Posts

కరోనా కలిపింది..

Image
గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఓ బాలీవుడ్‌ జంటకు మాత్రం మంచే చేసింది. గతంలో విడిపోయిన వాళ్లిద్దరినీ మళ్లీ ఒక దగ్గరకు చేర్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 14 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తన భార్య సుసానే ఖాన్ నుంచి 2014లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయినా తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. హృతిక్ పిల్లల్ని హాలీడే టూర్లకు తీసుకెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.  ప్రస్తుతం కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో తమ పిల్లల కోసం హృతిక్, సుసానే ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలు హ్రేహాన్, హృదాన్‌కు అండగా నిలిచేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హృతిక్ వెల్లడించాడు. ఈ 21 రోజులు తమందరం కలిసే ఉంటామని తెలిపాడు.  ‘కొద్ది రోజులుగా సుసానే మా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది. పిల్లల పట్ల తన ప్రేమకు ఇది నిదర్శనం. తల్లిదండ్రులగా మన బాధ్యతలను గుర్తు చేస్తూ నీవు తీసుకున్న ఈ నిర్ణయానికి, కో-పేరెంటింగ్‌లో నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ సుసానే’ ...

చెత్త బండిలో అంతిమయాత్ర

Image
కరోనా వైరస్‌ భయం పెద్దపల్లి జిల్లాలో మహా విషాదాన్ని నింపింది.‌ ధర్మారం మండలం నందిమేడారంలో కొసరి రాజవ్వ (55 ) అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ రాలేదు. దీంతో కడసారి చూపుకు నోచుకోక అనాథ శవంలా మారింది. సంతానం లేని రాజవ్వ భర్త అంజయ్య 2 నెలల క్రితం చనిపోయారు.‌ అప్పటి నుంచి మానసిక ఆందోళనలో ఉన్న రాజవ్వ నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే కరోనా భయంతో ఎవరు రాజవ్వ మృతదేహాన్ని చూడటానికి రాలేకపోయారు. 24 గంటలు గడిచిన ఎవరు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చివరకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాజవ్వ శవాన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి చెత్తను తరలించే రిక్షాలో అంతిమయాత్రకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో రాజవ్వ శవం అనాథగా తరలిపోవడం చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని అభిప్రాయపడ్డారు. --------------------------------------------------------------------------------- Fear of coronavirus has caused great tragedy in Periyap...

గడ్డి తింటున్న మోదీ ఓటర్లు !

Image
ఏకంగా మన ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజల లాక్ డౌన్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక్కడి పేద ప్రజలు తినడానికి తిండి దొరక్కపోవడంతో గతి లేక నిజంగానే పచ్చి గడ్డినే ఆహారంగా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ హృదయవిదారక దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాలను చూస్తున్న నెటిజన్లు ప్రధాని నియోజకవర్గ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే, మిగతా దేశ ప్రజల గతేంటోనని  గుప్పిస్తున్నారు.

ఇది చూస్తే.. "అది" మళ్లీ తినరు !!

అవును కాకా ఇది నిజం!నిజంగానే ఈ వీడియో చూస్తే.. కచ్చితంగా మీరు ఎంతో ఇష్టంగా తినే ఆ ప్రత్యేక పదార్థాన్ని మళ్లీ జీవితంలో ముట్టరు! అదేమిటో మీరే చూడండి..

విష ప్రచార ఫలితం.. 300 ప్రాణాలు !

Image
వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్‌లో భయానక పరిస్థితి నెలకొంది. ప్రాణాంతక వైరస్‌ సోకుతుందనే భయంతో ప్రజలు ఇండస్ర్టియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. మెథనాల్‌ను తాగడంతో ఇప్పటివరకూ ఇరాన్‌లో 300 మంది మరణించగా, 1000 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ఇరాన్‌ మీడియా పేర్కొంది. ఇరాన్‌లో ఆల్కహాల్‌పై నిషేధం అమల్లో ఉండగా సోషల్‌మీడియాలో కరోనాకు విరుగుడు అంటూ సాగుతున్న ప్రచారంతో ఇలాంటి అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. విస్కీ, తేనె సేవించడం ద్వారా కరోనా వైరస్‌ నుంచి బ్రిటన్‌ టీచర్‌ సహా మరికొందరు బయటపడ్డారని ఇరాన్‌ సోషల్‌మీడియాలో మెసేజ్‌లు ముంచెత్తడంతో ప్రజలు ఇలాంటి తప్పుడు సలహాలకు ప్రభావితమై ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. ఆల్కహాల్‌తో కూడిన హ్యాండ్‌ శానిటైజర్ల వాడకంపై సాగిన ప్రచారంతో కొందరు అత్యంత ప్రభావవంతమైన ఆల్కహాల్‌ను సేవిస్తే అది వైరస్‌ను చంపివేస్తుందనే అపోహతో మెథనాల్‌ను తీసుకుంటున్నారు. ఆల్కహాల్‌ జీర్ణ వ‍్యవస్థను పరిశుద్ధం చేస్తుందనే ప్రచారంలో నిజం లేదని ఇరాన్‌ వైద్యులు డాక్టర్‌ జావద్‌ సమన్‌ స్పష్టం చేశారు. మెథనా...

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

ప్రస్తుతం ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కు ఎంతగా అలవాటు పడ్డారో తెలిసిందే! అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినే వారందరూ ఆ ఫుడ్ ను ఎక్కువగా టమాటా సాస్ లేదా చిల్లీ సాస్ తో ఆస్వాదిస్తుంటారని కూడా తెలిసిందే! అయితే ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఆస్వాదిస్తున్న ఈ "సాస్" ఎలా తయారవుతుందో చాలా మందికి తెలియదు. ఒకవేళ అదిగానీ తెలిస్తే ఎవరూ కూడా జీవితంలో మళ్లీ ఎలాంటి సాస్ జోలికి వెళ్లరు. మరి ఆ సాస్ ఎలా తయారవుతుందో మీరే వీడియోలో చూడండి..

ఫైనల్లీ.. కదిలిన ప్రిన్సెస్ డైమండ్

Image
కదిలిన  ఫిబ్ర‌వ‌రిలో సుమారు మూడు వేల మంది ప్ర‌యాణికుల‌తో డైమండ్ ప్రిన్సెస్ నౌక జ‌పాన్‌లోని యొక‌హోమా తీరంలో నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. కోవిడ్‌19 నేప‌థ్యంలో ఆ భారీ నౌక‌ను నిలిపివేశారు. అయితే రెండు నెల‌ల క్వారెంటైన్ త‌ర్వాత ఆ నౌక ఇవాళ యెక‌హోమా తీరం నుంచి క‌దిలి వెళ్లింది. మ‌ళ్లీ మే నెల‌లో అది స‌ర్వీసు స్టార్ట్ చేయ‌నున్న‌ది. జ‌పాన్‌కు చెందిన కార్నివ‌ల్ సంస్థ ఈ నౌక‌ను ఆప‌రేట్ చేస్తున్న‌ది. షిప్‌ను పూర్తిగా డిస్ఇన్‌ఫెక్ట్ చేసిన త‌ర్వాత దానికి స‌ర్టిఫికెట్ ఇచ్చారు. 3711 మంది ప్ర‌యాణికుల‌తో ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన డైమండ్ ప్రిన్సెస్ నౌక యొక‌హోమా తీరంలో ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఆ షిప్‌లో 712 మంది క‌రోనా పాజిటివ్‌గా తేలారు. మ‌రో పది మంది మృతిచెందారు. ల‌గ్జ‌రీ క్రూయిజ్ స‌ర్వీసుల‌కు కావాల్సిన అన్ని వ‌స్తువుల‌ను డైకోకూ తీరంలో తీసుకోనున్నారు. మ‌ళ్లీ మే 16వ తేదీన డైమండ్ ప్రిన్సెస్ ఎనిమిది రోజుల ట్రిప్ స్టార్ట్ చేయ‌నున్న‌ది. అయితే అప్ప‌టికి ప‌రిస్థితులు అనుకూలిస్తే ఆ టూర్ ఉంటుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. --------------------------------------------------------------------------------- ...

పల్లెకోసం.. మేముసైతం

Image
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామాలు నడుం బిగించాయి. పల్లె ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కలిగించే పనిలో నిమగ్నమయ్యారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వడంతో పల్లెల్లోని ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో వార్డుసభ్యులు మొదలుకొని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు మంగళవారం రాత్రి నుంచే రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా కార్మికులకు అండగా ఉంటూ బ్లీచింగ్‌, ఫినాయిల్‌ చల్లడంలో పాలుపంచుకొంటున్నారు. గ్రామాల్లో దుకాణాల దగ్గరకు వెళ్లేవారిని కనీసదూరం పాటించేలా ఉంచడంతోపాటు కరోనా ఎలా వ్యాప్తి చెందుతున్నదో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల సరిహద్దుల్లో ముండ్ల కంచెలు, రాళ్ల కంచెలు ఏర్పాటు చేసుకొన్నారు. ‘మా గ్రామానికి రావద్దు’ అంటూ బోర్డులు పెట్టారు. దీంతో రాష్ట్రంలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాల సరిహద్దుల్లో కాపలా బాధ్యతలను భుజాలకెత్తుకొన్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మదపురం సర్పంచ్‌ ఉడుత అఖిల, వరం...

కాబూల్ లో మారణహోమం

Image
కాబూల్‌లోని గురుద్వారాపై ఐసిస్ ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 25 మంది సిక్కులు మరణించారు. ఓ వైపు యావత్ ప్రపంచం సమష్టిగా కరోనో వైరస్ వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యమవుతుంటే ఈ ముష్కరులు  మానవత్వానికే మచ్చ తెచ్చారు. ఈ మానవత్వ ఈ శత్రువుల ఆకృత్యానికి బలైన వారి ఆర్తనాదాలతో  బుధవారం కాబూల్ వీధులు మార్మోగాయి. అక్కడి హృదయ విదారక, బాధాకరమైన దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి. ప్రస్తుత కరోనా విపత్తును ఎదుర్కోవడానికి సిక్కులు ఎంతో మంది ఆపన్నుల ఆకలి తీరుస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ వంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే! మానవాళికి సహాయం చేస్తున్న సిక్కు సమాజంపై జరిగిన ఈ దాడిని అన్ని దేశాల ప్రజలు తీవ్రంగా ఖండించారు. ఈ కఠినమైన కాలంలో సిక్కులకు సంఘీభావం తెలిపారు. ------------------------------------------------------------------------------------------------------ ISIS militants carried out a fierce attack on a gurdwara in Kabul. About 25 Sikhs were killed in the attack. On the one hand, if the whole world is involved in the fig...

బ్రిటన్ కు ప్రిన్స్ షాక్ !

Image
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్లు. ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారని క్లారెన్స్ హౌస్ తెలిపింది. క్విన్ ఎలిజబెత్ II పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఆఫీసు బుధవారం ధ్రువీకరించింది. 71 ఏళ్ల చార్లెస్‌లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆయన కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయనని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని క్లారెన్స్ హౌస్ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఆయన ఇంట్లో నుంచి పని చేస్తున్నారని స్పష్టం చేసింది. ఆయన భార్య కమిల్లా (72)కు కూడా కోవిడ్ పరీక్షలు చేయగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య స్కాట్లాండ్‌లోని తమ నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరికి అబెర్డీన్‌‌షైర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ సర్వీస్ కరోనా పరీక్షలు నిర్వహించింది. గత కొద్ది వారాల్లో చార్లెస్ చాలా మందిని కలిశారు. ఈ నెల ఆరంభంలో ప్రిన్స్ చార్లెస్ మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్‌ను కలిశారు. మార్చి 19న ఆల్బర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది....

దాయాది దేశంలోనూ మహమ్మారి ఉగ్రరూపం

Image
క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మృతుల సంఖ్య 18,810కి చేరింది. కాగా 4,21,413 మంది ఈ వ్యాధి బారిన ప‌డ్డారు. యూరోపియ‌న్ దేశాల్లో క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు యూరోపియ‌న్ దేశాల్లో 10 వేలకు పైగా మృతి చెందారు. 1,95,000 మంది క‌రోనాతో బాధ ప‌డుతున్నారు. ఇక అమెరికాలో రోజురోజుకు క‌రోనా మృతుల సంఖ్య పెరుగుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికార ప్ర‌తినిధి మార్గ‌రెట్ హ‌రిస్ పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ ను అరిక‌ట్టేందుకు ప్ర‌పంచ దేశాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. నిన్న అర్ధ‌రాత్రి నుంచి భార‌త్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. పాకిస్తాన్ లోనూ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. పాక్ లో కరోనా బారిన ప‌డ్డ వారి సంఖ్య 959కి చేరుకోగా, మృతుల సంఖ్య 9కి చేరుకుంది. అక్క‌డ అత్య‌ధికంగా సింధూ ప్రావిన్స్ లో 410, పంజాబ్ ప్రావిన్స్ లో 267 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు స్వ‌దేశీ విమానాల‌ను పాక్ ప్రభుత్వం రద్దు చేసింది. --------------------------------------------------------------- The coronavirus is haunting the world. Worldwide, Corona de...