స్పందించేందుకు చైనా ప్ర‌భుత్వం నిరాక‌రించింది.

ఆయ‌న్ను కుటుంబంతోపాటు ఎత్తుకెళ్లిపోయారు
ఐరాస మాన‌వ హ‌క్కుల నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా పంచెన్ లామాను చైనా మాయం చేసింద‌ని ఐరాస వ‌ర్కింగ్ గ్రూప్‌లో 2008 నుంచి 2014 మ‌ధ్య ప‌నిచేసిన ప్రొఫెస‌ర్ జెరెమీ సార్కిన్ వ్యాఖ్యానించారు. "చైనా చెబుతున్న మాట‌ల్లో నిజం లేదు. ఆయ‌న్ను కుటుంబంతోపాటు తీసుకుపోయారు"అని ఆయ‌న వివ‌రించారు. "ఆయ‌న సుర‌క్షితంగా ఉన్నారో లేదో చూసేందుకు మ‌మ్మ‌ల్ని అనుమ‌తించాలి" "తాను చేసిన త‌ప్పును బ‌హిరంగంగా ఒప్పుకొనేందుకు చైనా నిరాక‌రిస్తోంది"అని ఆయ‌న అన్నారు. తాము మాయం చేసిన ప్ర‌జ‌ల‌పై మాట్లాడేందుకు ఏ దేశ‌మూ ఒప్పుకోద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఆయ‌న లిస్బ‌న్‌‌లోని నోవా వ‌ర్సిటీలో ప‌నిచేస్తున్నారు. మ‌రోవైపు టిబెట్‌లో చైనా అణ‌చివేత విధానాల‌కు చాలా మంది మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని టిబెట‌న్ వ్య‌వ‌హారాల‌పై అధ్య‌య‌నం చేస్తున్న రాబ‌ర్ట్ బార్నెట్ వివ‌రించారు. "టిబెటన్ల మ‌న‌సులు గెలుచుకోవ‌డంలో చైనా విజ‌యం సాధించ‌లేదు. కానీ చైనా చేస్తుంది స‌రైన‌దేన‌ని చైనాలోని 140 కోట్ల మంది న‌మ్ముతున్న‌ప్పుడు.. ఇంకేం చేయ‌గ‌లం"అని లండ‌న్‌లోని స్కూల్ ఫ‌ర్ ఓరియెంట‌ల్ అండ్ ఆఫ్రిక‌న్ స్ట‌డీస్‌లో ప‌నిచేస్తున్న ఆయ‌న వ్యాఖ్య‌నించారు.

అయితే టిబెట్‌పై త‌మ ఆధిప‌త్యాన్ని చైనా నాయ‌కులు ఎప్పుడూ ఆస్వాదించ‌లేక‌పోయారని ఆయ‌న అన్నారు. "అది చాలా సంక్లిష్ట‌మైన ప‌రిస్థితి. త‌మ ప‌రిపాల‌న కూలిపోతుందేమోన‌నే భ‌యంలోనే వారెప్పుడూ ఉంటారు" గెధుమ్ స‌మాచారాన్ని క‌నుక్కొనేందుకు టిబెట్ అజ్ఞాత ప్ర‌భుత్వం ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఎలాంటి సమాచార‌మూ బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌డాన్ని చూస్తుంటే టిబెట్‌పై చైనా ప‌ట్టు ఏ స్థాయిలో ఉందో అర్థ‌మ‌వుతుంది. గెధున్ బ‌తికే ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం అందింద‌ని రెండేళ్ల క్రితం ద‌లైలామా చెప్పారు. ఆ త‌ర్వాత ఈ అంశంపై ఎలాంటి స్పంద‌నా లేదు. ఆరేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు తీసిన ఆ ఫోటో త‌ప్పా త‌మ ద‌గ్గ‌ర మ‌రే స‌మాచార‌మూలేద‌ని టిబెట్ అజ్ఞాత ప్ర‌భుత్వ ప్ర‌తినిధి సోన‌మ్ షెరింగ్ తెలిపారు. ఏదో ఒక‌రోజు పంచెన్ లామాను చూస్తామ‌నే ఆశ‌తో తాము ఉన్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. పంచెన్ లామాకోసం బౌద్ధారామాల్లో టిబెట‌న్లు ప్రార్థ‌న‌లు చేస్తున్నార‌ని వివ‌రించారు.
------------------------------------------------------------

This is a Tibetan Gedun Choki Nima photo. He is one of the world's most respected world leaders. This photo was taken when he was six years old. This is the only photo available to the public. He looks like a brick with pink cheeks. He is now 31 years old. Three days after he was diagnosed as the Panchen Lama, he lost his family in China. The event was 25 years old on May 17. The Panchen Lama is the second most prominent figure in Tibetan Buddhism. The two have no say in what happened to him after his disappearance. China-bound Tibetans want Ayan to be released today. But only the Chinese officials knew where he was. Now no one thinks they open their mouths and tell the truth. "It looks like we have been blown away," commented Sonam Schering, a Tibetan stalwart in London. The suffering of those who want to release the Panchen Lama today is understandable. The case is eyeing the ability of Chinese leaders to do whatever they want without having to face any consequences.

The UN Working Group has been trying since 1995 to find out what happened to the Panchen Lama. The two men, however, could not know what kind of companion they were. The UN team released a statement on the work they had done just a few weeks after the Panchen Lama disappeared 25 years ago. "The Chinese government has responded several times to this matter, but they have not been able to resolve the amnesty case. Therefore, the case remains the same." The Working Group said in its annual report that six years had passed since the request was not approved. "We expect a positive response in the near future," the report said. There are many factors that prevent this six-year-old boy from becoming China. In Tibetan Buddhism, the Dalai Lama was the last one, the Panchen Lama. The Dalai Lama is the leader of the Tibetans who have exercised Chinese dominance over the Tibetan region. In 1959 he returned to Tibet. Experts are of the opinion that China thinks that the Panchen Lama should not become a civilian leader, just like the Dalai Lama. After Gedhun's disappearance, China declared another as the Panchen Lama. On the other hand, many believe that China will choose the Dalai Lama after its death.

How has China changed?
In the past 25 years, there has been some talk about the disappearance of the Panchen Lama. And they responded in a way that they could not. China responded to the UN Working Group as soon as it failed. There is no case that Gedhun disappeared or that his family could not be found. All this is explained by the Dalai Lama Group woven fabric. In 1996 China changed the word. "Some righteous and unscrupulous people have tried to take the baby abroad. Babu and his family have lived a normal life. The family explained that no one wants to embarrass Tama. China has repeatedly said the same thing. China also gave signs that sometimes something happened. China told the Working Group that in 1998, the Panchen Lama Tali was jailed. But why is this punishment imposed? For how long? Did not respond to such matters. Some organizations and some respondents have responded to the issue. In 2000, British Foreign Minister Robin Cook revealed that China had shown two photos of the missing Panchen Lama to Chinese officials. The photo of Babu playing table tennis and the Chinese lettering on the board showed the photo. However, the photos were given only for viewing. When visiting Tibet in 2007, some Tibetan officials spoke. Officials say that the Panchen Lama wants to live peacefully and that no one wants to embarrass him. The Tibetan anonymous elite in Dharamshala in India have also responded to the issue. Two years ago, China told the United Nations Working Committee that the Panchen Lama was living a normal life and was working. The Chinese government has refused to respond to the statement.

He was taken with his family
Professor Jeremy Sarkin, who worked at the UN Working Group from 2008 to 2014, commented that China has eaten the Panchen Lama in defiance of UN human rights regulations. "China's words are not true. He was taken with his family," he explained. "Mummies should be allowed to see if they are safe," he said, adding that "China is refusing to admit its attack publicly." He remarked that no country is willing to talk about the people they ate. They are currently working at the Nova University in Lisbon. Robert Barnett, who studies Tibetan expenditure, explained that on the other hand, Tibetan opposition to China's repressive policies is very important. "China has not succeeded in winning the Tibetans, but when 140 million people in China believe that China is doing the right thing," commented on the School for Oriental and African Studies in London.

Chinese leaders, however, have never been able to enjoy their domination over Tibet, he said. "It is a very complex situation. They are always in fear of collapsing." Two years ago, the Dalai Lama said that Gedhun was still alive and had been promised a trustworthy age. Since then there has been no response to the issue. The photo, taken at the age of six, was a close-knit affair, said Sonam Schering, a representative of the Tibetan anarchy. He explained that they were hoping to someday see the Panchen Lama. He explained that the Tibetans are praying in Buddhists for the Panchen Lama.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !