నేపాల్ ధిక్కారం.. ఆ భూభాగం తనదేనని ఘీంకారం
కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపించే అధికారిక రాజకీయ మ్యాప్‌ను నేపాల్ కేబినెట్ ఆమోదిస్తూ, ఓ సంచలన అడుగు వేసింది. మహాకాలీ నది మొదలయ్యేది లింపియాధురాలోనేనని నేపాల్ మరోసారి నొక్కిచెప్పింది. ప్రస్తుతం భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో ఈ లింపియాధురా ప్రాంతం ఉంది. భారత్ మాత్రం నేపాల్ వాదనను తిరస్కరిస్తూ వస్తోంది. టిబెట్‌లో ఉండే మానస సరోవర్‌కు వెళ్లే లిపులేఖ్ మార్గంలో ఓ సరిహద్దు రహదారిని భారత్ పది రోజుల క్రితం ప్రారంభించింది. దీనిపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాఠ్‌మాండూలోని వీధుల్లో భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఆ దేశ పార్లమెంటులోనూ భారత్ తీరుపై నిరసన వ్యక్తమైంది.
అంతకుముందు ఆరు నెలల క్రితం జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త రాజకీయ మ్యాప్‌లో లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్‌లను భారత్ తమ భూభాగాలుగా చూపించింది. అయితే, ఇవి తమ భూభాగాలని నేపాల్ చాలా కాలంగా వాదిస్తోంది. నేపాల్ కేబినెట్ తాజా నిర్ణయం కొత్త ఆరంభమని, కొత్త విషయం మాత్రం కాదని ఆ దేశ మంత్రి గణ్‌శ్యామ్ భూసల్ కాంతిపుర్ టీవీతో అన్నారు. ‘‘మహాకాలీ నదికి తూర్పున ఉన్న ప్రాంతం నేపాల్‌కు చెందుతుందని మేం చాలా కాలంగా చెబుతూనే ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా ఆ ప్రాంతాలను మ్యాప్‌లో చూపించింది’’ అని చెప్పారు. అయితే, భారత ప్రభుత్వంతో ఈ విషయానికి సంబంధించి దౌత్యపరమైన చర్చలు కొనసాగుతాయని గణ్‌శ్యామ్ తెలిపారు.
1816 ఆంగ్లో-నేపాల్ సుగాలీ ఒప్పందం ప్రకారం మహాకాలీ నది మొదలయ్యే ప్రాంతం లింపియాధుర అని నేపాల్ పదేపదే అంటోంది. ఈ నదికి తూర్పునున్న ప్రాంతం తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తోంది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం మహాకాలీ నది లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలకు తూర్పున మొదలవుతుందని వాదిస్తోంది. కోవిడ్-19 సంక్షోభం ముగిసిన తర్వాత భారత్, నేపాల్‌ల మధ్య విదేశాంగ కార్యదర్శి స్థాయిలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నేపాల్ కేబినెట్ సోమవారం మ్యాప్‌పై తాజా నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతరత్రా చోట్ల ఇకపై ఇదే మ్యాప్‌ను వాడాలని వివిధ ప్రభుత్వ విభాగాలకు నేపాల్ ప్రభుత్వం సూచించే అవకాశం ఉంది. భారత్ మే 8న కాలాపానీ, గంజీ ప్రాంతాల గుండా లిపులేఖ్ మార్గంలో సరిహద్దు రహదారిని తెరిచిన తర్వాత... కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవని నేపాల్ మళ్లీ గొంతెత్తింది. కాఠ్‌మాండూలోని భారత రాయబారికి, భారత విదేశాంగ శాఖకు తమ అభ్యంతరాలను తెలియజేసింది.
కోవిడ్-19పై పోరాటంలో భారత్, నేపాల్‌ల మధ్య సహకారం కొనసాగుతున్నా, సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ పరిణామం నేపాల్‌ను సరిహద్దు భద్రత విషయమై దృష్టి సారించేలా చేసింది. గంజీ-లిపులేఖ్ మార్గం ప్రారంభమైయ్యాక, చరిత్రలో తొలిసారి నేపాల్ తమ సశస్త్ర సీమా బల్ (ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్)కు చెందిన బృందాన్ని లిపులేఖ్‌కు దక్షిణాన ఉన్న ఛాంగ్రూ గ్రామానికి పంపింది. రెండు రోజుల తర్వాత నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి తమ ప్రభుత్వ వార్షిక ప్రణాళికలు, విధానాల గురించి చేసిన ప్రకటనలో సరిహద్దు భద్రత అంశానికి ప్రాధాన్యతను ఇచ్చారు. 500 ఏపీఎఫ్ సరిహద్దు శిబిరాలను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించారు. వీటిలో ఎక్కువ భాగం భారత్-నేపాల్ సరిహద్దు (1880 కి.మీ.లు) వెంబడే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చైనా-నేపాల్ సరిహద్దు (1440 కి.మీ.లు) వెంబడి పదికిపైగా శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, భూ ఆక్రమణలను నిరోధించడం లక్ష్యంగా నేపాల్ ఈ నిర్ణయాలు తీసుకుంది.
-------------------------------------------------------------------
The Nepal Cabinet has approved a formal political map showing the areas of Kalapani, Lipulekh and Limpiyadura as their territories. Nepal has once again asserted that the Mahakali River originated in Limpiyadhura. It is currently located in Uttarakhand, India. India is rejecting Nepal's claim. Ten days ago India opened a border road on the Lipulekh route to Manas Sarovar in Tibet. Nepal government has strongly objected to this. There were protests against India on the streets of Kathmandu. The country's parliament also protested against India.
In a new political map released after the partition of Jammu and Kashmir six months ago, India showed its territories as Limpiyadhura, Kalapani and Lipulek. However, Nepal has long advocated these territories. "The Nepal cabinet's latest decision is a new beginning, not a new one," the country's minister, Ganshyam Bhusal, told Kantipur TV. We have long been saying that the area east of the Mahakali River belongs to Nepal. The government has now officially shown those areas on the map, said the telephone. "Diplomatic talks with the Indian government will continue," Ganshyam said.
According to the Anglo-Nepal Sugali Treaty of 1816, Nepali has repeatedly been said that the place where the river Mahakali originates is Limpiyadura. It claims that the area east of the river falls under it. However, the Government of India claims that the Mahakali River starts east of Limpiyadura and Lipulekh. After the end of the Kovid-19 crisis, there are likely to be talks between India and Nepal at the Foreign Secretary level. The Nepal Cabinet on Monday made the latest decision on the map. The government of Nepal is likely to suggest to various government departments that the same map should be used in all educational institutions, government offices and elsewhere. After India opened the border road on the Lipulekh route through the Kalapani and Ganji areas on May 8 ... Nepal again clashed with the Kalapani and Lipulekh areas. The Indian Ambassador to Kathmandu and the Indian Foreign Ministry have expressed their objections.
While India and Nepal continue to cooperate in the fight against Kovid-19, tensions have arisen between the two countries over borders. This has caused Nepal to focus on border security. For the first time in history, Nepal sent a team of its Sasastra Seema Bal (Armed Police Force) to Changru village, south of Lippulek, when the Ganji-Lipulekh route began. Two days later, Nepal's President Bidya Devi Bhandari made the announcement of her government's annual plans and policies a top priority for border security. Plans for setting up 500 APF border camps have been announced. Most of these will be set up along the India-Nepal border (1880 km). He explained that more than ten camps have been set up along the China-Nepal border (1440 km). These decisions have been made by Nepal with the aim of strengthening border security and preventing land encroachments.
Comments
Post a Comment