దాయాది కంచె ఎందుకు వేస్తలేదో..!


భారత్, చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల గురించి భారత మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇలాంటి సరిహద్దు రేఖ మరొకటి ఉంది. అక్కడే జరిగే కార్యకాలాపాలను మాత్రం ఎవరూ పెద్దగా గమనించడం లేదు. ఇరాన్‌తో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సు సరిహద్దు పంచుకుంటుంది. సరిహద్దుకు సమీపంలోనే పాకిస్తాన్ భద్రతాదళాలకు చెందిన ఆరుగురు సైనికులు ఇటీవల మరణించారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని రిమోట్ కంట్రోల్‌తో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)తో ఎవరో పేల్చేశారు. మరణించిన సైనికుల్లో ఓ మేజర్ స్థాయి అధికారి ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ (డీజీ ఐఐఎస్‌పీఆర్) చెప్పిన వివరాల ప్రకారం ఈ సైనికుల బృందం పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుకు 14 కి.మీ.ల దూరంలోని ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. అక్కడి పర్వత ప్రాంతాల్లో మిలిటెంట్లు ఉండే అవకాశమున్న రహదారుల్లో ఆ బృందం అప్పుడు తనిఖీలు చేస్తూ ఉంది. ఆ తర్వాత నాలుగు రోజులకు, మే 12న పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ జావెద్ బాజ్వా ఇరాన్ సైన్యాధిపతి మేజర్ జనరల్ బఘెరీకి ఫోన్ చేశారు. పాకిస్తాన్ సైనికుల మృతి విషయమై విచారం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో కంచె వేసే పని మొదలుపెట్టామని, ఈ విషయంలో రెండు పక్షాల మధ్య సహకారం అవసరమని చెప్పారు.

ఆ మరుసటి రోజు పరిస్థితులను సమీక్షించేందుకు బలూచిస్తాన్ రాజధాని క్వెటాకు బాజ్వా వెళ్లారు. భద్రతపరైమన పరిస్థితులు, కార్యనిర్వాహక సన్నద్ధత, పాక్-అఫ్గాన్, పాక్-ఇరాన్ సరిహద్దుల్లో కంచె వయడం, వాటి నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించినట్లు ఐఎస్‌పీఆర్ తెలిపింది. మరి, పొరుగుదేశం భారత్‌తో కంచె గురించి మాత్రం పాకిస్తాన్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం పాకిస్తాన్ భౌగోళిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్‌కు నాలుగు దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. అత్యల్పంగా చైనాతో సుమారు 599 కి.మీ. పొడవున ఆ దేశానికి సరిహద్దు ఉంది. ఇరాన్‌తో 909 కి.మీ.ల పొడవున, అఫ్గానిస్తాన్‌తో 2,611 కి.మీ.ల పొడవున పాక్ సరిహద్దులు పంచుకుంటోంది. పాక్ సరిహద్దు పంచుకుంటోంది అత్యధికంగా భారత్‌తోనే. అంతర్జాతీయ సరిహద్దు, వర్కింగ్ బౌండరీ, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) కలగలసి సుమారు 3,163 పొడవున ఈ సరిహద్దు ఉంది. మరి, దీనంతటికీ పాక్ కంచె ఎందుకు వేయడం లేదు? ఆ రెండు దేశాలతో సరిహద్దులకు మాత్రమే కంచె ఎందుకు వేస్తోంది?

కంచె వల్ల ఎవరికి ప్రయోజనం?
భారత్‌తో సరిహద్దుల్లో కంచె వేయడం గురించి పాకిస్తాన్ ఎప్పుడూ ప్రణాళికలు వేయలేదని ఇస్లామాబాద్‌లోని జిన్నా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్న సల్మాన్ జైదీ అంటున్నారు. ‘‘ఇరాన్‌తో సరిహద్దుల్లో రెండు వైపులా తక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలపై ప్రభుత్వ నియంత్రణ బలహీనంగా ఉంది. అందుకే నిషేధిత సంస్థలు, దొంగలు, అక్రమ కార్యకలాపాలకు ఆ ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య కంచె గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. సరిహద్దుకు రెండు వైపులా ప్రభుత్వంపై దాడులు జరుగుతుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వమే బాగా కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కంచె వేయడం గురించి కూడా ప్రకటించింది’’ అని చెప్పారు. ‘‘పది రోజుల క్రితం 950 కి.మీ.ల పొడవున 300 కోట్ల రూపాయలతో సరిహద్దు కంచె వేసే ప్రతిపాదన గురించి ప్రకటించారు. కంచె విషయమై మొదట్లో ఇరాన్, పాకిస్తాన్ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. రెండు దేశాలకూ అక్రమ కార్యకలాపాల సమస్య దీనితో దూరమవుతుంది. ఇక అఫ్గానిస్తాన్ విషయానికి వస్తే... అమెరికా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య దశాబ్దం కన్నా ఎక్కువ కాలం నుంచి జరుగుతున్న చర్చలు సరిహద్దుల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యాయి. ఈ ప్రాంతాల్లో మిలిటెంట్ల రాకపోకలు సాగుతున్నాయి’’ అని జైదీ చెప్పారు. డూరండ్ రేఖను అఫ్గానిస్తాన్ ప్రభుత్వం సరిహద్దుగా ఒప్పుకోవడం లేదని, అందుకే కంచె ఏర్పాటులో పాకిస్తాన్‌తో అంగీకారానికి రావడం లేదని జైదీ చెప్పారు. ‘‘మిలిటెంట్లు పాక్‌లోకి ప్రవేశిస్తుండటాన్ని, దాడులకు పాల్పడుతుండటాన్ని అఫ్గాన్ అడ్డుకోలేకపోతోంది. దీంతో పాకిస్తాన్ ఏకపక్షంగా కంచె వేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ కంచె ఈ ఏడాది పూర్తవుతుంది’’ అని అన్నారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో శత్రువులు లేరని, అయినప్పటికీ ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో భద్రత దళాల మోహరింపు ఉందని జైదీ చెప్పారు. ‘‘రెండు దేశాల సైన్యాలు కలిసి ఇక్కడ గస్తీ విధులు నిర్వర్తిస్తాయి. ఇక్కడ కంచె వేసే ప్రశ్నే లేదు. ఈ ప్రాంతంలో చొరబాట్లు కూడా సులభం కాదు’’ అని అన్నారు.

భారత్‌తో కంచె ఎందుకు వేయట్లేదంటే...
ఈ విషయమై పాకిస్తాన్‌కు, భారత్‌కు యుద్ధాలు జరిగాయి. రెండు దేశాల మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. భారత్‌లో అస్థిరతను ఏర్పరిచేందుకు పాక్ చొరబాట్లకు పాల్పడుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఐఎస్‌పీఆర్ ఈ విషయంలో ఏ వివరణలూ ఇవ్వలేదు. ‘‘భద్రతపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు కంచె వేస్తారు. చొరబాట్లను అడ్డుకునేందుకు అంటూ భారత్ కంచె వేసింది. పాకిస్తాన్ దీన్ని వ్యతిరేకించలేదు. కానీ, ఈ ప్రాంతాలు, అక్కడి జనాల భద్రత గురించిన బాధ్యత భారత్‌పై ఉంది. స్వయంగా కంచె వేసుకుంది కాబట్టి, సరిహద్దుల్లో చొరబాట్ల గురించి ప్రశ్నించలేదు’’ అని జైదీ అభిప్రాయపడ్డారు. పాక్ వైఖరిలో మరో సందేశం దాగుందని భారత్‌లోని నిపుణులు అంటున్నారు. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్‌ల‌తో తమకున్న సరిహద్దులను పటిష్ఠం చేసుకోవాలని పాక్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సరిహద్దుల్లో చొరబాట్లు సులభంగా జరిగే అవకాశం ఉండటంతో, మిలిటెంట్ దాడులు జరుగుతూ ఉంటాయి. భారత్‌తో సరిహద్దుల్లో పాకిస్తాన్‌కు కంచె అవసరం లేదు. ఎందుకంటే భారత్ బాధ్యతాయుతంగా నడుచుకునే ఓ ప్రజాస్వామ్య దేశం. పాకిస్తాన్‌కు నష్టం చేయడానికి మిలిటెంట్లను పోషించదు’’ అని భారత సైన్యం మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ అన్నారు. కంచె వేయకపోవడం ద్వారా భారత్ వైపు నుంచి చొరబాట్లు లేవని, అక్రమ కార్యకలాపాలు జరగడం లేదని పాకిస్తాన్ ఓవిధంగా అంగీకరించినట్లేనని భారత సరిహద్దు భద్రత తళం (బీఎస్ఎఫ్) మాజీ అడిషనల్ డీజీ సంజీవ్ కృష్ణన్ సూద్ అన్నారు. పాకిస్తాన్ కంచె వేస్తే, ఆ దేశం సరిహద్దులు దాటించేందుకు పంపుతున్నవారిని పట్టుకోవడం భారత్‌కు సులభమయ్యేదని చెప్పారు.
------------------------------------------------------

There are reports in the Indian media about clashes in some areas along the Line of Control (LAC) between Indian and Chinese soldiers. However, there is another such line of demarcation. There is no major observation of the proceedings. The Balochistan province of Pakistan shares its border with Iran. Six soldiers of Pakistani security forces were killed recently near the border. Someone bombed the passing vehicle with an Improvised Explosive Device (IED) with remote control. Among the dead soldiers was a major-level officer. According to the Director General of the Pakistan Army Public Relations Department (DG IISPR), the group was on patrol duty on a 14 km border with Pakistan-Iran border. The group then inspected the highways where the militants were likely to be located. Four days later, on the 12th of May, Pakistan's Commander-in-Chief Qamar Javed Bajwa telephoned Major General Bagheri, the Army Commander of Iran. He lamented the death of Pakistani soldiers. He said the fence work on the borders has begun and cooperation between the two parties is needed.

The next day Bajwa went to Quetta, the capital of Balochistan, to review the situation. ISPR said he had reviewed the security situation, operational preparedness, fence on Pak-Afghan and Pak-Iran borders and their management. And why does Pakistan not care about the fence with neighboring India? To answer this question we need to understand the geographical situation of Pakistan. Pakistan has borders with four countries. The lowest is about 599 km with China. The country borders on the length. Pakistan shares borders with Iran at 909 km and Afghanistan at 2,611 km. Pakistan shares its border with India. The border is approximately 3,163 in length with the International Boundary, Working Boundary and Line of Control (LOC). And why isn't Pak fencing all this? Why is the fence only bordering on those two countries?

Who benefits from the fence?
Salman Zaidi, the program director at the Jinnah Institute in Islamabad, says Pakistan has never planned to build a fence on the border with India. There are less developed areas on both sides of the border with Iran. Government control over these areas is weak. That is why these areas have become centers for banned organizations, thieves and illegal activity. The fence between Pakistan and Iran has been debated for many years. This is because there are attacks on the government on both sides of the border. Now the government of Pakistan is starting to take drastic measures. The announcement of the fence is also said to be a telephone number. Ten days ago it was announced that the proposed Rs. 300 crore cross-border fence along the 950 km stretch. Iran and Pakistan have been consensus on the fence. The problem of illicit activity for both countries is far from over. And when it comes to Afghanistan ... The negotiations that have been going on for more than a decade between the US, Afghanistan and Pakistan have failed to make stringent security arrangements across borders. The arrival of militants in these areas is a telephone line, Zaidi said. Zaidi said that the Afghan government was not accepting the Durand Line as a fence and therefore did not agree with Pakistan on the construction of the fence. Afghanistan is unable to prevent militants from entering Pakistan and carrying out attacks. This led to Pakistan's decision to unilaterally block the fence. The fence is expected to be completed this year. Zaidi said there were no enemies on the border of China and Pakistan, though there was a large number of security forces deployed in the area. The armies of the two countries work together here. There is no question of fencing. He said intrusion in the area was not easy.

Why not fence with India ...
There were wars for Pakistan and India in this regard. There are many disputes between the two countries. There are also allegations that Pak infiltrated India to create instability in India. Pakistan ISPR has not provided any explanation for this. A fence to overcome security concerns. India fenced to prevent the intrusion. Pakistan is not opposed to this. But India is responsible for the safety of these areas and its people. Zaidi believes that since the fence by itself, there is no question of infiltration of borders. Experts in India say there is another message in Pakistan's attitude. Pak attempts to consolidate its borders with Iran and Afghanistan Militant attacks are on the rise, with easy access to these borders. Pakistan does not need a fence on its borders with India. Because India is a responsible democratic country. Bikram Singh, a former Chief of Army Staff General of the Indian Army, said the militants do not play militants to damage Pakistan. India has said that Pakistan did not accept that there was no infiltration and illegal activity from India by not using the fence.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !